E-Paper
Advertisement

కార్తీక దీపం 2.. ఏప్రిల్ 1: జ్యో ప్లాన్ సక్సెస్.. పారిజాతం మాటలకు ఫ్యూజుల్ అవుట్.. నిజం బయటపడుతుందా..?

కార్తీక దీపం 2.. ఏప్రిల్ 1: జ్యో ప్లాన్ సక్సెస్.. పారిజాతం మాటలకు ఫ్యూజుల్ అవుట్.. నిజం బయటపడుతుందా..?
Advertisement

Karthika Deepam 2 Episode April1st: నిన్నటి ఎపిసోడ్ లో.. దాస్ దీపను సొంత మనుమరాలు పారిజాతంతో చెప్పడంతో ఆమె చాలా సంతోషంగా నా మనవరాలు దొరికేసింది అని అనుకుంటుంది. ఇక దీప దగ్గరికి వెళ్లి ఒక్కసారిగా తన ప్రేమను మొత్తం కురిపిస్తుంది. ఎప్పుడు మాటలతో విరుచుకు పడే పారిజాతం ఇలా సాఫ్ట్ గా కనిపించడంతో ఇంట్లోని వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. ఏమైంది అసలు ఎందుకు మా అమ్మ ఇలా చేస్తుంది అని తన కూతురు కూడా ఆలోచిస్తూ ఉంటుంది. కార్తీక్ కి నిజం తెలుస్తుందేమోనని ఎంతో జాగ్రత్తగా మేనేజ్ చేస్తుంది పారిజాతం.. ఆఖరికి సౌర్యను కూడా గుండెలకు హత్తుకుని తన ప్రేమను కురిపిస్తుంది.. అటు జ్యో ఆస్తి గురించి చర్చలు జరగడం ఏదోలా ఉంది దీనికి ఎలాగైనా సరే పుల్ స్టాప్ పెట్టేయాలి అని ఫిక్స్ అవుతుంది. ఇంట్లో అందరినీ పిలిచి గెట్ టుగెదర్ పార్టీ లాగా ఏర్పాటు చేయాలనుకుంటున్నాను.. అమ్మ సంతోషంగా హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చింది కదా ఈ సందర్భంగా ఈ పార్టీని ఏర్పాటు చేసి అందరికీ సంతోషాన్ని పంచాలని అనుకుంటున్నాను అని చెప్తుంది.. ఇక పారిజాతం ఆ ఇంటికి వచ్చిన విషయాన్ని కార్తీక్ వాళ్ళ తాతకు వీడియోతో సహా పంపించి పారిజాతంని అడ్డంగా దొరికిపోయాలా చేస్తాడు.. జ్యో కు మాత్రం గ్రానీ అక్కడకు ఎందుకు వెళ్లిందో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది.. ఏదో సంథింగ్ జరుగుతుంది అదేంటో రేపు కనిపెడతాను అని అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే… ఆ జ్యో ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియదు.. ఈమధ్య అది బాగా ఎత్తిపడేస్తూ వస్తుంది. నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది.. ఎంత చదువు చదివి తన సంస్కారం ఏమైపోయిందో అర్థం కావడం లేదు అని కార్తీక్ వాళ్ళమ్మ మాట్లాడుతుంది. అసలు ఆస్తులు గురించి టాపిక్ వచ్చింది కదా.. మొత్తం ఆస్తిని కార్తీక్ మీద రాస్తానని మా అన్నయ్య అన్నాడు కదా.. అందుకే ఏదైనా గొడవ చేస్తే ఇంట్లో వాళ్ళందరూ తిడతారని ఇలా పార్టీ ఏర్పాటు చేసి అందరి చేత సంతకాలు పెట్టించుకోవాలని అనుకుంటుందేమో అని అంటుంది. కార్తీక్ మాత్రం అలాంటివి ఏమీ జరగవులేమా ఎందుకు అలా ఆలోచిస్తావు? తను వాళ్ళ అమ్మ కోలుకొని ఇంటికి వచ్చినందుకు పార్టీ ఇవ్వాలని అనుకుంటుంది.. అదే అయ్యుంటుంది ఇంకేమీ లేదులే మీరు తప్పుగా ఆలోచించకండి అని కార్తీక్ అంటాడు..

Advertisement

మీరు వెళ్తున్నారా అని కార్తీక్ వాళ్ళ అమ్మ అడుగుతుంది.. స్వయంగా మా నాన్నే రమ్మని పిలిచాడు కదా వెళ్లకపోతే బాగోదేమో అని ఆమె అంటుంది. ఎవరేమన్నా పడాలి కదా మా నాన్న రమ్మని చెప్పాడు తన కోసమైనా వెళ్లాలి కదా అని అంటుంది.. ఆ తర్వాత కాశి తన మరదలు పైన ప్రేమని తన అత్తతో చెబుతూ ఉంటాడు.. చిన్నప్పటినుంచి తనంటే నాకు చాలా ఇష్టం. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు.. తను నన్ను ఒప్పుకుంటే బాగుంటుంది తన నా జీవితంలో ఉండాలని కోరుకుంటున్నానని కాశి అంటాడు. కానీ స్వప్న మాత్రం తనకు వేరే వ్యక్తి అంటే ఇష్టము అని చెప్తుంది. కాసిని అవమానించేలా మాట్లాడుతుంది. అదంతా విన్న దాసు ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని కలపాలి అని అనుకుంటాడు..

ఇక దీప కార్తీక్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా.. ఈరోజు పరిస్థితి ఏంటో జ్యోష్ణ దీప కు ఫోన్ చేస్తుంది. ఎవరో కాదు మీ మరదలే ఫోన్ చేస్తుంది అని అనగానే.. ఏదో మాట్లాడు అని దీపతో అంటాడు కార్తీక్.. తనతో మాట్లాడి అనవసరంగా మనము బాధపడడం ఎందుకు.? అసలు ఎందుకు ఫోన్ చేస్తుందో ఒకసారి మాట్లాడి చూడు అని కార్తీక్ అంటాడు.. ఫోన్ లిఫ్ట్ చెయ్ కానీ తాను వెటకారంగా మాట్లాడడంతో ఒక్కసారిగా వంటలక్క కూడా రెచ్చిపోతుంది.. నువ్వు ఇంతగానో పిలిచిన తర్వాత రాకుండా ఎలా ఉంటాను అని దీప అంటుంది. ఇక ఆ తర్వాత జ్యో నీకు ఈరోజు తో నూకల చెల్లి పోతాయి ఇక నీ పీడ శాశ్వతంగా విరగడైపోతుంది అని అనుకుంటుంది. ఇక పారిజాతం దీప నీవల్లని పిలిచారా లేదా అని పదేపదే అడుగుతుంది.. అసలు ఈ గ్రానీకి ఏమైంది అని ఆలోచిస్తూ ఉంటుంది.

Advertisement

జ్యో పారిజాతం ని ఒకవైపు పిలుస్తున్న సరే తను మాత్రం దీప వాళ్లు వస్తున్నారు కదా నేను వెళ్ళాలి.. దీప వాళ్ళని చూసి పారిజాతం చాలా సంతోషంగా ఉంటుంది. తనని గుండెలకు హత్తుకుని బోడి మేడతో ఎలా ఉంటావో నా నగలు వేసుకొని అంటుంది. జోష్నా కఠినంగా మాట్లాడినందుకు మమ్మల్ని క్షమించండి అని ఆమె తల్లిదండ్రులు అంటారు.. ఈ పార్టీని ఎందుకు ఏర్పాటు చేసిందో అర్థం కావడం లేదని తన మామయ్య అంటాడు. మనం ఎప్పటికీ ఇలాగే కలిసుండాలి అని ఈ పార్టీని అరేంజ్ చేశాను అని తను చెప్పగానే అందరూ నమ్మకపోయినా కూడా పర్వాలేదు మంచే చేసింది అని అనుకుంటారు.. పారిజాతం చేస్తున్న పనిని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. ఇక అందరూ లోపలికి వెళ్ళిపోతారు..

Also Read :‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ వేదవతి సాంపాదించిన ఆస్తులు.. అస్సలు నమ్మలేరు..

కార్తీక్ దాసు దగ్గరికి వచ్చి జ్యోష్న కు దీప ని గ్రానీ ఇంతగా పిలుస్తుంది ప్రేమను చూపిస్తుంది అని అర్థం కావడం లేదు.. మా అమ్మకి నేను అబద్ధం చెప్పాను అని చెప్తే బాగా ఫీలవుతుందేమో అని దాసు అంటాడు.. పర్వాలేదు మామయ్య అమ్మమ్మ కు ఇలా కావాల్సిందే అని కార్తీక్ అంటాడు.. లోపలకు వెళ్ళిన తర్వాత పారిజాతం సౌర్యకి ఏం కావాలి అని అడుగుతుంది. ఫ్రిడ్జ్ లో పెట్టిన ఐస్ క్రీమ్ ఉంది కదా నేను వెళ్లి తెచ్చుకుంటాను అని పౌర్య వెళ్ళబోతుంటే ఎదురుగా ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చినా జ్యోను గుద్దేసింది.. అది చూసిన పారిజాతం రెచ్చిపోయి కళ్ళు కనిపించట్లేదని చెంప పగలగొడుతుంది. తను తన తప్పులేదు అని ఎంతగా చెప్పాలని ప్రయత్నించినా సరే.. పారిజాతం మాత్రం వినకుండా మళ్లీ దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×