E-Paper
Advertisement

నిండు నూరేళ్ల సావాసం ఏఫ్రిల్‌ 1: అమర్ కు అబద్దం చెప్పిన యాదమ్మ 

నిండు నూరేళ్ల సావాసం ఏఫ్రిల్‌ 1: అమర్ కు అబద్దం చెప్పిన యాదమ్మ 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  రణవీర్‌ ఇంటి  నుంచి తిరిగి వస్తారు రాథోడ్‌, మిస్సమ్మ ఇద్దరూ ఇంటికి రాగానే మిస్సమ్మ, అమర్‌ను మెచ్చుకుంటుంది. ఏమో అనుకున్నాను కానీ మా ఆయన మామూలు ఆయన కాదు రాథోడ్‌ ఆయన తెలివే తెలివి అంటుంది. దీంతో రాథోడ్ కూడా మరి సార్‌ అంటే ఏమనుకుంటున్నావు మిస్సమ్మ. మా సారు స్కెచ్‌ వేశారంటే ఎలాంటి వారైనా పడిపోవాల్సిందే.. అనగానే.. మిస్సమ్మ కూడా అవును తీవ్రవాదుల మెడలు వంచిన ఆయనకు ఈ రణవీర్‌ ఒక్క లెక్కా అంటుంది. దీంతో రాథోడ్‌ వాడికి ఎక్కడో సుడి ఉంది మిస్సమ్మ ప్రతిసారి తృటిలో తప్పించుకుంటున్నాడు. ఈ సారి మైకంలో మనోహరి గురించి చెప్పేస్తాడు అనుకున్నాను చెప్పి ఉంటే ఈ పాటికి సార్‌ చేతిలో ఆ మనోహరికి చెప్పు దెబ్బలు పడి ఉండేవి.. అనగానే..

ఎంత చెడ్డవాళ్లైనా ఒక టైం వస్తుంది రాథోడ్‌.. శిశుపాలుడిని వంద తప్పులు చేసేదాకా క్షమించిన శ్రీకృష్ణుడు వందో తప్పు చేయగానే శిక్షించాడు. అలాగే మనోహరి, రణవీర్‌ ల పాపాలు పండి వాళ్లకు  శిక్ష పడే టైం కూడా వస్తుంది అనగానే.. రాథోడ్‌ అవును మిస్సమ్మ అంటాడు. ఇంతలో యాదమ్మ రూంలోంచి పైకి వెళ్లబోతుంటే.. రాథోడ్‌ యాదమ్మ ఇలా రా అని పిలవగానే దగ్గరకు వస్తుంది. మీ మేడం ఎక్కడ యాదమ్మ అని అడగ్గానే… యాదమ్మ కంగారు పడుతూ మా మేడం ఎవరు..? అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ ఏం తెలియనట్టు నటించకు.. మనోహరి ఎక్కడ..? అని అడగ్గానే.. నాకు తెలియదు అండి అని చెప్తుంది యాదమ్మ.. దీంతో రాథోడ్‌ కోపంగా అదేంటి ఇద్దరు ఎప్పుడూ పక్కపక్కనే రాసుకుని పూసుకుని తిరుగుతుంటారు కదా..? అని అడగ్గానే.. యాదమ్మ నేను ఈ ఇంటికి కేర్‌ టేకర్‌ను మనోహరి గారికి కాదు అని చెప్పగానే..

Advertisement

అయితే మనోహరి ఎక్కడికి వెల్లిందో నీకు తెలియదు అంటావు అంతేనా..? అని అడగ్గానే.. ఇంతలో లాల్‌సింగ్‌ భార్య అమృత వచ్చి మనోహరి బయటకు వెళ్లింది కదా..? అని చెప్పగానే.. మిస్సమ్మ, రాథోడ్‌, యాదమ్మ షాక్‌ అవుతారు. అప్పుడే ఇంట్లోకి అమర్‌, లాల్‌సింగ్‌ వస్తుంటారు.. రాథోడ్‌ ఎప్పుడు వెళ్లింది మేడం అని అడగ్గానే.. అమృత ఇందాక పార్టీ జరుగుతున్నప్పుడు రణవీర్‌కు మందు ఎక్కువైతే మా ఆయన అమర్‌ అన్నయ్య కలిసి రణవీర్‌ను తీసుకెళ్లి పోయారు కదా అప్పుడే మనోహరి గారు కూడా బయటకు వెళ్లిపోయారు అని చెప్పగానే.. లోపలికి వచ్చి విన్న అమర్‌, లాల్‌సింగ్‌ షాక్‌ అవుతారు. అమర్‌ ఏంటి యాదమ్మ మనోహరి బయటకు వెళ్లిందా..? అని అడగ్గానే.. యాదమ్మ షాక్‌ అవుతుంది. సార్‌ అది మేడం నాతో తలనొప్పి అని చెప్పి పడుకుంటానని చెప్పి వెళ్లింది.. అనగానే.. అంటే ఆవిడ రూంలోనే పడుకుని ఉందా.? ఏం అమృత నువ్వు ఆవిడ బయటకు వెళ్లింది అని చెప్తున్నావు.. అని లాల్‌సింగ్‌ అడగ్గానే.. అమృత కూడా మనోహరి బయటకు వెళ్లడం నేను చూశాను లాల్‌ అనగానే.. అమర్‌ కోపంగా యాదమ్మ నిజం చెప్పు మనోహరి బయటకు వెళ్లిందా..? ఇంట్లోనే ఉందా..? అని అడగ్గానే.. యాదమ్మ నేను నిజమే చెప్తున్నాను సార్‌ అంటుంది.

దీంతో మిస్సమ్మ తను ఇంట్లో ఉందో లేదో గదిలోకి వెళ్లి చూస్తే తెలిసిపోతుంది కదా… అనగానే.. యాదమ్మ నేను వెళ్లి చూస్తాను మేడం అనగానే.. లాల్‌సింగ్‌ నువ్వు ఆగు .. అమృతం నువ్వు వెళ్లి చూడు అని చెప్పగానే.. అమృత పైకి వెళ్తుంది.  మనోహరి రూంలోకి వెళ్లి చూడగానే.. మనోహరి బెడ్‌ మీద పడుకుని ఉంటుంది. దీంతో అమృత తను ఇందాక బయటకు వెళ్లింది కదా లోపలికి ఎప్పుడు వచ్చింది అని మనసులో అనుకుని వెళ్లిపోతుంది.  అమృత వెళ్లిపోయాక మనోహరి కళ్లు తెరచి చూస్తుంది.  ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×