E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today march 10th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  దీపను చంపేస్తానన్న జ్యోత్న్స

Karthika Deepam 2 Serial Today march 10th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  దీపను చంపేస్తానన్న జ్యోత్న్స
Advertisement

Karthika Deepam 2  serial today Episode:  

హాస్పిటల్‌ లో ఉన్న కార్తీక్‌ దగ్గరకు నర్సు వెళ్లి దీపకు టెస్టులు చేయాలట అని చెప్తుంది అలాగే మీకోసం మీ నాన్న గారు పాపను తీసుకుని వచ్చారు అని చెప్తుంది. దీంతో కార్తీక్ బయటకు వెళ్తాడు. అక్కడ శ్రీధర్, శౌర్య ఉంటారు. పాపను ఎందుకు తీసుకొచ్చారు అని కార్తీక్‌ అడగ్గానే.. పాప అమ్మ కావాలని అడుగుతుంది. నీకు ఫోన్‌ చేశాను నువ్వు లిఫ్ట్ చేయకపోయే సరికి తీసుకొచ్చాను అని చెప్తాడు శ్రీధర్‌. ఇంతలో శౌర్య కోపంగా కార్తీక్‌ను అబద్దం ఎందుకు చెప్పావు అని అడుగుతుంది. దీంతో నీకు లాగే అమ్మ కడుపులో ఉన్న పాపకు కూడా జ్వరం వచ్చింది అందుకే ఇక్కడిక వచ్చాము అని చెప్తాడు కార్తీక్. ఇంతలో గైనకాలజిస్ట్‌, డాక్టర్‌ హారిక వస్తారు.

దీపకు టెస్టులు చేయాలని చెప్తుంది డాక్టర్‌. దీంతో అక్కడే ఉన్న శ్రీధర్‌ మీరు ఎన్ని టెస్టులైన చేయండి. కానీ, తల్లి బిడ్డను కాపాడండి అంటాడు.. దీంతో గైనకాలజిస్ట్‌ షాక్‌ అవుతుంది. తల్లి బిడ్డను కాపాడటం ఏంటీ, వద్దనుకున్నారుగా. వద్దనుకున్నాకా కాపాడటానికి ఏముంటుంది అంటూ చెప్తుండగానే.. కార్తీక్‌ మధ్యలో కల్పించుకుని అదే టెస్టుల వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయన్నారు, అందుకే వద్దన్నాను అంటూ నిజం చెప్పొద్దని కార్తీక్‌ డాక్టర్‌కు సైగ చేస్తాడు. అంతా శ్రీధర్‌ గమనిస్తాడు. కానీ డాక్టర్‌ హారిక కన్వీన్స్‌ చేస్తుంది. ఇక శౌర్యను తీసుకెళ్లమని కార్తీక్‌ చెప్పగానే.. శౌర్య డాక్టర్‌ దగ్గరకు వెళ్లి మా అమ్మ కడుపులో ఉన్న పాపకు ఏమీ కానివ్వనని మాట ఇవ్వమని డాక్టర్‌ను అడుగుతుంది. తర్వాత శ్రీధర్‌, శౌర్యను తీసుకుని వెళ్లిపోతాడు.

Advertisement

దాసును కలిసిన జ్యోత్స్న కోపంగా నన్ను ఎందుకు పిలిచావు.. నిజం చెప్పడానికా..? సాయం చేయడానికా..? అని అడగ్గానే.. దాసు కోపంగా నువ్వు లేని భయాలు మోసుకుంటూ తిరుగుతున్నావ్ అనగానే.. అయితే నేను నీ కూతురు కాదని చచ్చిపోయిన నీ భార్య మీద ఒట్టేసి చెప్పు అంటుంది జ్యోత్స్న. దాసు షాక్‌ అవుతాడు. నేను దశరథ కూతురు అని డాక్టర్ కన్ఫర్మ్ చేసింది. దాన్ని అంతా నమ్ముతున్నారు. ఇది అంతా అబద్ధం అని తెలిసి, నా వెనుక ఏదైనా చేస్తే మాత్రం అంటూ జ్యోత్స్న కోపంగా చెప్పబోతుంటే.. వెంటనే దాసు చంపేస్తావా..? అంటాడు.

దీంతో జ్యోత్స్న  నేను ఎవరిని ఏం చేయను, కానీ, ఒకటి మాత్రం జరుగుతుంది. ఇప్పుడు మీరంతా కలిసి దీప స్థానం నాదని ప్రూవ్ చేస్తే నేను బతకను నాన్న చచ్చిపోతాను అంటూ బెదిరిస్తుంది జ్యోత్స్న. దాసు షాక్‌ అవుతాడు. దూరం నుంచి దశరథ జ్యోత్స్న మాటలు వింటుంటాడు. తాను చనిపోయినా దీపను మాత్రం వదలనని మీరు దీపను కాపాడాలనుకున్నా తాను చంపేస్తానని వార్నింగ్‌ ఇస్తుంది జ్యోత్స్న. దీపను చంపేందుకు అన్ని ఏర్పాట్లు చేశాను.. దీపను ఎవరు..? ఎప్పుడు..? ఎక్కడ..? ఎలా చంపుతారో మీరు ఊహించలేరు అంటూ చెప్పగానే.. దాసు, దశరథ షాక్‌ అవుతారు.

Advertisement

ఇక ఇంటికి వెల్లిన శ్రీధర్‌ డాక్టర్‌ మాటలు గుర్తు చేసుకుని ఆలోచిస్తుంటాడు. కార్తీక్ తన దగ్గర ఏదో దాస్తున్నాడని కాంచనతో చెప్తాడు. బిడ్డ విషయంలో ఏదో దాస్తున్నారని చెప్తాడు. దీంతో కాంచన కోపంగా అప్పుడు నా కోడలినే కాదు నా కొడుకును కూడా క్షమించను అంటుంది. దీంతో నిజమేంటో కాంచనకు తెలియకుండా తాను తెలుసుకోవాలనుకుంటాడు శ్రీధర్‌. ఇక దాసు, దశరథ ఇద్దరూ జ్యోత్స్న గురించి ఆలోచిస్తారు. జ్యోత్స్న ఏదో చేసే వరకు చూడటం కాదు నా బిడ్డను నేను కాపాడుకుంటాను అంటాడు దశరథ. ఇక హాస్పిటల్‌ లో ఉన్న దీప శ్రీధర్‌కు అనుమానం వచ్చిందని అత్తయ్యకు చెప్తాడని అంటుంది. దీంతో చెప్పినా ఏదో ఒకటి చెబుదాం అంటూ కార్తీక్‌, దీపను నవ్విస్తాడు.  ఇంతటితో నేటి కార్తీకదీపం 2 సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×