E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today march 13th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్, దీపలను నిలదీసిన కాంచన  

Karthika Deepam 2 Serial Today march 13th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్, దీపలను నిలదీసిన కాంచన  
Advertisement

Karthika Deepam 2  serial today Episode:  

దీపను జ్యోత్స్న గన్‌తో కాల్చేసినట్టు కలగంటాడు దశరథ. వెంటనే ఉలిక్కిపడి కళ్లు తెరచి చూస్తాడు.. చుట్టూ అందరూ మాట్లాడుతూనే ఉంటారు. దశరథ మాత్రం జ్యోత్స్న దీపను చంపేస్తానని దాస్‌తో చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. దీంతో జ్యోత్న్న కోపంగా నువ్వెందుకు దీపని నిజం చెప్పనివ్వకుండా అడ్డుపడుతున్నావని అడుగుతుంది. పారిజాతం కూడా  డాక్టర్‌ మాటలు బట్టి చూస్తే.. నీ కోడలు నీతో అబద్ధం చెప్పిందని నీకు స్పష్టంగా అర్ధమైంది. నీ కోడలు చెప్పిన అబద్ధానికి నీ కొడుకు సపోర్ట్ చేస్తున్నాడని కూడా అర్ధమైంది. నీ కొడుకు నీకు అబద్ధం చెప్పడానికి నీ కోడలే కారణం కాబట్టి.. ఇప్పుడు నీకు నిజం తెలియాలంటే ఎవరినీ అడగాలి అంటుంది.

ఇక జ్యోత్స్న కూడా దశరథ ఎప్పుడూ దీపనే సమర్థిస్తాడని చెప్తుంది. శివనారాయణ కూడా జ్యోత్స్న మాటలను సమర్థిస్తాడు. డాక్టర్ చెప్పిన మాటలు విన్న తర్వాత కార్తీక్‌, దీపల మీద నమ్మకం పోయిందని చెప్తాడు. మళ్లీ మీ మీద నమ్మకం వస్తుందా? రాదా? అనేది మీరు చెప్పే నిజాన్ని బట్టి ఉంటుందని అంటాడు. అయితే తర్వాత మాట్లాడుకుందా అని కార్తీక్ చెబితే కాంచన ఇప్పుడే ఇక్కడే అన్ని నిజాలు తెలియాలి అంటుంది. ఈ తప్పు అంతటిక దీప కారణం కాదు కార్తీక్‌ అంటుంది. కాంచన మాటలకు అందరూ షాక్ అవతారు. అయితే ఈ విషయంలో కార్తీక్‌ ను  తప్పు పట్టొద్దని దీప చెప్పగానే.. అయితే డాక్టర్‌ చెప్పింది తప్పంటారా.? అంటూ కాంచన ప్రశ్నిస్తుంది. దీంతో కార్తీక్‌ ఇక్కడ ఏ నిజం లేదు.. మమ్మల్ని హాస్పిటల్‌కు వెళ్లనివ్వండి అనగానే.. కాంచన కోపంగా నిజం చెప్పేంత వరకు మీరు ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదని.. లేదంటే తనను చంపేసినంత ఒట్టు అని చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు.

Advertisement

అయితే కార్తీక్‌ ఏం చేయలేదని.. తన కడుపులో బిడ్డను తానే వద్దనుకుంటున్నానని దీప చెప్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. కట్‌ చేస్తే.. స్వప్న, కాశీలను దాస్‌ పెళ్లి రోజు గురించి నిలదీస్తుంటాడు. ఈరోజు మీ పెళ్లి రోజని మీకు గుర్తుందా..? అంటూ ప్రశ్నిస్తాడు. ఇది గుర్తుంచుకునేంత గొప్ప రోజు కాదని స్వప్న చెప్పగానే.. అయితే నుదుట్లో దిద్దుకున్న సింధూరాన్ని చెరిపేయమని కావేరి చెప్తుంది. దీంతో స్వప్న షాక్‌ అవుతుంది.  తన నిర్ణయానికి కాశీ కూడా కారణమేనని చెప్తుంది స్వప్న.. దీంతో ఇద్దరిని ఒంటరిగా వదిలేద్దామని దాస్‌, కావేరి వెళ్లిపోతారు.

మరోవైపు బిడ్డను కనడం నాకు ఇష్టం లేదు.. అందుకే బిడ్డ వల్ల నాకు సమస్య ఉందని బావతో అబద్ధం చెప్పించానని దీప అనడంతో అంతా షాక్‌ అవుతారు. ఆడ పుట్టుక పుట్టిన ఏ ఆడకూతురైనా బిడ్డను వద్దు అనుకుంటుందా..? అంటూ పారిజాతం, దీపను తిడుతుంది. దీప మాత్రం మీరు సరిగానే విన్నారు అత్తయ్య.. నేను ఈ బిడ్డను కనలేను, వదిలించుకోవడానికే ఆసుపత్రికి వెళ్లాను అంటుంది దీప.

Advertisement

దీంతో కాంచన కోపంగా అలాంటప్పుడు బిడ్డను నా చేతుల్లో పెడతానని నాకు మాటెందుకు ఇచ్చావు అంటూ ప్రశ్నిస్తుంది. అసలు బిడ్డను ఎందుకు వద్దనుకుంటున్నావు అంటూ ప్రశ్నించగానే.. డాక్టర్‌ వాయిస్‌ వినిపిస్తుంది జ్యోత్స్న. దీప ఈ బిడ్డను వద్దనుకుంటే.. మళ్లీ జీవితంలో తల్లి కాలేదని చెప్తుంది డాక్టర్‌. అది విని అందరూ షాక్‌ అవుతారు. కాంచన కోపంగా మీ ఇద్దరికీ ముందే తెలిసి కూడా నన్ను మోసం చేశారా..? అంటూ నిలదీస్తుంది. ఈ విషయంలో దీపను డాడీ ప్రశ్నించాలని జ్యోత్స్న చెప్తుంది. అప్పుడే శివనారాయణ కూడా పారిజాతాన్ని తిడతాడు ముందే తెలిసినా ఎందుకు చెప్పలేదని నిలదీస్తాడు.  ఇంతటితో నేటి కార్తీకదీపం 2 సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×