E-Paper
Advertisement

Nagar kurnool Crime: దారుణమైన ఘటన.. ముగ్గురు క్లాస్‌మేట్లపై ఇంటర్ స్టూడెంట్అత్యాచారం, ఆపై బ్లాక్‌మెయిల్

Nagar kurnool Crime: దారుణమైన ఘటన.. ముగ్గురు క్లాస్‌మేట్లపై ఇంటర్ స్టూడెంట్అత్యాచారం, ఆపై బ్లాక్‌మెయిల్
Advertisement

Nagar kurnool Crime: సభ్య సమాజం తలదించుకునే ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తనతో పాటు చదువుతున్న ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు క్లాస్‌మేట్. అంతేకాదు ఆయా దృశ్యాలను ఫోన్‌తో చిత్రీకరించి వారిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. బాలికల్లో ఒకరు గర్భం దాల్చారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వెలుగు చూసింది.

నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో దారుణమైన ఘటన

Advertisement

చేతిలో మొబైల్ వచ్చిన తర్వాత మంచి కంటే.. చెడుకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు నేటి యువకులు. ఫలితంగా అనేక అనర్థాలు జరుగుతున్నాయి. ఎప్పుడూ వినని ఘటనలు సైతం చోటు చేసుకుంటున్నాయి. చదువుకోవాల్సిన వయసులో ఓ ఇంటర్ విద్యార్థి కామాంధుడిగా మారిపోయాడు. అంతేకాదు తనతో చదువుతున్న ముగ్గురు బాలికల జీవితాలను నాశనం చేశాడు. ప్రేమ పేరుతో ఒకరికి తెలియకుండా మరొకర్ని లోబర్చుకున్నాడు.

నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్ మండలానికి చెందిన ఓ విద్యార్థి ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. తనతోపాటు చదువుతున్న పెద్దకొత్తపల్లి, నాగర్‌కర్నూల్, వనపర్తి ప్రాంతాలకు చెందిన ముగ్గురు బాలికలతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత దాన్ని ప్రేమగా మార్చుకున్నాడు. ఆ తర్వాత తనలోని కోరికలను తీర్చుకున్నాడు.

Advertisement

ముగ్గురు క్లాస్‌మేట్లపై ఇంటర్ స్టూడెంట్అత్యాచారం

అత్యాచారానికి పాల్పడిన దృశ్యాలను తన ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ వీడియోలు చూసి ముగ్గురు బాలికలను బ్లాక్ మెయిల్ చేశాడు. తనకు డబ్బులు ఇవ్వకుంటే సోషల్ మీడియా, తల్లిదండ్రులకు పంపిస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. రోజు రోజుకూ కామాంధుడి టార్చర్ ఎక్కువ కావడంతో తట్టుకోలేకపోయారు.

బాధితురాళ్లలో ఒకరు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఒక్కసారిగా వారంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే సదరు స్టూడెంట్‌ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అతడి వద్ద మొబైల్ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. చివరకు పోలీసులకు వాడ్ని అప్పగించి జరిగినదంతా చెప్పారు. పోలీసుల విచారణలో షాకైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ALSO READ: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్ బస్సు బోల్తా, స్పాట్‌లో 22 మంది

బాధితుల్లో ఓ బాలిక గర్భం దాల్చింది. యువతిని కొల్లాపూర్‌లోని ఓ ప్రైవేట్ క్లినిక్‌కు తీసుకెళ్లి అబార్షన్ చేయించాడు. నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ చేసిన ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్, నర్సును అరెస్ట్ చేశారు. ఆ క్లీనిక్ సెంటర్‌ని సీజ్ చేశారు. ముగ్గురు నిందితులకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక ప్రధాన నిందితుడు ఇంటర్ స్టూడెంట్‌ని జువైనల్ హోంకు తరలించారు పోలీసులు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×