E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today march 26th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నకు చెక్ పెట్టేందుకు దశరథ ప్లాన్ 

Karthika Deepam 2 Serial Today march 26th: ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్నకు చెక్ పెట్టేందుకు దశరథ ప్లాన్ 
Advertisement

Karthika Deepam 2  serial today Episode:  తన ఇంటికి వచ్చిన కార్తీక్‌, దీపలతో సుమిత్ర ఎమోషనల్‌గా మాట్లాడుతుంది. ఇద్దరు తల్లులకు రెండు బలమైన కోరికలు.. తీరే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ తీరాయి. నేను బ్రతికేశాను, నా వాళ్లందరితోనే నేను ఉన్నాను. నా కూతురి పెళ్లి చూడాలని నేను.. తన కొడుకు బిడ్డను చూడాలని వదిన..  ఈ రెండు మా ఇద్దరి కోరికలు..  నా కోరిక తీరకుండానే పోతానని అనుకున్నాను. కానీ మా కోరికలు బలమైనవి.. అవి నిజం కావడానికి రెండు ప్రాణాలు నిలబడ్డాయని ఎమోషనల్‌ అవుతుంది సుమిత్ర. అమ్మ కోసమైనా వీలైనంత త్వరగా జ్యోత్స్న పెళ్లి చేయమని దశరథకు దీప చెప్తుంది.

అయితే జ్యోత్స్న ఇప్పట్లో పెళ్లే చేసుకోనని కరాకండిగా చెప్పిందని దశరథ చెప్తాడు. దీంతో కార్తీక్‌ బాధగా ఇక్కడ పగలు అత్త ప్రశాంతంగా లేదు.. అక్కడ  అక్కడ దీప రాత్రుళ్లు నిద్రపోవడం లేదు. మీకు ఏదో అయిపోతుందని టెన్షన్‌ పడుతుంది అని చెప్తాడు.  ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండాలంటే జ్యోత్స్నకు పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపడమేనని బెటర్ అంటాడు కార్తీక్‌. అది అంత సులభంగా అయ్యే పని కాదని.. అసలు కన్న ప్రేమ గొప్పదా పెంచిన ప్రేమ గొప్పదా…? అంటూ దశరథ అడగ్గానే.. కన్నప్రేమ కంటే పెంచిన ప్రేమే గొప్పదని.. మనల్ని పెంచిన వాళ్లు మన రక్తం కాదు.. అయినా సరే వాళ్ల మీద ప్రేమను పెంచుకుంటామని… తనకు శౌర్య అంటే ఎంత ఇష్టమో చెప్తాడు కార్తీక్‌. కానీ నా కన్నకూతురు అనుకున్న జ్యోత్స్న.. నా కన్నకూతురు కాదని తెలిసింది. జ్యోత్స్న మంచి కూతురు కాదేమో కానీ నేను మాత్రం మంచి తండ్రినే అంటాడు దశరథ.

Advertisement

దీంతో కార్తీక్‌ తను ఈ ఇంటి వారసురాలు కాదని తెలిస్తే ఎక్కడ తన స్థానం పోతుందోనన్న భయమే.. జ్యోత్స్నని ప్రమాదకరంగా మార్చేసిందని చెప్పగానే.. అవును అదే భయం తను తన తల్లిని కాపాడేందుకు ఆపరేషన్ థియేటర్‌కి రావడానికి కారణం అయిందని అంటాడు దశరథ. అయితే ఇదంతా నాటకం అని తెలిసిన రోజున తన ఒరిజినాలిటీ బయటపడుతుంది. అప్పుడు  మనం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తాడు కార్తీక్‌.. అలాగే సుమిత్రకు నిజం చెప్పడానికి తనని మానసికంగా సిద్ధం చేయాలంటాడు దశరథ. ఈలోగా జ్యోత్స్నను పెళ్లికి ఒప్పించాలని.. తానే ఒప్పిస్తానని దశరథ చెప్పగానే.. ఏం చేయబోతున్నారని కార్తీక్‌ అడగ్గానే.. రేపు మీరే చూస్తారుగా అంటూ దశరథ వెళ్లిపోతాడు.

మరుసటి రోజు లాయరు ఇంటికి రావడంతో అందరూ షాక్‌ అవుతారు. శివనారాయణ ఏం లాయరు పిలవకుండానే వచ్చావు అంటూ అడగ్గానే.. దశరథ వచ్చి లాయరును నేనే రమ్మన్నాను అని చెప్తాడు. ఎందుకని శివనారాయణ అడగ్గానే.. వీలునామా మార్చి రాయించాను ఆస్థి మొత్తం నా పేరు మీద ఉండకూడదని దీప పేరు మీదకు ట్రాన్స్‌ఫర్‌ చేయించాను అంటూ దశరథ చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. ఈ ఆస్తి మొత్తం దశరథ గారి  మేనల్లుడి కుటుంబానికి చెందుతుందని లాయర్ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. అందరూ దశరథను తిడుతుంటే జ్యోత్స్న మాత్రం దీప, కార్తీక్ లను తిడుతుంది.

Advertisement

ఆస్తుల కోసమే ఉదయమే లేచి ఇంటికి వచ్చారా..? అంటూ నిలదీస్తుంది. దీంతో కార్తీక్‌ మేం వచ్చింది ఆప్తుల కోసం మాత్రమే ఆస్తుల్ని కొట్టేయడానికి కాదు.. మావయ్య వీలునామా మారుస్తాడని.. అందులో ఇలాంటి క్లాజ్‌ పెడతాడని మాకు తెలియదు అని చెప్పగానే.. అందరం హాల్లో‌ ఉంటే నువ్వు, దీప మాత్రం మా డాడీ వెంటే ఉన్నారు.. ఏదో చూడటానికి వచ్చినట్లు అత్తా, మావయ్య కూడా వచ్చారు. మీరొచ్చింది మా మమ్మీని పలకరించడానికి కాదు.. ఆస్తుల్ని కొట్టేయడానికే అంటూ కోపంగా లాయరును వీలునామ మార్చి రాయమని చెప్తుంది. దీంతో దశరథ కోపంగా నువ్వు నా కూతురువి కాదని చెప్పు ఇప్పుడే వీలునామా మారుస్తానని అంటాడు. దశరథ మాటలకు జ్యోత్స్న షాక్‌ అవుతుంది. ఇంతటితో నేటి కార్తీకదీపం 2 సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×