E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode May 16th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  కోత్త సీఈవోగా దీప – షాక్ లో జ్యోత్స్న

Karthika Deepam 2 Serial Today Episode May 16th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  కోత్త సీఈవోగా దీప – షాక్ లో జ్యోత్స్న
Advertisement

Karthika Deepam 2  serial today Episode: బోర్డు మెంబర్స్‌ కొందరు కార్తీక్‌ను సీఈవోగా బాధ్యతలు తీసుకోమని చెప్పగానే.. కార్తీక్‌ తాను తీసుకోలేనని తనకు ఇంకా వేరే బాధ్యతలు ఉన్నాయని చెప్పడంతో జ్యోత్స్న మాత్రం బావ ఏదో చేయబోతున్నాడు.. ఏం చేయబోతున్నాడబ్బా అని మనసులో అనుకుంటుంది. ఇంతలో శివనారాయణ నువ్వు ఏం అనుకుంటున్నావు ఎందుకు ఆపేస్తున్నావు..? దశరథ అంటూ అడగ్గానే.. దశరథ, శివనారాయణతో పర్సనల్‌ గా మాట్లాడాలి అని చెప్పగానే.. బోర్డు మీటింగ్‌ కు బ్రేక్‌ ఇచ్చి  దశరథ, శివనారాయణ పక్కకు వెళ్లి దశరథతో మాట్లాడుతుంటాడు. జ్యోత్స్నను సీఈవోను చేస్తే ఇక ఎప్పటికీ పెళ్లి చేసుకోదని చెప్తాడు. అప్పుడే అక్కడకు వెళ్లిన కార్తీక్‌ కూడా అదే చెప్తాడు. దీంతో శివనారాయణ మరి ఇప్పుడేం చేద్దాం అని అడగ్గానే.. కార్తీక్‌ అనుమానంగా ఒక సలహా ఇస్తాడు.

అదే సలహాతో దశరథ, శివనారాయణ, కార్తీక్‌ కలిసి బోర్డు మీటింగ్‌ హాల్లోకి వస్తారు. వాళ్లు వచ్చే లోపు జ్యోత్స్న టెన్షన్‌ పడుతూ.. వీళ్లేదో పెద్దగానే ప్లాన్‌ చేస్తున్నట్టు ఉంది. అని మనసులో అనుకుంటుంది. ఇంతలో శివనారాయణ ను బోర్డు మెంబర్స్‌ మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని అడగ్గానే.. శివనారాయణ చెప్పేది నేను కాదు దశరథ చెప్తాడు అనగానే.. జ్యోత్స్న షాక్‌ అవుతుంది. బోర్డు మెంబర్‌ ఎవరి చెబితే ఏంటండి ఎలాగూ సీఈవో అయ్యేది మీ మనవరాలే కదా..? అంటాడు.

Advertisement

దీంతో దశరథ కొత్త సీఈవోగా అర్హతలు ఉన్న వ్యక్తికి ఫోన్‌ చేశాను వస్తున్నారు. అని చెప్పగానే.. జ్యోత్స్న షాక్‌ అవుతుంది. తనను కాదని వీళ్లు ఎవరిని సీఈవోగా చేయాలనుకుంటున్నారు అని టెన్షన్‌ పడుతుంది. ఇంతలో అక్కడికి పారిజాతం వస్తుంది. తాతను కూడా ఒప్పించారంటే ఆ వచ్చేదెవరో నాకంటే తోపే అయ్యుండొచ్చు అనుకుంటుంది. ఇంతలో ఒక బోర్డు మెంబర్‌ ఆ సీఈవో ఎవరో మాకు చెప్తారా..? అని అడగ్గానే.. చెప్పడం ఎందుకు కాసేపు ఆగితే మీ ముందుకే వస్తారు అని చెప్తుండగానే.. పారిజాతం బోర్డు మీటింగ్‌ హాల్లోకి అడుగుపెడుతుంది. దీంతో జ్యోత్స్న షాక్‌ అవుతుంది. కొత్త సీఈవో గ్రానీనా..? అనగానే.. పారిజాతం షాక్‌ అవుతుంది. ఏంటి నేను సీఈవోనా..? అందుకేనా నన్ను పిలిచింది అంటూ ఆశ్చర్యపోతుంటే.. కార్తీక్‌ వెంటనే పారు ఒక్క నిమిషం నువ్వు కాస్త పక్కకు తప్పుకుంటే.. నీ వెనకాల ఉన్నవాళ్లు ముందుకు వస్తారు అనగానే..

నా వెనక ఎవరున్నారురా..? అంటూ తప్పుకుంటూ తిరిగి చూస్తుంది. దీప ఉంటుంది. దీపను చూసిన జ్యోత్స్న, పారిజాతం షాక్‌ అవుతారు. దశరథ దీపను పిలిచి బోర్డు మీటింగ్ లో కూర్చోబెడుతుంటే.. జ్యోత్స్న ఆపేస్తుంది. పనిమనుషులు ఈ మీటింగ్‌ హాల్లోకి కాఫీలు టీలు తీసుకురావాలి కానీ మీటింగ్‌కు రాకూడదు అనగానే.. దశరథ కోపంగా దీప ఇప్పుడు కొత్త సీఈవో అని చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. జ్యోత్స్న వ్యతిరేకిస్తుంది. బోర్డు మెంబర్స్‌ కూడా దీప బయటి వ్యక్తి కదా అని అడగ్గానే.. దశరథ దీప నా కూతురు అంటూ చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో దశరథ దీప నా చెల్లి కోడలు అయినప్పుడు నా కూతురే కదా అంటాడు. దీంతో అందరూ తమకు అభ్యంతరం లేదని చెప్పగానే.. జ్యోత్స్న మాత్రం అపోజ్‌ చేస్తుంది. సీఈవో కోసం ఓటింగ్‌ పెట్టమని చెప్తుంది.

Advertisement

పారిజాతం కూడా అదే కరెక్టు అని చెప్తుంది. ఒక బోర్డు మెంబర్‌ కూడా ఓటింగ్‌ పెట్టమని చెప్పగానే.. శివనారాయణ సరే అంటాడు. దీంతో బోర్డు మెంబర్‌ మధ్య ఓటింగ్‌ జరుగుతుంది. ఓటింగ్‌ సమయంలో పారిజాతం వెళ్లి జ్యోత్స్న పక్కన కూర్చుని గుసగుసలాడటం కార్తీక్‌ గమనించి పారిజాతాన్ని అనుమానిస్తాడు. ఓటింగ్‌ అయిపోయాక ఓట్లను జ్యోత్న్స చేతే లెక్కిస్తుంటాడు శివనారాయణ. ఓటింగ్‌లో దీపకు మెజారిటీ రాగానే జ్యోత్స్న షాక్‌ అవుతుంది. ఇంతలో కార్తీకదీపం2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

Big Stories

Advertisement
×