E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode May 25th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప తన కూతురు అని అందరి ముందు చెప్పిన దశరథ  

Karthika Deepam 2 Serial Today Episode May 25th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప తన కూతురు అని అందరి ముందు చెప్పిన దశరథ  
Advertisement

Karthika Deepam 2  serial today Episode: సుమిత్ర రూంలో కూర్చున్న దీప బాధపడుతుంటే.. సుమిత్ర ఎందుకు బాధపడుతున్నావు నీ బాధ చెప్పు అని అడగ్గానే.. తనకు అమ్మ ఒడిలో తల పెట్టుకుని నిద్రపోవాలని ఉంది అని చెప్పగానే.. సుమిత్ర అయితే వచ్చి నా ఒడిలో పడుకో నేను మీ అమ్మనే అనుకో అంటూ చెప్పగానే.. దీప ఏడుస్తూ.. వెళ్లి సుమిత్ర ఒడిలో నిద్రపోతుంటుంది. అప్పుడే డోర్ దగ్గరకు వచ్చిన జ్యోత్స్న చూసి షాక్‌ అవుతుంది. నాకు తెలుసే నువ్వు ఇలాంటిది ఏమో చేస్తావని అనుకుంటూ కోపంగా లోపలికి వెళ్లి సుమిత్రను పిలుస్తుంది. జ్యోత్స్నను చూసిన దీప,  సుమిత్ర ఒడిలోంచి లేవబోతుంటే.. సుమిత్ర నువ్వు పడుకో దీప అంటూ అలాగే ఉంచుతుంది.

అది చూసి మరింత రగిలిపోతుంది జ్యోత్స్న. అనుకున్నది సాధించావు కదా అని కోపంగా చూస్తుంటే.. సుమిత్ర వెళ్లి పడుకో జ్యోత్స్న అని చెప్తుంది. జ్యోత్స్న బయటకు వెళ్లుంటే..కార్తీక్‌ లోపలికి వచ్చి దీపను చూసి ఎమోషనల్‌ అవుతుంటాడు. అప్పుడే అక్కడకు వచ్చిన దశరథ చూసి ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు మనం ఎంత ఆనందంగా ఉన్నామో జ్యోత్స్నకు అంత కంపరంగా ఉంటుంది.. ఈ మూమెంట్‌ను పర్మినెంట్‌గా క్యాప్చర్‌ చేయాలి అని ఫోటో తీసుకుని వెళ్లిపోతాడు. కార్తీక్‌ మాత్రం నీ కోరిక తీరింది దీప, ఇక ఈ రాత్రికి జ్యోత్స్నకు నిద్ర పట్టదు అనుకుంటాడు.

Advertisement

రూంలోకి వెళ్లిన జ్యోత్స్నను పడుకోమంటే ఎందుకు తిరుగుతున్నావే అంటూ కాంచన తిడుతుంది. ఎందుకు పడుకోవడం లేదని నిలదీస్తుంది. జ్యోత్స్న మాత్రం నిద్ర రావడం లేదు అని చెప్తుంది. ఎందుకు రావడం లేదని కాంచన అడగ్గానే.. కారణం తెలిస్తే నిద్రపోయేదాన్ని కదా..? అంటూ జ్యోత్స్న చెప్పగానే.. దీన్నే పెళ్లేరియా అంటారు అంటూ తిట్టగానే.. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. దీంతో జ్యోత్స్న కార్తీక్‌ తన మెడలో తాళి కట్టి ఉంటే రాజాలా బతికి ఉండేవాడు అని చెప్పగానే.. కాంచన కోపంగా నీతో వాదించడం నా వల్ల కాదు సైలెంట్‌గా పడుకో అంటూ చెప్పగానే.. నేను ఇలా తయారు కావడానికి కారణం నువ్వే అంటుంది జ్యోత్స్న. దీంతో కాంచన కోపంగా శివనారాయణకు ఫోన్ చేయబోతుంటే.. అత్తా నీకో దండం నేను పడుకుంటున్నాను… నువ్వు పడుకో.. ఎవ్వరికీ ఫోన్‌ చేయకు అంటూ పడుకుంటుంది జ్యోత్స్న.

మరుసటి రోజు పొద్దున్నే లేచి దీప పూజ చేస్తుంటే.. శౌర్య గంట కొడుతుంది. జ్యోత్స్న నిద్రలోంచి లేచి కోపంగా కిందకు వచ్చి దీపను తిడుతుంది. ఇవాళ హాలిడే కదా ప్రశాంతంగా పడుకుందామంటే నీ గొడవేంటి అంటూ తిడుతుంది. అప్పుడే అక్కడకు కాంచన, సుమిత్ర, దశరథ, కార్తీక్‌ వస్తారు.. అందరూ జ్యోత్స్నను తిట్టి దీపను మెచ్చుకుంటారు. ఇంతలో దశరథ పుట్టింట్లో అడుగుపెట్టిన మొదటి రోజు ఇంటిని దేవాలయంగా మార్చేసింది నా కూతురు. పట్టీలు పెట్టుకున్న తన పాదాలు ఇంట్లో తిరగాడుతుంటే.. ఆ మువ్వల శబ్దం గుడిలో గంటలు మోగుతున్నట్టే ఉంది అంటూనే.. దశరథ అదేంటి నేను ఇలా మాట్లాడాను.. అనుకుంటాడు.

Advertisement

జ్యోత్స్న కూడా మనసులో అంటే ఇన్ని రోజులు నాన్నకు నిజం తెలిసి కూడా తెలియనట్టు ఉన్నాడా..? అనుకుంటుంది. అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు. ఇంతలో శౌర్య కూడా మా అమ్మ దశరథ తాత కూతురే..! అని చెప్పగానే.. అందరూ మరింత షాక్‌ అవుతారు. కార్తీక్‌ శౌర్యా అంటూ అడగ్గానే.. శౌర్య అవును డాడీ సుమిత్ర అమ్మమ్మ మా అమ్మకు అమ్మే కదా..? అంటుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. పారిజాతం ఎవరూ ఏమీ చెప్పకపోతే ఈ చంటిది ఎందుకు ఇంత గట్టిగా చెప్తుంది అనగానే.. జ్యోత్స్న కూడా సుమిత్రకు నిజం తెలిసిందా అందుకే ఓడిలో పడుకోబెట్టుకుందా..? అనుకుంటుంది. ఇంతలో దశరథ అసలు నిజం చెప్తాడు. దీపకు పేరెంట్స్‌ లేరని మనమే పేరెంట్స్‌ లాగా చూసుకుందామని సుమిత్ర తనకు చెప్పిందని అందుకే దీప తన కూతురు అని చెప్పానని అంటాడు. దీంతో అందరూ కూల్‌ అవుతారు.

దాస్‌ వచ్చి కాశీతో మాట్లాడుతుంటే.. చాటు నుంచి స్వప్న వింటుంది. దాస్‌ కొంచెం భయపడుతుంటే స్వప్న నవ్వుతూ మాట్లాడి భోజనానికి రమ్మని చెప్తుంది. దాస్‌ హ్యాపీగా వెళ్లిపోతాడు. తర్వాత స్వప్న, కాశీ ఇద్దరూ తమకు పుట్టబోయే  పిల్లల గురించి మాట్లాడుకుంటూ సిగ్గుపడుతుంటారు. దీప, కార్తీక్‌ గుడికి వెళ్లడానికి డిసైడ్‌ అవుతారు. అయితే జ్యోత్స్న ఆపేస్తుందని అందుకోసం ఇద్దరూ కలిసి ఓ నాటకం ఆడతారు. దీంతో కార్తీక్‌, దీపల నాటకం అర్థం చేసుకున్న పారిజాతం, జ్యోత్స్న షాక్‌ అవుతారు. ఇంతలో కార్తీకదీపం2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×