E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode April 11th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హాస్పిటల్ లో మిస్సమ్మ, అమర్ ను చూసి షాకైన మనోహరి

Nindu Noorella Saavasam Serial Today Episode April 11th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హాస్పిటల్ లో మిస్సమ్మ, అమర్ ను చూసి షాకైన మనోహరి
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మ, అమర్‌ హైదరాబాద్‌ వెళ్లిపోగానే.. రణవీర్‌, మనోహరి ఎయిర్‌ఫోర్ట్ దగ్గర కలుసుకుంటారు. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి మనోహరి హైదరాబాద్‌ వెళ్లలేదా అంటూ రణవీర్‌ అడగ్గానే.. నా సంగతి సరే నువ్వు వెళ్లలేదా అని మనోహరి అడగ్గానే.. అమరేంద్ర నా కూతురును అప్పగిస్తా అన్నాడు కదా అందుకే వెయిట్‌ చేస్తున్నాను అని రణవీర్‌ చెప్పగానే.. మనోహరి ఇంకెక్కడి అమరేంద్ర, భాగీని తీసుకుని హైదరాబాద్ కు వెళ్లిపోయాడు అని మనోహరి చెప్తుంది. దీంతో రణవీర్‌ ఆశ్చర్యంగా ఏంటి నువ్వు చెప్పేది.. అంటే అమరేంద్ర ఇప్పుడు ఇక్కడ లేడా..? అని అడగ్గానే.. అర్థం కాలేదా..? హైదరాబాద్‌ వెళ్లిపోయాడు అని చెప్పాను కదా అంటుంది మనోహరి. దీంతో రణవీర్‌ కోపంగా అయినా నా కూతురును నాకు అప్పగించకుండా ఎలా వెళ్తాడు. నాకు చెప్పకుండా వెల్లడం ఏంటి..? అంటూ కోప్పడుతుంటే..

మనోహరి కూల్‌గా ఆకాష్‌కు ఆస్మా అటాక్‌ అయిందంట. హాస్పిటల్‌ లో అడ్మిట్‌ చేశారట. అందుకే అమర్‌ హడావిడిగా హైదారబాద్‌ వెళ్లిపోయాడట అని చెప్పగానే.. రణవీర్ కోపంగా వాడి కొడుక్కి అలా అయిందని వెళ్లిపోతే మరి నా కూతురు పరిస్థితి ఏంటి..? అంటాడు. దీంతో మనోహరి కోపంగా నువ్వు అమాయకుడివా..? మూర్ఖుడివా అర్థం కాలేదు రణవీర్‌. నీకు బాడీ పెరిగింది కానీ బుర్ర మాత్రం పెరగలేదు అంటుంటే.. రణవీర్‌ కోపంగా.. మనోహరి.. అంటాడు. దీంతో మనోహరి లేకపోతే ఏంటి..? మన కూతురును అప్పగిస్తానని అమరేంద్ర చెబితే పిచ్చోడిలా నమ్మి కాశ్మీర్‌ దాకా వచ్చావు.. అమరేంద్ర నిన్ను ఇక్కడికి రప్పించింది మన కూతురును అప్పగించడానికి కాదు. నన్ను అంటే నీ వైఫ్‌ను పట్టుకోవడం కోసం నా టైం బాగుండి అమరేంద్రకు దొరక్కుండా ఎస్కేప్‌ అయ్యాను కానీ లేదంటే నీ వెర్రితనం కారణంగా నేను దొరికిపోయేదాన్ని అమర్‌కు ఇంకెప్పుడు నా ముఖం చూపించకపోయేదాన్ని అనగానే..

Advertisement

రణవీర్‌ కోపంగా నువ్వు చెప్పేది నిజమేనా మనోహరి.. అమరేంద్ర నాతో నిజంగానే అబద్దం చెప్పాడా… అని అడగ్గానే.. మనోహరి కోపంగా నీ బ్రెయిన్‌ ఇంకా జైళ్లోనే పెట్టావా..? ఏంటి..? హైదరాబాద్‌ లో మనం బయలుదేరినప్పటి నుంచి నేను చెప్పింది ఇదే కదా వినకుండా ఇంత దూరం వచ్చావు.. అమరేంద్ర నిన్ను పట్టుకోవాలిన ఇంత పెద్ద స్కెచ్‌ వేశాడు. నువ్వు బ్లైండ్‌ గా నమ్మి ఈ వలలో పడిపోయావు.. అనగానే.. రణవీర్‌ కోపంగా అంటే నేను మళ్లీ మోసపోయానా..? అని అడగ్గానే.. నీ మెదడుకు పని పెట్టకపోతే లైఫ్‌లాంగ్‌ నువ్వు ఇలాగే మోసపోతావు.. నీకై నువ్వు తెలుసుకోవు.. నేను చెప్పినా తెలుసుకోవు.. అంటూ తిట్టగానే.. రణవీర్‌ కోపంగా ఓకే మనోహరి ఇక ఈ ప్లాన్స్‌ స్కెచ్చులు ఏమీ వద్దు ఎత్తుకు పైఎత్తులు వేయడం నా వల్ల కాదు నాకు కావాల్సింది నా కూతురు.. దాని ద్వారా నాకు దక్కబోయే నా ఆస్థి. డైరెక్టుగా వెళ్లి అమరేంద్రతో తేల్చుకుంటాను అనగానే..

మనోహరి కోపంగా నువ్వు అలా వెళ్లి అడిగితే అమరేంద్ర నీ కూతురును ఇచ్చేస్తాడు మరి అని చెప్పగానే.. రణవీర్‌ కోపంగా మరి ఏం చేయాలి అని అడుగుతాడు. దీంతో మనోహరి ఆలోచించాలి రణవీర్‌ ఆలోచించి అడుగులు వేయాలి. అమరేంద్రను ఇరుకున పెట్టి మన పని చేసుకోవాలి. అని చెప్పగానే.. రణవీర్‌ కోపంగా నాకు అంత తెలివి, ఓపిక, సహనం లేవు అంత టైం కూడా లేదు. బెయిల్‌ గడువు ముగిసిపోక ముందే నా కూతురు ఎక్కడ ఉందో నేను తెలుసుకోవాలి అనగానే.. అలా తొందర పడితే పని జరగదు రణవీర్‌.. అంటూ మనోహరి చెప్పగానే.. కొన్నిసార్లు ఆలస్యం చేయడం కూడా మంచిది కాదంటారు కదా నా ఊతురు కోసం నేను ఏమైనా చేస్తాను.. అవసరమైతే ఆ అమరేంద్ర దగ్గర నువ్వు చెప్పిన అబద్దాలు, దాచిన నిజాలు అన్ని చెప్పైనా సరే నా కూతురు గురించి నిజం తెలుసుకుంటాను అంటూ రణవీర్‌ చెప్పగానే.. మనోహరి అవసరం లేదు అమర్‌ మన కూతరును అప్పగించేలా నేను ప్లాన్‌ వేస్తాను.. ఇప్పుడు మనం హైదరాబాద్‌ వెళ్దాం పద అంటుంది.

Advertisement

మనోహరి హైదరాబాద్‌ వచ్చి హాస్పిటల్‌కు వెల్తుంది. ఐసీయూలో ఉన్న అమర్‌, టిఫిన్‌ తీసుకెళ్లి మిస్సమ్మకు తినిపిస్తుంటాడు. మిస్సమ్మ అమర్‌కు తినిపిస్తుంది. అది చూసిన మనోహరి షాక్‌ అవుతుంది. మిస్సమ్మ, అమరేంద్రను తిట్టుకుంటుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×