E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today December 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:   మిస్సమ్మను చంపేందుకు మనోహరి ప్లాన్‌ – పిల్లలను అమర్‌కు దగ్గర చేసిన మిస్సమ్మ

Nindu Noorella Saavasam Serial Today December 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:   మిస్సమ్మను చంపేందుకు మనోహరి ప్లాన్‌ – పిల్లలను అమర్‌కు దగ్గర చేసిన మిస్సమ్మ
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode :   పొంచి ఉన్న ప్రమాదం నీకు అవగతం అవ్వటం లేదని గుప్త, ఆరును హెచ్చిరస్తాడు. ఏంటి గుప్త గారు మీరు మాట్లాడేది. ఇంతకుముందు ఆ ఘోర వల్ల సమస్య ఉండేది. ఇప్పుడు ఆ ఘోర కూడా లేడు కదా.. ఇంకెందుకు భయం. ఎన్నిసార్లు ప్రయత్నించినా నన్ను బంధించడం లేదని ఓడిపోయానని వెళ్లిపోయినట్టు ఉన్నాడు అంటుంది ఆరు.

అది నీ ఊహ మాత్రమే బాలిక. ఘోర లాంటి వాడు ఓడిపోయాడనుకుంటే అది వాడి మరణం మాత్రమే.. శత్రువు ఈసారి కొట్టబోయే దెబ్బ బలంగా ఉండాలని బలగాన్ని పెంచుకుంటున్నాడు. ఎవరినైనా తక్కువ అంచనా వేయవచ్చు కానీ ఆ ఘోరాను తక్కువ అంచనా వేయవద్దు. నన్ను దాటి నిన్ను బంధించాడంటే ఘోర శక్తి ఏంటో అర్థం చేసుకో అంటాడు గుప్త. ఈ సారి అతన్ని ఆపడం నా వల్ల కాదు. తప్పించుకోవడం నీ వల్ల కాదు. అంటూ గుప్త చెప్పడంతో ఆరు ఆలోచనలో పడిపోతుంది.

Advertisement

శివరాం మాటలు, మిస్సమ్మ చూపులు గుర్తు చేసుకుంటూ మనోహరి ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంది. ఇదంతా జరగడానికి ఆ ఆరు కారణం ఆది ఆ ఒక్కరోజు సైలెంట్‌గా ఉండి ఉంటే అమర్‌ నా మెడలో తాళి కట్టేవాడు. ఇప్పుడు హ్యాపీగా ఉండేదాన్ని అనుకుంటూ బాబ్జీకి ఫోన్‌ చేస్తుంది. ఎక్కడున్నావు అని అడుగుతుంది. మీరు చెప్పిన ఆ ఘోర కోసం వెతుకుతున్నాను. ఆ మనిషి కోసం వెతకని గుట్ట లేదు. ఎక్కని కొండ లేదు. ఆ మనిషి ఎక్కడ దాక్కున్నాడో.. ఏం చేస్తున్నాడో తెలియడం లేదు.

మీకు దండం పెడతాను ఘోరాను వెతకడానికి నాకు ఓపిక లేదు ఇక ఘోరాను వెతకడానికి వేరే ఎవ్వరినైనా చూసుకోండి అని చెప్తాడు బాబ్జీ. నేను ఘోరా కోసం ఫోన్‌ చేయలేదు. నాకు ఇంకో పని చేయాలి అని అడుగుతుంది. నాకు ఇప్పుడు ఓపిక లేదని చెప్పాను కదా మేడం అని బాబ్జీ చెప్పగానే నీకు 5 లక్షలు ఇస్తాను చేస్తావా..? అని అడగ్గానే ఐదు లక్షలు ఇస్తానంటే ఏమైనా చేస్తాను అని బాబ్జీ చెప్పగానే లారీ ఎక్కించి  మిస్సమ్మను చంపేయాలి అని చెప్తుంది. సరే అంటాడు బాబ్జీ.

Advertisement

పిల్లలు చదువుకుంటుంటే.. మిస్సమ్మ  వచ్చి చదువుకుంటున్నారా..? మీరు ఈ టైంలో ఎక్కడ ఉండాలి అని అడుగుతుంది. అంజు వెటకారంగా మేడ మీద ఉండాలా..? అని అడుగుతుంది. అమ్ము మాత్రం మిస్సమ్మ నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా చెప్పు అని అడుగుతుంది. దీంతో మీ డాడీ ఆ రూంలో ఒక్కరే ఉంటారు కదా..? మీరంతా డాడీతో స్పెండ్‌ చేయాలి అని చెప్తుంది మిస్సమ్మ. మాకు డాడీతో టైమ్‌ స్పెండ్‌ చేయాలి. ఆడుకోవాలి. కబుర్లు చెప్పాలి అని ఉంటుంది.

కానీ ఎప్పుడూ డాడీ డిసిప్లీన్ గురించి చెప్పేవారు. మార్క్స్‌ గురించి తప్పా ఏదీ మాట్లాడేవాళ్లం కాదు అంటూ భయంగా చెప్పగానే.. మీ అందరికీ ఒక విషయం చెప్తాను రండి అంటూ అందరినీ దగ్గరకు పిలిచి మీ డాడీకి మీరంటే చాలా చాలా ఇష్టం. మీ డాడీ మీ మార్క్‌ గురించి ఎందుకు అడుగుతారో తెలుసా..? మీ అమ్మ ద్వారా తెలుసుకుంటారు కాబట్టి. ఇప్పుడు మీ అమ్మ లేరు కాబట్టి ఇప్పుడు మీ డాడీతో ఎవరు మాట్లాడతారు అంటూ మిస్సమ్మ చెప్పగానే పిల్లలు ఎమోషనల్‌ అవుతారు.

పిల్లలందరూ మెల్లగా అమర్‌ రూంలోకి వెళ్తారు. పిల్లలను చూసిన అమర్‌ హ్యాపీగా పలకరించి డిన్నర్‌ అయిందా అని అడగ్గానే చేశామని.. మీరు తిన్నారా.? అని అడుగుతారు. తిన్నానని మీరు ఎక్కువగా ఆలోచించవద్దు అంటూ అమర్‌ చెప్తాడు. కిటికీలోంచి చూస్తున్న ఆరు హ్యాపీగా ఫీలవుతుంది. ఏవండి మీరైనా పిల్లలతో ఏదైనా మాట్లాడండి అని చెప్తుంది. ఇంతలో అమర్‌ కూడా పిల్లలను మీరు నాతో ఏదైనా మాట్లాడాలా..? అని అడుగుతాడు.

కాసేపు కూర్చుని మాట్లాడతామని పిల్లలు చెప్పగానే అందరినీ దగ్గరకు తీసుకుంటాడు అమర్‌. హ్యాపీగా అందరూ మాట్లాడుకుంటారు. హ్యపీగా నవ్వుతుంటారు. ఇంతలో లోపలికి వచ్చిన రాథోడ్‌ శివరాంను సార్‌ ఆ నవ్వులు మా సార్‌ వేనా అని అడుగుతాడు. అవునని శివరాం చెప్పగానే రాథోడ్‌ కూడా హ్యాపీగా ఫీలవుతాడు. ఇంతలో మిస్సమ్మ రావడంతో శివరాం, నిర్మల, రాథోడ్‌ ముగ్గురు కలిసి మిస్సమ్మను మెచ్చుకుంటారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×