trinayani serial today Episode: నయనిని తమ కంపెనీలో ఉన్న అందరి హెచ్‌ఓడీల డీటెయిల్స్ అడుగుతారు తిలొత్తమ్మ, వల్లభ. అందరి పేర్లు హోదాలు చెప్తుంది నయని. దీంతో అందరూ షాక్ అవుతారు. అమ్మా అడిగి అడిగి మీరు అలసిపోయారా..? అంటాడు విశాల్. ఇన్ని పేర్లు ఎలా గుర్తు పెట్టుకున్నావు అక్కా అని సుమన అడగ్గానే గాయత్రి పాప నా దగ్గర ఉండగా అన్ని గుర్తుంటాయి నాకు అంటుంది నయని. వదిన చకాచకా చెప్పగానే అమ్మ బుర్ర హీటెక్కిపోయింటుంది అంటాడు విక్రాంత్.
దీంతో వల్లభ, తిలొత్తమ్మ అక్కడి నుంచి వెళ్లిపోతారు. వెంటనే దురందర వీళ్లు ఇప్పుడే కోలుకోరు అనుకుంటా అంటుంది. నాకే షాకింగ్ గా ఉందని సుమన అంటుంది. రేపటి నుంచి ఇంకా బాగుంటుంది చెల్లి అంటుంది నయని. నయని దూకుడు మొదలైంది ఆ వేగాన్ని తట్టుకోవడానికి రెడీ ఉండాలి అంటాడు విశాల్. చెప్పాను కదా అల్లుడు నయని అమ్మా చెడుగుడు ఆడుతుందని అంటాడు పావణమూర్తి. గెలుపోటములు ఉండవు మామయ్యా అంతా అమీ తుమీ అంటాడు విక్రాంత్.
నయని గార్డెన్‌లో కూర్చుని డైరీలో ఏదో రాస్తుండగా విశాల్ వస్తాడు. బాబుగారు మీరు పాలు తాగుతారా..? మజ్జిగ తాగుతారా..? అని నయని అడగ్గానే కాఫీ తీసుకురా అని విశాల్ చెప్తాడు. సరే అని డైరీ తీసుకుని నయని వెళ్తుంటే.. ఆ డైరీ అక్కడే పెట్టి వెళ్లి కాఫీ తీసుకురా అని విశాల్ చెప్తాడు. నయని అలాగే ఆలోచిస్తుంటే.. తీసుకురాలేవు కదా..? అంటాడు. సీక్రెట్స్ ఏమీ ఉండవు బాబుగారు అంటుంది నయని. ఉండవు కానీ నీకు సాయంగా నేను ఉండాలంటే నీ సీక్రెట్స్ కూడా నేను పంచుకోవాలి ఆ డైరీ ఇటువ్వు అని విశాల్ అడగ్గానే రేపు ఇస్తాను అంటుంది నయని.
ఈ రాత్రికి నిద్ర పట్టాలంటే ఆ డైరీ ఇపుడు చూడాలి అని విశాల్ అనగానే నయని డైరీ విశాల్‌కు ఇస్తుంది. అది తెరచి చదివిన విశాల్ ఏంటిది నయని అని అడుగుతాడు. రేపు ఏం చేయాలో రాసుకున్నాను అని చెప్తుంది. అందులో ఉన్నది విశాల్ చదివి వినిపిస్తాడు. ప్రతి మూడు గంటలకు ఒకసారి గాయత్రి పాపను ఎత్తుకుని ముద్దు పెట్టుకోవాలని రాసి ఉంటుంది. చెప్పానా మీరు నవ్వుతారని అని నయని అంటుంది. నాకు నవ్వు రావడం లేదు కానీ ప్రతి పనిలోనూ గాయత్రి పాప పేరు రాశావు పాపకు ఒంట్లో బాగా లేదా…? అని విశాల్ అడగ్గానే ఏం లేదని మీకు కాఫీ తీసుకొస్తానని డైరీ తీసుకుని వెళ్లిపోతుంది నయని.
అందరూ హాల్లో మాట్లాడుకుంటుండగా ఒకతను వచ్చి తాను లిల్లీస్ హాస్పిటల్ నుంచి వచ్చానని బిల్లింగ్ డిపార్టమెంట్ అని చెప్పగానే అందరూ ఆశ్చర్యపోతారు. నయని మాత్రం తన శరీరం అక్కడ ఉంది. అని మనసులో అనుకుని ఈ గండం నుంచి ఎలాగైనా నన్ను కాపాడు తల్లి అని ప్రార్థిస్తుంది. ఇంతలో సుమన ఇప్పుడు ఎవరి ఒంట్లో బాగాలేదని వచ్చారు అని అడుగుతుంది. వీళ్లు ఇలాగే మాట్లాడతారు నువ్వు వెళ్లిపో అని నయని చెప్తుంది. దీంతో తిలొత్తమ్మ ఉండని నయని ఏంటో అతన్నే అడుగుదాం అంటుంది.
ఆయన పొరపాటున వచ్చారనుకుంటాను అత్తయ్యా ఏమైనా ఉంటే మీ హెడ్‌తో మాట్లాడతాను అని చెప్పండి అంటూ నయని అనగానే ఈ బిల్లు పేపర్‌ను విక్రాంత్ గారికి ఇవ్వమని మా మేడం చెప్పారు విక్రాంత్ గారు అంటే మీరేనా అని ఆ వ్యక్తి అడగ్గానే.. సుమన విక్రాంత్‌ను అనుమానిస్తుంది. మీ మేడం ముసలిదా.. ఏజ్‌లోనే ఉందా..? అని అడుగుతుంది. అందరూ సమనను తిడతారు. ఇంతలో ఆ వ్యక్తి బిల్ కవర్ నయని చేతిలో పెట్టి వెళ్లిపోతాడు. ఆ కవర్ తీసుకుని వెళ్లిపోతున్న నయనిని ఆపుతుంది సుమన. వెళ్లి లెటర్ తీసుకుని చూసి ఇది ఇంగ్లీష్‌లో ఉందని నాకు చదవడం రాదని చెప్తుంది. ఇందులో ఏవో లెక్కలు కూడా ఉన్నాయని అంటుంది.
దీంతో కోడ్ లాంగ్వేజ్ అనుకుంటా అంటాడు వల్లభ. అంటే ఏంటని సుమన అడుగుతుంది. మీ ఆయనకు ఆ మేడంకు మధ్యలో ఉన్నది ఎవ్వరికీ తెలియకుండా వాడే భాష అంటాడు. దీంతో విశాల్ కోపంగా వల్లభను తిడుతాడు. సుమన బిల్లు పేపర్ తిలొత్తమ్మకు ఇస్తుంది. ఆ బిల్లు చూసిన తిలొత్తమ్మ షాక్ అవుతుంది. ఈ బిల్లు నయని అడ్మిట్ అయినట్టు 42 లక్షలు బిల్ అయినట్టు కనీసం 20 లక్షలు కడితేనే ట్రీట్‌మెంట్ కంటిన్యూ చేస్తామని ఉంది ఇందులో అని చెప్పగానే అందరూ షాక్ అవుతారు. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు అయిన ఖర్చు అయ్యుండొచ్చు అని నయని అంటుంది. ఇంతటితో త్రినయని సీరియల్ ఈరోజు ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?