ప్రతి మనిషికీ డబ్బు అత్యవసరం. ఇప్పుడు ఆ కాలంలో ప్రతిదీ డబ్బుతోనే కొనాల్సిన పరిస్థితి. డబ్బు అనేది సౌకర్యం, ఆహ్లాదకరమైన జీవితం, ఆరోగ్యకమైన సంబంధాలకు కారణం అవుతుంది. అయితే కొంతమంది ఎంత ప్రయత్నించినా ఎక్కువ డబ్బును కూడబెట్టుకోలేరు. వారి జీవితంలో ఏదో డబ్బును బ్లాక్ చేస్తున్నట్టు ఉంటుంది. కొన్ని రకాల అలవాట్లు ఇలా మనీ బ్లాకింగ్‌కు కారణం అవుతాయి. వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం డబ్బును అడ్డుకునే అలవాట్లను మీరు వెంటనే మానేయాలి. ఆ అలవాట్లు ఏంటో తెలుసుకోండి.
కుళాయి నీరు
అనేక ఆచారాలలో ఒక నమ్మకం ఉంది. ఇంట్లో ఏ కుళాయి నుంచి అయినా నీరు కారుతూ ఉన్నా, లీక్ అవుతున్నా… ఆ ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయని అంటారు. కుళాయి నుండి మీరు ఎలా బయటికి పారుతుందో ఇంటి నుండి డబ్బు కూడా దూరంగా పోతుందని అంటారు. కాబట్టి మీ ఇంట్లో కారుతున్న కుళాయిలు ఎక్కడైనా ఉంటే వెంటనే దాన్ని బాగు చేయండి. నీటిని వృధా చేస్తే సంపద కూడా వృధా అవుతుందని చెప్పుకుంటారు. డబ్బును ఆదా చేయడానికి లీక్ అవుతున్న ట్యాప్ లను అరికట్టడం చాలా అవసరం.
ఇంటి శుభ్రత
మీ ఇల్లు చిందరవందరగా, గజిబిజిగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని చెప్పుకుంటారు. పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోతుందని అంటారు. మీ ఇంట్లో స్వచ్ఛంగా అన్ని వస్తువులు ఎక్కడ ఉండాల్సినవి అక్కడ ఉంటే ఇంట్లోకి ధన ప్రవాహం కూడా అధికంగా ఉంటుందని చెబుతారు. వాస్తు శాస్త్రం, ఫెంగ్ షుయ్ చెబుతున్న ప్రకారం పరిశుభ్రత, సానుకూలత శక్తి వంటివన్నీ ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. నివసించే స్థలం అపరిశుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో వారు కూడా ఆర్థిక నిర్ణయాలను సరిగా తీసుకోలేరు. దీనివల్ల మనీ ఎక్కువగా వృధా అయ్యే అవకాశం ఉంది.
అలాంటి సమయాల్లో కొనవద్దు
హిందువులకు కొన్ని నెలలు మంచివి కాదు. మన పూర్వీకులను గౌరవించాల్సిన సమయాలు కొన్ని ఉంటాయి. ఆ కాలాల్లో ఏదైనా వస్తువులను కొనడం మంచిది కాదు. పితృపక్షం రోజుల్లో ఏవైనా వస్తువులను అధికంగా కొంటె వారి జీవితాల్లో సానుకూలత తగ్గుతుందని, డబ్బుకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పుకుంటారు. కాబట్టి పితృపక్షం రోజుల్లో ఎలాంటి కొనుగోలు చేయకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
నైరుతి మూల
వాస్తు ప్రకారం ఇంటి నైరుతి మూల సంపదను, స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఈ ప్రాంతాన్ని చిందరవందరగా, గజిబిజిగా అపరిశుభ్రంగా ఉంచకూడదు. అలా చేస్తే ఆర్థిక సమృద్ధి తగ్గుతుంది. ధన ప్రవాహానికి అంతరాయం కలుగుతుంది. ఇంటి నైరుతి మూలలో దేవతా విగ్రహాలను పెట్టడం మంచిది. ఆ ప్రాంతం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మనీ ప్లాంట్ వంటివి ఉంచితే ఎంతో మంచిది.
కుబేరుడు విగ్రహాలు
కుబేరుడు సంపదకు దేవుడు. అతడి వల్ల ఇంట్లో ఉంటే ఆర్థిక సమృద్ధి దక్కుతుందని అంటారు. దీపావళి నాడు కుబేరుడు లేదా కుబేర యంత్ర విగ్రహాలను ఇంటికి తీసుకొస్తూ ఉంటారు. వాటిని ఇంటిలోని పూజ గదిలో ఉంచుతూ ఉంటారు. అయితే కుబేరుని విగ్రహాలు లేదా కుబేర యంత్రాలు వంటివి విరిగినవి, చిరిగినవి వాడకూడదు. అలా చేస్తే డబ్బులు క్షీణించే అవకాశం ఉంది. ప్రతికూల శక్తులు ఇంట్లో ప్రవేశించి డబ్బు రాకను అడ్డుకునే వీలుంటుంది.
Also Read: ఈ ఒక్క వ్రతం ఆచరిస్తే చాలు.. మీకు, మీ ఇంట అన్నీ జయాలే!
అద్దం
కొన్ని సాంప్రదాయాలలో అద్దం కూడా ఇంట్లోనే ఆర్థిక పరిస్థితిని నిర్ణయిస్తుంది. ప్రవేశ ద్వారానికి ఎదురుగా అద్దం ఉంచడం మంచి పద్ధతి కాదు. ఇది డబ్బును జీవితంలో ఎదురయ్యే మంచి అవకాశాలను తిప్పి వెనక్కి పంపిస్తుందని చెబుతారు. ప్రధాన ద్వారం దగ్గర ఎదురుగా ఉంచిన అద్దం నుండి శక్తి ప్రతిబింబిస్తుందని అంటారు. కాబట్టి అలా ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఎలాంటి అద్దాన్ని ఉంచకండి. ఇది ఏ మాత్రం మంచిది కాదు.