E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 17th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  అంజును సేవ్‌ చేసిన అమర్‌ – ఘోరను తిట్టిన మనోహరి

Nindu Noorella Saavasam Serial Today January 17th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  అంజును సేవ్‌ చేసిన అమర్‌ – ఘోరను తిట్టిన మనోహరి
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode :  అంజుకు ఎదురుగా నిలబడి ఘోర మంత్రాలు చదువుతుంటాడు. ఇంతలో అమర్‌ వస్తాడు. ఘోరను కొడతాడు. ఘోర పారిపోతాడు. ఇంతలో అంజు నుంచి ఆరు బయటకు వస్తుంది. దీంతో అంజు స్పృహ తప్పి పడిపోతుంది. రాథోడ్‌, రామ్మూర్తి వస్తారు. కంగారు పడతారు. అంజును చూసి ఆరు ఏడుస్తుంది. ఐయామ్ సారీ అంజు చిన్నప్పుడు నేను కోల్పోయిన ఆనందాన్ని ఇప్పుడు నాన్నతో ఉండి అవన్నీ తీర్చుకుందామనుకుంటూ.. అదంతా నా స్వార్తం అమ్మా కానీ ఇలా జరగుతుందని నాకు తెలియదు అంటూ ఏడుస్తుంది.

అంజు మీద వాటర్‌ చల్లగానే.. స్పృహలోకి వచ్చిన అంజు డాడ్‌ నేనేంటి ఇక్కడున్నాను.. నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు.. అని అడుగుతుంది. దీంతో షాక్‌ అయిన రామ్మూర్తి అదేంటి అంజు పాప నువ్వే కదా.. అంటూ చెప్పబోతుంటే.. అమర్‌ వద్దని సైగ చేస్తాడు. రాథోడ్ కు అంజును తీసుకుని కారు దగ్గరకు వెళ్లు అని చెప్తాడు. రాథోడ్ అంజును తీసుకుని కారు దగ్గరకు వెళ్లి మిస్సమ్మకు ఫోన్‌ చేసి అంజు దొరికిందని చెప్తాడు. టైంకు మేము వెళ్లడం వల్ల ఆ ఘోరా సార్‌ ను చూసి పారిపోయాడు అని చెప్తాడు. రాథోడ్‌ చెప్పగానే.. మిస్సమ్మ ఊపిరి పీల్చుకుంటుంది. పొద్దునుంచి కాలు చేయి ఆడలేదు.. భగవంతుడి దయ వల్ల ఎవరికి ఏమీ కాలేదు అంటుంది. అమ్ము మిస్సమ్మను హగ్‌ చేసుకుంటుంది.

Advertisement

మరోవైపు రామ్మూర్తి ఆశ్చర్యంగా బాబు గారు అసలు ఏమవుతుంది.. నేను ఇంట్లో ఉండగా అంజు పాప రావడం ఏంటి..? మేము ఇద్దరం బట్టలు కొనడానికి షాపు వెళ్లడం ఏంటి..? ఆ ఘోర మా వెంట పడటం ఏంటి..? ఇంత జరిగాక అంజలి పాప ఇప్పుడు లేచి నేను ఇంట్లో కదా ఉండాల్సింది.. ఇక్కడ ఉన్నానేంటి అని అడుగుతుంది. అసలు ఏం జరగుతుంది బాబుగారు అని అడగ్గానే.. అర్తం అయ్యేలా ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. ఆరు ఆత్మ ఇంకా భూమ్మీద ఉందని మీకు తెలుసు కదా..?

తెలుసు బాబు అమ్మాయికి మోక్షం కలగాలనే కదా.. రేపు కాశీకి వెళ్దాం అనుకున్నాం అంటాడు రామ్మూర్తి. ఇవాళ మీ ఇంటికి వచ్చింది. మీతో మాట్లాడింది. మీతో మాట్లాడింది. మిమ్మల్ని బయటకు తీసుకొచ్చింది. మీతో చీర కొనిపించింది. మీ కన్నీళ్లు తుడిచింది. మిమ్మల్ని నవ్వించింది. అంజు కాదు. అని అమర్‌ చెప్పగానే.. అంజు కాదా..? మరి ఇవన్నీ చేసింది ఎవరు అని రామ్మూర్తి అడుగుతాడు. మీ కూతురు అరుంధతి అని అమర్‌ చెప్పగానే.. రామ్మూర్తి షాక్‌ అవుతాడు. అరుంధతి అంజలి రూపంలో మీతో గడపలేని క్షణాలను చూడలేని సంతోషాలను పొందడానికి వచ్చింది.

Advertisement

అని అమర్‌ చెప్పగానే.. అంజు తనను మాటి మాటికి నాన్నా అనడం.. మీ కూతుర్ని కదా అనడం గుర్తు చేసుకుంటాడు రామ్మూర్తి. బాబు గారు మీరు చెప్తుంది నిజమా అని అడుగుతాడు. అవును కానీ ఎలా అంటే మాత్రం నా దగ్గర సాక్ష్యం లేదు. కానీ అంజలిలో ఇంతసేపు ఉన్నది ఆరు ఆత్మనే.. అని అమర్ చెప్పగానే రామ్మూర్తి  ఎమోషనల్ అవుతాడు. నా బిడ్డను మళ్లీ నేను దూరం చేసుకున్నాను అని ఏడుస్తుంటాడు రామ్మూర్తి. రామ్మూర్తిని ఆరు ఓదారుస్తాడు.  ఈ విషయం ఇంట్లో ఎవ్వరికీ చెప్పొద్దని అమర్‌ చెప్పి రామ్మూర్తిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

ఘోర దగ్గరకు వెళ్లిన మనోహరి కోపంగా తిడుతుంది. ఇది నీవల్ల కాదని నాకు తెలుసు. అమర్‌ వచ్చే లోపు నువ్వు పారిపోయావు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏం జరిగేది. నువ్వు దొరికితే నా పరిస్థితి ఏంటో నీకు అర్తం అవుతుందా.? నువ్వు ప్రయత్నించింది చాలు. అది ఈ లోకం నుంచి వెళ్లాక అమర్‌ నా సొంతం అయ్యాక నీకు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాను. అని మను చెప్పగానే.. నేను ఓటమిని ఒప్పుకుని నా లక్ష్యానికి అడుగు దూరంలో ఉన్నప్పుడు నేను వెనుదిరగలేను మనోహరి అంటాడు ఘోర.

ఏం చేస్తావు అని మను అడుగుతుంది. ఆ ఆత్మ దొరికే వరకు ప్రయత్నిస్తాను. నాదృష్టిలో ఓటమి అంటే చావే.. అంటాడు ఘోర. రేపు ఆస్థికలు తీసుకెళ్తున్నారు. ఇవాళ జరిగిన దానికి అమర్‌ అస్తికలు తన దగ్గరే పెట్టుకుంటాడు. ఎలా తీసుకొస్తాం.. అని అడుగుతుంది. దీంతో కోపంగా ఘోర తన శక్తిని మనోహరికి చూపిస్తాడు. భుజబలంతో పాటు మంత్రబలం కూడా ఉన్న శక్తులను తయారు చేసుకన్నాను అని చూపిస్తాడు.

అంజుకు మిస్సమ్మ జ్యూస్‌ తాగిస్తుంది. ఎందుకు ఇంట్లోంచి వెళ్లావు అని అడగ్గానే నాకు గుర్తు లేదని చెప్తుంది అంజు. పాప అలిసిపోయినట్టు ఉంది పాప ఇంటికి తిరిగి వచ్చింది కదా ఇప్పుడు ఇవ్వన్నీ ఎందుకు తల్లీ అంటాడు రామ్మూర్తి. మిస్సమ్మ ఎంత అడిగినా నాకు ఏం గుర్తు రావడం లేదు మిస్సమ్మ అంటుంది. ఇంతలో నిర్మల ఆ మంత్రగాడు ఏదో చేసి ఉంటాడు అని చెప్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×