trinayani serial today Episode: అమ్మా విశాలాక్షి ఇంకా ఎన్నాళ్లు జీవిస్తుంది అని విక్రాంత్ అడగ్గానే.. సంవత్సరాలు కాదు నాన్న కేవలం నాలుగంటే నాలుగు రోజులే జీవిస్తుంది అని విశాలాక్షి చెప్పడంతో అందరూ షాక్ అవుతుంది. తర్వాత నయని దగ్గరకు వచ్చిన దురందర నువ్వు చెప్పిన విషయం నిజమైతే ఎంత బాగుండేదో కదా అంటుంది. నిజం పిన్ని త్రినేత్రి దేవీపురం వెళ్లి కాళికాదేవి అమ్మవారి పూజ చేస్తూ ఎప్పట్లా తన జీవితాన్ని సుఖసంతోషాలతో జీవిస్తే బాగుండు కదా అంటుంది నయని. అమ్మవారి దగ్గరకే వెళ్లి అక్కడే తను అమ్మవారిలో ఐక్యం అయిందన్న విషయం బామ్మ గారికి తెలియదు పాపం అంటుంది దురందర. ఇంతలో రత్నాంభ తెలుసు అనుకుంటూ వస్తుంది.
దురందర, నయని షాక్ అవుతారు. ఎంటమ్మా అలా చేస్తున్నారు. నా మనవరాలు మా ఊరికే వెళ్లి ఉంటుందని నాకు తెలుసు అంటుంది. దీంతో దురందర, నయని ఊపిరి పీల్చుకుంటారు. చూశావా నయని మీ పిన్ని నన్ను ఆట పట్టించి కంగారు పెట్టిద్దామనుకుంటుంది. పర్వాలేదులే అంటుంది రత్నాంభ. బామ్మ గారు మీరు ఎలా అనుకుంటే అలా అంటుంది దురందర. మనవరాలు ఊరు వెళ్లిందని చెప్పగానే బామ్మ ముఖంలో వెలుతురు వచ్చింది చూడు అంటుంది నయని.
ఎందుకు రాదమ్మా నా మనవరాలు అమావాస్య రోజు అమ్మవారికి పూజ చేసి వస్తే మరుసటి రోజు వరకు నా మనవరాలి చుట్టు కాంతి వలయం ఉండేది అది చూసిన ఊరి జనం నోరు వెళ్లబెట్టేవారు అంటుంది. అది చూసే భాగ్యం మనకు లేదు అత్తయ్యా అంటుంది నయని. ఈసారి వెళ్లి చూద్దాం నయని అంటుంది దురందర. బాగా చెప్పావు దురందర. మాఘమాసంలో రండి అమ్మా మా ఊర్లో అమ్మవారికి ఉత్సవాలు ఉంటాయి అని చెప్పి వెళ్లిపోతుంది రత్నాంభ.
వల్లభ లెక్కలు వేస్తుంటే తిలొత్తమ్మ వెళ్లి ఏం చేస్తున్నావు వల్లభ అని అడుగుతుంది. వల్లభ పలకకుండా లెక్కలు వేస్తుంటే.. చెవి పట్టుకుని ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఈ నాలుగు రోజులు నీకు కష్టం ఎప్పుడొస్తుందోనని లెక్కలు వేస్తున్నాను అని చెప్పగానే అరేయ్ నీకు జ్యోతిష్యం తెలిస్తే నువ్వు ఎప్పుడో బాగుపడేవాడివి అంటుంది తిలొత్తమ్మ.. ఆరుపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు ఎలాగూ ఈ శుక్రవారం పోతున్నావు కాబట్టి ఎలాగూ పోతున్నావు కాబట్టి నీ కొడుకుల యోగక్షేమాలు కోరుకుంటున్నావు అంతే కదా అంటాడు వల్లభ. దీంతో తిలొత్తమ్మ కొట్టబోతుంటే మమ్మీ కొట్టకు మమ్మీ అంటాడు వల్లభ. నేను కచ్చితంగా ఈ నాలుగు రోజుల్లో పోతానని మీ అందరికీ నమ్మకం కుదిరింది. ఎందుకంటే గాయత్రి పాప కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చు. అయితే నా జాగ్రత్తలో నేను ఉంటే గనక అయిదో రోజులోకి అడుగుపెట్టడం జరగుతుంది. అప్పుడు విశాలాక్షి అన్నది అబద్దం అని తేలుతుంది అంటుంది తిలొత్తమ్మ. ఈ గండం గట్టెక్కుతే ఇక నీకు తిరుగుండదు మమ్మీ అంటాడు వల్లభ.
మరుసటి రోజు వల్లభ ఇల్లంతా తిరుగుతూ విశాలాక్షిని పిలుస్తుంటాడు. ఇంతలో హాసిని వచ్చి ఏంటి చెప్పండి అని అడుగుతుంది. దీంతో ఏయ్ నీ పేరు విశాలాక్షా..? అంటాడు. దీంతో కట్టుకున్న పెళ్లాం పేరే మర్చిపోయావా అంటుంది హాసిని..వల్లభ పలకకుండా ఏయ్ విశాలాక్షి అని పిలుస్తుంటే.. నయని కోపంగా బావగారు పేరుకు ముందు ఏయ్ ఏంటి గౌరవంగా పిలవకూడదా..? అంటుంది. ఇంతలో విశాలాక్షి వస్తుంది. ఎవరో నన్ను పిలుస్తు్న్నారా ఇక్కడ అంటుంది. చూశారా ఎంత పొగరు అంటుంది తిలొత్తమ్మ. మీ ప్రాణం తీసేది గాయత్రి అమ్మగారే అని అందరికీ తెలుసు కదా అంటుంది విశాలాక్షి. అందరూ షాక్ అవుతారు. ఇంతలో రత్నాంభ అంత చిన్న పిల్ల గాయత్రి తిలొత్తమ్మ ప్రాణాలు హరిస్తుందా..? ఆశ్చర్యంగా ఉందే అంటుంది.
ఇన్ని రోజులు ఉన్నారు ఈ నాలుగు రోజు ఉండి అది కూడా చూసి వెళ్లండి బామ్మ అంటుంది హాసిని. ఇంతలో తిలొత్తమ్మ కోపంగా విశాలాక్షిని నువ్వే నా ప్రాణాలు తీసి అది గాయత్రి పాప మీద నెట్టేస్తావా ఏంటి..? అని తిడుతుంది. వల్లభ కూడా తను చెప్పిందే జరుగుతుందని మనతో పదే పదే చెప్పి అన్నట్టే జరిగింది అనే వాళ్లు కూడా ఉన్నారు అంటాడు. దీంతో ప్రాణమే తీయాలనుకుంటే నాకు రెప్పపాటు పని.. కానీ ఎవరు చేయగలరో వాళ్లే ధర్మబద్దంగా విధివిధానంగా జరగాలి అంటుంది విశాలాక్షి. మా అత్తయ్య ఫ్రాణం పోతే మోక్షం లభిస్తుందా..? అని అడుగుతుంది. తిలొత్తమ్మ నయనిని తిడుతుంది. దీంతో మోక్షం లభిస్తే మళ్లీ జన్మ ఉండదు.. కానీ నువ్వు మళ్లీ దురందర కడుపులో పుట్టబోతున్నావు అని చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతటితో త్రినయని సీరియల్ ఈరోజు ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?