OTT Movie : హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు చూడాలంటే వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. వీటిలో వచ్చే సస్పెన్స్ సీన్స్ చూసి తట్టుకోవడం కష్టం. ఒంటరిగా ఇటువంటి సినిమాలు చూడటం కష్టమనే చెప్పాలి. అయితే ఈ సినిమాలు చూస్తున్నప్పుడు మూవీ లవర్స్ బాగా థ్రిల్ అవుతారు. అటువంటి గూస్ బంప్స్ తెప్పించే మూవీ ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon prime video)
ఈ హాలీవుడ్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘నైట్ షిఫ్ట్‘ (Night shift). ఈ మూవీలో నైట్ షిఫ్ట్ చేసే అమ్మాయికి, ఒక హోటల్లో అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. రాత్రిపూట ఒంటరిగా ఉండే ఈ అమ్మాయికి, హోటల్ కి వచ్చే కస్టమర్లకు మధ్య జరిగే సన్నివేశాలతో మూవీ స్టోరీ రన్ అవుతుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరోయిన్ నిర్మానుషమైన్ ప్రదేశంలో ఉండే ఒక హోటల్ కి వస్తుంది. అక్కడ టెడ్డి అనే వ్యక్తి ఆ హోటల్ కి ఓనర్ గా ఉంటాడు. హీరోయిన్ అందులో నైట్ షిఫ్ట్ జాబ్ చేయడానికి వస్తుంది. ఆ ప్రాంతం అంతా చూపిస్తాడు ఓనర్. అయితే 13వ నెంబర్ రూమ్ తక్కువ రేటుకు ఇవ్వమని చెప్తాడు. ఎందుకంటే అందులో దయ్యాలు ఉంటాయని వాళ్ళు నమ్ముతారు కాబట్టి, ఆ రూమ్ ని చాలామంది కస్టమర్లు రిజెక్ట్ చేస్తారు. అలా ఆమెకు హోటల్ చూపించి, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయమని వెళ్లిపోతాడు ఓనర్. రిసెప్షన్ లో కూర్చున్న హీరోయిన్ కి 13వ నెంబర్ రూమ్ నుంచి ఫోన్ వస్తుంది. ఈ హోటల్లో ఒకే ఒక కస్టమర్ రూమ్ నెంబర్ 8 లో మాత్రమే ఉన్నారు. 13వ నెంబర్ నుంచి ఎవరు కాల్ చేశారని, హీరోయిన్ అనుమానంగా వెళుతుంది. ఆ రూమ్ లో వెతుకుతుండగానే, ఈసారి రిసెప్షన్ నుంచి 13వ రూమ్ నెంబర్ కి కాల్ వస్తుంది. తనతో ఎవరో ఆడుకుంటున్నారని హీరోయిన్ అక్కడికి వెళుతుంది. హోటల్ బయట నుంచి ఒక కారు ఈమెను గమనిస్తూ ఉంటుంది. అది చూసి హీరోయిన్ చాలా భయపడుతుంది. ఇంతలో రూమ్ నెంబర్ 8లో ఉండే అలైస్, హీరోయిన్ తో హెయిర్ డ్రయ్యర్ కావాలని అడుగుతుంది. స్టోర్ రూమ్ లో వెతుకుతుండగా సడన్గా కరెంటు పోతుంది. అందులో ఎవరో ఉన్నట్టు ఇద్దరూ భయపడుతూ ఉంటారు. చివరికి అక్కడ ఎలుక మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత జాగ్రత్తగా ఉండమని అలైస్ ని హెచ్చరిస్తూ రిసెప్షన్ కి వెళ్ళిపోతుంది హీరోయిన్.
ఇంతలో కారులో ఫాలో అవుతున్న వ్యక్తి హీరోయిన్ దగ్గరికి వచ్చి, రూమ్ చూపించమని ఆమెతో చెప్తాడు. తనను ఏదైనా చేస్తాడేమో అని అనుకుంటూ హీరోయిన్ రూమ్ చూపించడానికి వెళ్తుంది. ఈ క్రమంలోనే అతడు ఏమైనా చేయకముందే, నేనే అతన్ని చంపేస్తానని అనుకుంటూ సీజర్ తీసుకొని గొంతులో పొడుస్తుంది. ఆ వెంటనే అతడు మాట్లాడుతూ, నన్ను గుర్తుపట్టలేదా అని అడుగుతాడు. నిజానికి హీరోయిన్ ఒక సైకలాజికల్ పేషంట్. తన తల్లితో సహా చెల్లెల్ని కూడా దారుణంగా చంపేసి ఉంటుంది. ఈమెను ఒక డాక్టర్ దగ్గర అబ్జర్వేషన్ లో ఉంచుతారు. అక్కడి నుంచి పారిపోయి, ఈ హోటల్ కి పనిచేయడానికి అంటూ వస్తుంది. ఆమెకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి, హాస్పిటల్ కి తీసుకొని పోదామని డాక్టర్ వచ్చి ఉంటాడు. అతన్ని దారుణంగా హీరోయిన్ చంపేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ కి తన తల్లి, చెల్లెల ఆత్మలతో పాటు డాక్టర్ ఆత్మ కూడా కనపడుతుంది. చివరికి హీరోయిన్ ఏమవుతుంది? ఆ హోటల్లో ఉన్న వాళ్ళని కూడా చంపేస్తుందా? పోలీసులు హీరోయిన్ ను పట్టుకుంటారా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, గూస్ బంప్స్ తెప్పించే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.