E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమ్మును చంపేందుకు మనోహరి ప్లాన్  

Nindu Noorella Saavasam Serial Today January 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమ్మును చంపేందుకు మనోహరి ప్లాన్  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:

యాదమ్మ వంట చేసి పిల్లలను భోం చేయడానికి పిలుస్తుంది. పిల్లలందరూ కిందకు వస్తారు. కర్రీస్‌ ఏం చేశావు యాదమ్మ అని అడుగుతారు. మీరే చూడండి అని యాదమ్మ చెప్పగానే అందరూ కర్రీస్‌ ఓపెన్‌ చేసి చూస్తారు. అంజు ఇరిటేటింగ్‌  గా ఏంటి యాదమ్మ ఈ కూరలు మాకు ఇష్టమైనవి ఒక్కటి కూడా లేవు అనగానే.. మాకు ఇష్టమైనవి చేయమని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని ఆనంద్‌ అడుగుతాడు. మనోహరి గారు చెప్పిన మెనూనే చేశాను అని చంభా అలియాస్‌ యాదమ్మ చెప్తుంది. దీంతో ఆకాష్‌ కోపంగా మాకు ఇష్టం లేనివి చేస్తే మేము తినాలా..? అని అడగ్గానే.. ఆ విషయం మనోహరి గారినే అడగండి అని చెప్తుంది. ఇంతలో అక్కడకు మనోహరి వచ్చి ఏంటి యాదమ్మ ఏమైంది అని అడుగుతుంది. దీంతో అమ్ము ఈ యాదమ్మ చేసే వంటలు మాకు నచ్చడం లేదు ఆంటీ అని చెప్పగానే.. ఒక్క కర్రీ కూడా టేస్టీగా ఉండదు ఆంటీ.. ఎలా తినాలి ఆంటీ అని చెప్పగానే.. మనోహరి కోపంగా అయితే నన్ను తినవే.. తిను అంటుంది.

దీంతో అంజు వెటకారంగా మీరు కూడా టేస్టీగా ఉండరు అనుకోండి కారం కారంగా ఎప్పుడు చూసినా ముఖం అలా పెట్టుకుని మూడీగా ఉంటారు. అనగానే.. అందరూ నవ్వుతుంటారు.. మనోహరి కోపంగా చూస్తుంది. ఇంతలో ఆనంద్‌ ఈ యాదమ్మకు వంటైనా నేర్పించండి ఆంటీ లేదంటే ఈవిడను మార్చి ఇంకో కొత్త కుక్‌ ను తీసుకురండి అని చెప్పగానే.. యాదమ్మను మార్చడం కుదరదు.. అని చెప్తుంది. దీంతో ఆకాష్‌ తను చేసే టేస్ట్ లేని వంటలు మేము తినము అని చెప్తాడు. దీంతో ఈ విషయం మీ డాడ్‌తో చెప్పమంటారా..? అని మనోహరి అడగ్గానే.. అమ్ము కోపంగా చెప్పండి మేము డాడ్‌ చెప్పే డైటే ఫాలో అవుతాం ఇలా రుచి లేని వంటలు తినము అంటుంది. ఇంతలో అంజు కల్పించుకుని ఫుడ్‌ టేస్టీగా లేకపోతే మా డాడ్‌ మాత్రం ఊరుకుంటారా ఏంటి..? అని అడుగుతుంది. ఆనంద్‌ కూడా మీరే కాదు ఫుడ్‌ బాగాలేదని మేమే మా డాడీతో చెప్తాము అంటాడు. ఆకాష్‌ కూడా అప్పుడు డాడీయే ఈ యాదమ్మను పనిలోంచి తీసేసి వేరే కుక్‌ ను పెడతాడు అని చెప్పగానే..

Advertisement

మనోహరి మనసులో అమర్‌ అంత పని చేసినా చేస్తాడు. అనుకుని రేపటి నుంచి యాదమ్మతో దగ్గరుండి నేనే వంట చేయిస్తాను.. ఈరోజు ఫుడ్‌ను ఆర్డర్‌ చేసి తెప్పిస్తాను సరేనా అని చెప్తుంది. ఏమీ అక్కర్లేదు మేము బయటి ఫుడ్‌ అసలు తినము.. అని అంజు చెప్తుంది. తినకపోతే ఆకలితో మాడిపోతారు అని మనోహరి చెప్పగానే.. మాడిపోకుండా మా ఫుడ్‌ ఎలా తినాలో మాకు తెలుసు..? పదండి వెళ్దాం అంటూ పిల్లలు పైకి వెళ్లిపోతారు. మనోహరి కోపంగా ఈ పొట్టి దానికి ఎంత పొగరు మాటకు మాట సమాధానం చెప్తుంది అని మనసులో కోప్పడుతూ.. నువ్వు కూడా ఏంటి చంభా.. వంటలు కాస్త రుచిగా చేయోచ్చు కదా..? అనగానే.. యాదమ్మ కోపంగా మనోహరి నేను వంటగత్తెను కాదు మంత్రగత్తెని కాదు.. అంటుంది. దీంతో మనోహరి కోపంగా నువ్వు వంట సరిగ్గా చేయకపోతే అమర్‌ తో చెప్పి పిల్లలు నిన్ను ఇక్కడి నుంచి పంపిచేలా ఉన్నారు.. కాస్త చూసుకో అని హెచ్చరిస్తుంది.

తర్వాత అమ్ముకు ఏదైనా ప్రమాదం తలపెట్టాలిన మనోహరి ప్లాన్‌ చేస్తుంది. అందులో భాగంగా యాదమ్మ బట్టలు తీసుకొచ్చి హాల్లో పెట్టి అమ్మును పిలుస్తుంది. పై నుంచి అమ్ము కిందకు రాగానే.. కాస్త ఈ బట్టలు మేడ మీద ఆరేస్తావా అమ్ము అని చెప్తుంది. సరే అంటూ అమ్ము బట్టలు తీసుకుని పైకి వెళ్తుంది. అప్పుడే లోపలి నుంచి మనోహరి వస్తుంది. అమ్ము చంపేస్తావా..? మనోహరి అని యాదమ్మ అడగ్గానే.. మాగ్జిమమ్‌ దాని కాళ్లు చేతులు విరిగేలా చేస్తాను. నా మీద డౌటు వచ్చేలా ఉంటే చంపేస్తాను అని చెప్పి పైకి వెళ్లి అమ్మును మేడ మీద నుంచి కిందకు తోసేయాలని చూస్తుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

Big Stories

Advertisement
×