E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode July 17th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి వార్నింగ్‌ ఇచ్చిన అమర్‌

Nindu Noorella Saavasam Serial Today Episode July 17th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి వార్నింగ్‌ ఇచ్చిన అమర్‌
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: ఇంట్లో జరుగుతున్న అనర్థాల గురించి బుజ్జమ్మ, అంజు ప్రవర్తన గురించి గుడికి వెళ్లి ఒక స్వామిజీని కలుస్తుంది మిస్సమ్మ. అయితే స్వామిజీ అంత విన్న తర్వాత ఇంట్లో కానీ అంజు ఒంట్లో కానీ దుష్టశక్తి ప్రవేశించిందని చెప్పడంతో మిస్సమ్మ షాక్‌ అవుతుంది. గుడిలోంచి బయటకు వచ్చి రాథోడ్ తో బాధపడుతుంది. ఎప్పుడూ ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది అంటూ ఎమోషనల్ అవుతుంది.

రాథోడ్‌ మాత్రం కోపంగా ఇదంతా ఆ మనోహరి కుట్రే అయ్యుంటుంది మిస్సమ్మ. తను కావాలనే ఏదో చేస్తుంది అంటూ తిడుతుంటే.. మిస్సమ్మ కూడా కోపంగా దాన్ని ఏం చేసినా పాపం లేదు రాథోడ్‌.. ఆయనకు గతం గుర్తుకు వచ్చి ఉంటే.. దాని పరిస్థితి ఇంకోలా ఉండేది అంటూ చెప్తుంటే.. రాథోడ్‌ సరేలే మిస్సమ్మ ఈరోజు హోమం చేస్తున్నాము కదా హోమం అయిపోయాక మరోసారి కొడైకెనాల్‌ ఎస్సై గారిని మళ్లీ ఇంటికి పిలిపించి సార్‌కు గతం గుర్తుకు వచ్చేలా చేద్దామని చెప్తాడు. సార్‌కు గతం గుర్తుకు వస్తే ఆ మనోహరి జైలుకు వెళ్లక తప్పదు అంటాడు. మిస్సమ్మ సరే రాథోడ్‌ హోమం సరుకులు తీసుకుని వెళ్దాం అంటూ ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోతారు.

Advertisement

ఇంట్లో అమర్‌.. మిస్సమ్మ, రాథోడ్‌ కోసం వెతుకుతుంటాడు. మనోహరి వెళ్లి ఏంటి అమర్‌ వెతుకుతున్నావు అని అడిగితే మిస్సమ్మ, రాథోడ్‌ కనిపించడం లేదేంటి అని అడుగుతాడు.. వాళ్లు గుడికి వెళ్తున్నామని చెప్పారు కదా..? అనగానే.. చాలాసేపు అయింది గుడికి వెళ్లి అంటూ అమర్‌ చెప్తుంటే.. వాళ్ల గురించి ఏం చెప్తాము అమర్.. వాళ్లేమైనా ఇంట్లో వాళ్లా..? పరాయివాళ్లు కదా..? వాళ్లకు పిల్లలు, ఇల్లు అనే బాధ్యతలు తెలిస్తే వచ్చేవారు.. అంటూ  మనోహరి లేనిపోని కట్టుకథలు చెప్తుంటే.. అమర్ వెంటనే యాదమ్మ నీకు నెలకు శాలరీ ఎంత ఇస్తున్నాము.. అని అడుగుతాడు. యాదమ్మ 25వేలు సార్‌ అని చెప్తుంది. వెంటనే మనోహరి యాదమ్మ చెవిలో అదేంటి నీకు పదివేలే కదా..? అంటుంది. ఆ విషయం సారుకు తెలియదు కదా అంటూ మనోహరి చెవిలో చెబుతూ.. ఈ నెల నుంచి మరో ఐదు వేలు పెంచి 30 వేలు ఇస్తామన్నారు సార్‌ అంటుంది.

ఆ మాటలకు అమర్‌ ఓహో అయితే మనోహరి ఎంత ఇస్తుంది నీకు శాలరీ అని అడగ్గానే.. మనోహరి నేనెందుకు ఇవ్వాలి అమర్ నేను ఆరు ఫ్రెండ్ ను కదా..? అనగానే.. అమర్‌ కోపంగా అయితే ఈ నెల నుంచి యాదమ్మ నీ జీతం ఐదు వేలే ఇస్తాము ఎందుకంటే నా పనులు, పిల్లల పనులు వంట పనులు ఇంటి  పనులు అన్ని మిస్సమ్మ చూసుకుంటుంది. నువ్వేమో మనోహరి వెనకాలే తిరుగుతుంటావు అని చెప్పగానే.. యాదమ్మ షాక్‌ అవుతుంది. సార్‌ అంటూ గట్టిగా అరుస్తుంది. అప్పుడే గుడికి వెళ్లిన మిస్సమ్మ, రాథోడ్‌ వస్తారు. రాథోడ్‌ చేతిలో సంచిలో ఉన్న సరుకులు చూసి అమర్‌ అవేంటి అని అడుగుతాడు. పూజా సామాన్లు అండి.. మీ ఆరోగ్యం బాగుండాలని  రేపు ఇంట్లో పూజ చేయమని పంతులుగారు చెప్పారు అంటూ మిస్సమ్మ చెప్పగానే.. మనోహరి కోప్పడుతుంది. ఆరోగ్యం బాగా లేకపోతే హాస్పిటల్‌ కు వెళ్లాలి కానీ ఇలా పూజలు చేయడం ఏంటి మిస్సమ్మ అంటూ తిడుతుంది.

Advertisement

అందుకు మిస్సమ్మ ఆరోగ్యం బాగా లేకపోతే డాక్టర్‌కు చూపించుకోవాలి అలాగే దేవుడికి మొక్కుకోవాలి అని చెప్పగానే. ఎవరిని అడిగి చేస్తున్నారు.. ఇది ఇల్లు అనుకున్నారా..? లేక మఠం అనుకున్నారా..? అంటూ తిడుతుంటే.. నాకోసం వాళ్లు పూజలు చేస్తుంటే.. నీకెందుకు ఆబ్జెక్షన్‌ మనోహరి.. అంటూ అమర్‌ అడిగితే అది కాదు అమర్‌ పిల్లలు ఉన్న ఇంట్లో పూజలు ఏంటని.. అడుగుతున్నాను అనగానే.. మిస్సమ్మ కోపంగా మేమేం క్షుద్రపూజలు చేయడం లేదు మనోహరి దేవుడి పూజలు చేస్తున్నాము.. అని చెప్పగానే.. రాథోడ్‌ వెటకారంగా పూజలంటే మీరు తడబడుతున్నారేంటి మనోహరి గారు మీకు యాదమ్మకు పూజలేం కొత్త కాదు కదా..? అనగానే.. అమర్‌ వాళ్ల గురించి వదిలేయండి.. రేపు మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి అని చెప్పి వెళ్లిపోతాడు. మనోహరి షాక్‌ అవుతుంది. సడెన్‌ గా ఈ పూజ ఏంటి అని భయపడుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

సింగర్ కనకవ్వ పాటలకు అంత క్రేజ్ ఎందుకు?

మాట నిలబెట్టుకున్న వైవా హర్ష.. జబర్దస్త్ బాబుకి కళ్ళు చెదిరే గిఫ్ట్!

Big Stories

Advertisement
×