E-Paper
Advertisement

Colored Papad: కలర్ పాపడ్‌లకు చెక్.. బ్యాన్ చేసిన విజయ్ సర్కార్, అధిక మోతాదులో రసాయనాలు!

Colored Papad: కలర్ పాపడ్‌లకు చెక్.. బ్యాన్ చేసిన విజయ్ సర్కార్, అధిక మోతాదులో రసాయనాలు!
Advertisement

Colored Papad: విజయ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కలర్ పాపడ్లు రంగురంగుల అప్పడాలపై బ్యాన్ చేసింది. వీటిని తిని పిల్లలు తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో అధిక మోతాదులో కృత్రిమ రంగులు కలిపిన రంగుల పాపడ్‌ల అమ్మకాలపై నిషేధం విధించింది తమిళనాడు ఆహార శాఖ.

కలర్ పాపడ్‌లకు చెక్-ఏ వస్తువు పట్టుకున్నా కల్తీ లేకుంటే రసాయనాలు. అరటిపండు మొదలు అప్పడాల వరకు ఇదే పరిస్థితి. కల్తీన బారినపడి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు సామాన్యులు. ఆహారపు అలవాట్లలో అప్పడాలకు ప్రత్యేక స్థానం ఉంది. దేశవ్యాప్తంగా ఇళ్లు, రెస్టారెంట్లలో భోజనంతోపాటు అప్పడాలను కచ్చితంగా తింటారు. ఈ మధ్యకాలంలో రంగుల్లో పాపడ్లను సైతం వడ్డిస్తున్నారు.

Advertisement

బ్యాన్ చేసిన విజయ్ సర్కార్-మరికొందరు తయారు చేసి అమ్ముతున్నారు కూడా. హిందీలో పాపడ్ అని పిలుస్తారు. తమిళంలో అప్పళం అంటారు. తెలుగులో చిన్న గొట్టాలు అంటారు. వీటిని పప్పు లేదా బియ్యపు పిండితో తయారు చేస్తారు. సాధారణంగా ఫ్రైయమ్ కంటే పలుచగా ఉంటాయి. ఫ్రైయమ్‌ను బంగాళదుంప పిండి లేదా సగ్గుబియ్యం  నుండి తయారు చేస్తారని చెబుతున్నారు.

అధిక మోతాదులో రసాయనాలు! పిండిలో కొద్ది మొత్తంలో రసాయనాలు కలపడం వల్ల రంగులు వస్తాయి. ఆ తర్వాత ఆవిరి మీద ఉడికిస్తారు. ఆ తర్వాత ఎండలో ఆరబెడతారు. ఇలాంటి రంగుల పాపడ్‌లను తరచుగా తినడం వల్ల జీర్ణ సమస్యలు, కిడ్నీ దెబ్బతినడం, క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని తమిళనాడు ఆహార భద్రతా విభాగం తెలిపింది. పిల్లలలో అలర్జీలు, ఏకాగ్రత లోపానికి కారణమవుతాయని పేర్కొంది.

Advertisement

వీటికి ప్రత్యామ్నాయంగా మినప పప్పు లేదా బియ్యంతో తయారు చేసిన పాపడ్‌లను ఎంచుకోవాలని సూచించారు. నిషేధిత లేదా అధిక మోతాదులో ఉండే రంగులను కలపడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని తమిళనాడు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ హెచ్చరించింది.

ALSO READ: నీట్ యూజీ-2026 ఫలితాలు.. 11.21 లక్షల మంది క్వాలిఫై, హనుమకొండ విద్యార్థికి 13వ ర్యాంక్

ఈ క్రమంలో తమిళనాడు ఆహార భద్రతా విభాగం.. కృత్రిమ రంగులు కలిపిన పాపడ్ తయారీ, నిల్వ, పంపిణీ  అమ్మకాలను నిషేధించింది. గతంలో పానీ పూరీలో రసాయనాలు వినియోగించినట్టు తేలడంతో అధికారులు దాడులు చేశారు.  అది కాస్తా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇప్పుడు పాపడ్‌ల వంతైంది. మొత్తానికి ఆహార పదార్ధాలు  అయితే కల్తీ, లేకుంటే రసాయనాల మయంగా మారాయని అంటున్నారు సామాన్యులు.

Related News

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

డేంజర్ బెల్స్.. ఏఐతో భారీగా పర్యావరణం విధ్వంసం.. ఎలానో తెలుసా..?

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కే ‘తిరంగా యాత్ర’ అడ్డుకున్న పోలీసులు.. ఇంటికెళ్లి నోటీసులు అందజేత!

అమ్మబాబోయ్.. 75 ఏళ్ల తాతతో 30 ఏళ్ల యువతి పెళ్లి.. నిశ్చితార్థం వీడియో వైరల్!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వేలో 1,688 ఖాళీలు, సాలరీ, దరఖాస్తు పూర్తి వివరాలివిగో

నా ఇంటి చుట్టూ నిఘా పెట్టారు.. ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చు, సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే

ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఎలాన్ మస్క్ బిగ్ ట్విస్ట్..?

Big Stories

Advertisement
×