E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today July 4th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: యమలోకం బయలుదేరిన ఆరు

Nindu Noorella Saavasam Serial Today July 4th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: యమలోకం బయలుదేరిన ఆరు
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: చిత్ర, మనోహరి ఇద్దరూ కలిసి అమర్‌ రూంలోని వాష్‌రూంలో కరెంట్‌ వైర్‌ కట్‌ చేసి వాటర్‌ టాప్‌ ఓపెన్‌ చేసి మిస్సమ్మను చంపేయాలని ప్లాన్‌ చేస్తారు. అనుకున్నట్టుగానే చేసి కిందకు వచ్చి మిస్సమ్మను పైకి పంపిస్తారు. పైకి  రూంలోకి వెళ్లిన మిస్సమ్మ వాటర్‌ సౌండ్‌ విని వాష్‌రూం ఓపెన్‌ చేస్తుంది. అదేంటి వాటర్‌ వస్తున్నాయి. వెళ్లినప్పుడు నేను అన్ని ఆఫ్‌ చేసే వెళ్లాను కదా అనుకుంటూ లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో కింద నుంచి ఆరు పరుగెత్తుకుని వస్తుంది. అప్పుడే ఆరు రూంలోకి వెళ్లి ఫోటో దగ్గర ఉన్న పూలు తీసేస్తుంది మనోహరి. దీంతో ఆరుకు స్పర్శ శక్తి తగ్గిపోతుంది. భాగీ అంటూ దగ్గరకు వెళ్లి పట్టుకోబోతే టచ్‌ చేయలేదు. రూంలో పూలు తీసి గుడ్‌ బై ఆరు భూమి మీద నుంచి పర్మినెంట్‌గా వెళ్లిపోతున్నావు కదా అందుకే నీకు తోడుగా నీ చెల్లిని కూడా పంపిస్తున్నాము తీసుకుని వెళ్లు అనుకుంటుంది.

రూంలోకి వచ్చి మనోహరిని చూసిన ఆరు అక్కడి నుంచి మళ్లీ మిస్సమ్మ దగ్గరకు వెళ్లిపోతుంది. పూలు తీసుకుని వెళ్లిన మనోహరి చెత్తబుట్టలో వేసి నిన్ను బాగా మిస్‌ అవుతాను నేను అనుకుంటుంది. ఇంతలో వాష్‌రూంలోకి మిస్సమ్మ అడుగుపెడుతుంటే వెనక నుంచి చిత్ర వచ్చి చేయి పట్టి లాగేస్తుంది. భాగీ అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా..? అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ నేనేం చేశాను.. వాటర్‌ లీక్‌ అవుతుంటే టాప్‌ ఆఫ్‌ చేద్దామనుకున్నాను  అని చెప్తుంది. దీంతో చిత్ర అది ఒక్కటే కాదు. ఇటురా చూపిస్తాను అదిగో చూడు అంటూ తెగిపడిన కరెంట్‌ వైర్‌ చూపిస్తుంది. మిస్సమ్మ షాక్‌ అవుతుంది. మరోవైపు ఆరు రూంలోంచి బయటకు వచ్చిన మనోహరి మిస్సమ్మ రూం వైపు చూసి డోర్‌ ఓపెన్‌ చేసుకుని ఇంత సైలెంట్‌గా ఉందంటే కరెంట్‌ షాక్ గట్టిగానే తగిలినట్టుంది. ఇది కచ్చితంగా పోయి ఉంటుంది అనుకుంటుంది.

Advertisement

మరోవైపు మిస్సమ్మ భయంతో అమ్మో చిత్ర థాంక్స్‌ చిత్ర నువ్వు రాకపోయి ఉంటే ఇంకా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది అని చెప్తుంది. దీంతో చిత్ర పర్వాలేదులే భాగీ ఇంకోసారి అలా జరగకుండా చూసుకో.. సరే కిందకు వెళ్లి మెయిన్‌ ఆఫ్‌ చేసి రాపో అని చెప్పగానే.. మిస్సమ్మ సరే చిత్ర అంటూ కిందకు వెళ్తుంటే.. రూంలోంచి వచ్చిన మిస్సమ్మను చూసిన మనోహరి షాక్‌ అవుతుంది. ఏయ్‌ భాగీ ఎక్కడికి అంత కంగారుగా వెళ్తున్నావు అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ మెయిన్‌ ఆఫ్‌ చేయడానికి అని చెప్తుంది. దీంతో ఏయ్‌ మెయిన్‌ ఆఫ్‌ చేయడం ఏంటి అని అడుగుతుంది.

మా వాష్‌రూంలో గీజర్‌ ఉంది కదా దాని వైర్‌ కట్‌ అయి వాటర్‌ లో పడింది. నేను చూసుకోకుండా లోపలికి వెళ్లి టాప్‌ ఆఫ్‌ చేద్దామనుకున్నాను. చిత్ర వచ్చి నన్ను కాపాడింది సరే సరే నేను మెయిన్‌ ఆఫ్‌ చేయాలి అని చెప్పి వెళ్లిపోతుంది మిస్సమ్మ. మనోహరి షాక్ అవుతుంది. కోపంతో చిత్ర కాపాడిందా.?దీన్ని అనుకుంటూ లోపలికి వెళ్లి ఏయ్‌ నీకు ఏమైనా పిచ్చి పట్టిందా..? నువ్వు దాన్ని కాపాడటమేంటి..? ఏయ్‌ చిత్ర నేను నీతోనే మాట్లాడుతున్నాను. దాన్ని ఎందుకు కాపాడావు అని అడుగుతుంది. దీంతో   చిత్ర కాదు మనోహరి అరుంధతి అంటూ కోపంగా చూస్తుంది. మనోహరి భయంతో వణికిపోతుంది. అక్కడి నుంచి కిందకు పరుగెత్తుకుని వెల్లిపోతుంది.

Advertisement

తర్వాత గార్డెన్‌లో ఉన్న ఆరు బాధగా మనోహరి తన ఫోటో దగ్గర పూలు తీయడం గుర్తు చేసుకుని నేను భూలోకాన్ని వదిలి వేసే టైం వచ్చేసింది అంతే కదా గుప్త గారు అంటుంది. గుప్త ఎమోషనల్‌ అవుతూ నిన్ను ఇటులా చూడవలిసి వచ్చినందుకు మా గుండె భారంగా ఉంది బాలిక. కానీ కర్తవ్య నిర్వహణలో మాకు తప్పుట లేదు మమ్మలను క్షమించుము అంటాడు. దీంతో ఆరు ఏడుస్తూ ఇక వెళ్దాం పదండి గుప్తగారు అంటుంది. దీంతో గుప్త మంత్రం చదవగానే ఆరు, గుప్త యమలోకానికి వెళ్తుంటారు. వెళ్తూ వెళ్తూ ఆరు ఇంటిని చూస్తూ అన్ని విషయాలు గుర్తు చేసుకుంటుంది. దీంతో గుప్త ఎమోషనల్‌గా బాలిక రుణము తీరిన బంధాలను గుర్తుకు తెచ్చుకోకు అని చెప్తాడు. ఆరు ఏడుస్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×