BigTV English

Raja Singh: ఆ పార్టీలో చేరబోతున్నాని క్లారిటీ ఇచ్చిన రాజాసింగ్..?

Raja Singh: ఆ పార్టీలో చేరబోతున్నాని క్లారిటీ ఇచ్చిన రాజాసింగ్..?

Raja Singh: తెలంగాణ బీజేపీలో రెబల్ అవతారమెత్తిన గోషామహల్ రాజాసింగ్ రంగు మార్చనున్నారా? కాషాయ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఎరుపు కండువా కప్పుకోనున్నారా? లేకపోతే కమలాన్ని కాదని కాగడా పట్టుకోబోతున్నారా? రాజాసింగ్ శివసేనలోకి జంప్ అవుతారన్న ప్రచారంలో నిజమెంత? ఒకవేళ శివనేనలోకి వెళ్తే రాజాసింగ్ మరో ఏక్‌నాథ్ షిండే అనిపించుకుంటారా? ఏకంగా శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే అవతారం ఎత్తుతారా? రాజసింగ్ ఫ్యూచర్‌పై పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చేంటి?


బీజేపీకి కొరక రాని కొయ్యలా తయారైన రాజాసింగ్

రాజసింగ్ రాష్ట్ర బీజేపీ పరివారులకు కొరక రాని కొయ్యగా తయారయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష రేసులో ఎవరైనా ఉండొచ్చని గట్టిగానే వాదించారు. అందులో భాగంగానే సంస్థగత ఎన్నికల్లో ప్రెసిడెంట్ పోస్టుకి నామినేషన్ వేయడానికి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజసింగ్‌కు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మధ్య గొడవ జరిగిందనే టాక్ వినిపిస్తోంది. పార్టీ కార్యాలయానికి వచ్చిన సందర్భంలో కిషన్ రెడ్డి, రాజాసింగ్ ఇద్దరి మధ్య హాట్‌హాట్‌గా మాటల యుద్ధం జరిగిందని పార్టీ నేతలు గుసగుస లాడుకుంటున్నారు.


కొంత కాలంగా కిషన్‌రెడ్డిని టార్గెట్ చేస్తున్న రాజాసింగ్

గత కొంత కాలంగా కిషన్‌రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్న రాజాసింగ్.. తనను నామినేషన్ వేయనీయక పోవడం వల్లే బీజేపీకి రాజీనామా చేశారని పార్టీ వర్గాలు అంటున్నాయి. గతం నుంచి కూడా రాజాసింగ్ కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా అధ్యక్ష ఎన్నిక సందర్భంగా ఇద్దరూ తారస పడటంతో పంచాయతీ రాజీనామా వరకు వచ్చింది.

రాజాసింగ్ బయటకు పంపించే యోచనలో బీజేపీ

ఇక ఆ పంచాయితీ అటుంచితే రాజాసింగ్ రాజీనామా తర్వాత సీన్ అంత మారిపోయింది. రాజాసింగ్‌ను బుజ్జగించాల్సిన నాయకత్వ ఆయన్ని పార్టీ నుంచి పంపించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజాసింగ్ రాజీనామా లెటర్‌ను రాష్ట్ర నాయకత్వం ఢిల్లీ పెద్దలకు పంపించింది. ఆయన రాజీనామా లెటర్‌ను ఆమోదించే విధంగా రాష్ట్ర నాయకత్వం తీర్మానం చేసి అధిష్టానానికి పంపిందనే టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద రాజాసింగ్‌ను పార్టీ నుంచి పూర్తి స్థాయిలో తొలిగించాలనే ప్రయత్నాలు జరుగుతున్న నేఫథ్యంలో రాజాసింగ్ ప్లాన్ ఏంటి?రాజాసింగ్ పార్టీ మారబోతున్నారా? ఆయన కాషాయ రంగు మారకపోయినా, గుర్తు మారుస్తారా? అన్నది హాట్ టాపిక్‌గా మారింది.

బాల్ ఠాక్రే శివసేన తీర్థమా..? షిండే వర్గంలో చేరతారా?

రాజసింగ్ శివసేన తీర్థం పుచ్చుకోబోతున్నారా…పుచ్చుకుంటే ఏ వర్గంలో చేరడానికి ట్రై చేస్తున్నారు? బాల్ ఠాక్రే శివసేన తీర్థమా..? లేక షిండే వర్గమా అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సస్పెన్స్‌గా మారింది. బీజేపీకి గుడ్ బై చెప్పి, రాజీనామా చేసిన అనంతరం రాజసింగ్ శివసేన పార్టీ వైపు చూస్తున్నట్టు ఆయన వర్గాలు, సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. కట్టర్ హిందుత్వం బీజేపీలో ఏ మాత్రం లేదని, బీజేపీని నమ్ముకుంటే హిందుత్వానికి ద్రోహం చేసినట్టేనని అందుకే హిందుత్వ అజెండా కలిగిన శివసేన పార్టీనే తనకు సరిపోతుందని రాజసింగ్ భావిస్తున్నట్టు సమాచారం.

శివసేన రాష్ట్ర అధ్యక్షుడిగా రాజకీయం చేసే యోచన

అందులో భాగంగానే బీజేపీని ఢీ కొనడానికి శివసేన పార్టీ తీర్థం పుచ్చుకుని, తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ కార్యకలాపాలు నడపాలనే యోచనలో రాజాసింగ్ ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీజేపీలో హిందుత్వ వాదం లేదంటున్న కరుడు గట్టిన హిందుత్వ వాది రాజాసింగ్ పక్కా వ్యూహంతోనే బీజేపీకి రాజీనామా చేసినట్టు కమలం పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అదలా ఉంటే రాజాసింగ్ బీజేపీని వదిలి ఏక్‌నాథ్ షిండే అవుతారా..? లేక బాల్ ఠాక్రే అవుతారా..? తెలంగాణలో కమలం కాదని బాణం గుర్తు జెండా ఎగరవేస్తారా..? లేక కాగడా పట్టుకుంటారా? శివసేనలోని ఏ వర్గానికి నాయకత్వం వహిస్తారు? ఎవరికి న్యాయం చేస్తారు..? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారుసరే .. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా..? శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తే వచ్చే గోషామహల్ ఉప ఎన్నికల్లో శివసేన అభ్యర్ధిగా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.

Also Read: రాజకీయాలకు వల్లభనేని వంశీ బ్రేక్ ?

కాంగ్రెస్ కూటమిలో ఉన్న ఉద్ధవ్ గ్రూప్ శివసేన

ఒకవేళ శాసనసభ్యత్వాన్ని వదులుకోవడానికి ఇష్టపడకపోతే రాబోయే జనరల్ ఎలక్షన్స్‌లో శివసేన నుంచి బరిలోకి దిగడానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటామని రాజాసింగ్ వర్గీయులు అంటున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర పార్టీ శివసేన రెండుగా చీలింది. ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్, షిండే గ్రూప్‌లుగా విడిపోయింది. ఉద్ధవ్ గ్రూప్ శివసేన పార్టీ కాంగ్రెస్ కూటమిలో కొనసాగుతోంది. షిండే శివసేన బీజేపీ అలయన్స్‌లో ఉంది. ఈ రెండు గ్రూపుల్లో రాజాసింగ్ ఎటు వైపు మొగ్గు చూపుతారు అనేది ఆసక్తిగా ఉంది. అయితే రాజీనామా చేశారు కాబట్టి బీజేపీ అధిష్టానాన్ని కాదని షిండే గ్రూప్ రాజాసింగ్‌ను తీసుకుంటుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి చూడాలి గోషామహల్ రాజా ఫ్యూచర్ ఎలా ఉంటుందో?

Story By Apparao, Bigtv

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×