E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today June 14th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు నిజం చెప్పిన అంజు – షాక్‌ అయిన అమర్‌

Nindu Noorella Saavasam Serial Today June 14th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు నిజం చెప్పిన అంజు – షాక్‌ అయిన అమర్‌
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: ఆరు పిల్లల బుక్స్‌కు రాపర్స్‌ వేస్తుంటే.. అకాష్‌, అంజు చూస్తారు. షాక్‌ అవుతారు. అంజు లాస్ట్‌ టైం నేను బాల్‌ గురించి, ప్లవర్స్‌ గురించి చెబితే నమ్మలేదు కదా..? అంటుంది. ఆకాష్‌ ఇప్పుడు నమ్ముతున్నాను వెంటనే వెళ్లి అక్కా వాళ్లను తీసుకొద్దాం పద అని అక్కడి నుంచి కిందకు వెళ్తారు. రూంలో ఉన్న గుప్త కోపంగా బాలిక నీ పిల్ల పిచ్చుకలు వీక్షించారు. ఇప్పుడు అందరూ వస్తారు వెళ్దాం పద అంటాడు. అయిపోయింది గుప్త గారు లాస్ట్‌ ఇది ఒక్కటే అని చెప్తుంది. కిందకు మిస్సమ్మ దగ్గరకు వెళ్లిన అంజు, ఆకాష్‌ పిల్లలు, మిస్సమ్మను తీసుకుని పైకి రూంలోకి వెళ్తారు. అక్కడ బుక్స్‌ అన్ని నీట్‌గా ఉంటాయి. ఎవ్వరూ కనిపించరు. వాళ్లు రావడానికి ముందే ఆరు, గుప్త అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటారు.

బుక్స్‌ చూసిన మిస్సమ్మ షాక్‌ అవుతుంది. బుక్స్‌ తీసుకుని చూసి పిల్లలు రాపర్ ని ఇంత చక్కగా వేశారని నాకు చెప్పడానికి నన్నే హెల్ప్‌ అడిగి తీసుకొచ్చారా..? అంటుంది. అంజు అది కాదు మిస్సమ్మ అని చెప్పబోతుంటే.. ఇంతలో కింద నుంచి శివరాం మిస్సమ్మను పిలవగానే వెళ్లిపోతుంది. మిస్సమ్మ వెళ్లిపోగానే అమ్ము ఆశ్చర్యంగా అంజు ఇన్ని రోజులు నీకు టాలెంట్‌ ఉందంటే ఏమో అనుకున్న కానీ మరీ ఇంత ఉంది అనుకోలేదు అంటుంది. ఆనంద్‌ కూడా ఆశ్చర్యంగా మేము మిస్సమ్మ దగ్గరకు వెళ్లి వచ్చే లోపు ఇన్ని బుక్స్‌ రాపింగ్‌ ఎలా చేశారు అని అడుగుతాడు. అంత స్పీడుగా ఎలా వేశావే అని అమ్ము అడుగుతుంది. దీంతో అంజు రాపింగ్‌ మేము చేయలేదు అని చెప్తుంది. ఆకాష్‌ కూడా బ్రౌన్‌ షీట్స్‌ వాటంతట అవే రాపింగ్‌ అయిపోయాయి అని చెప్తాడు.

Advertisement

దీంతో అమ్ము ఫ్రాంక్‌ అంటే అలా కాదురా అమ్మే వచ్చి రాపింగ్‌ చేసింది అని చెప్పండి అప్పుడు నమ్ముతాం అంటూ వెళ్లిపోతుంది. అంజు కూడా అమ్ము మేము చెప్తుంది నిజం అంటుంది. కావాలంటే ఈ బుక్‌లో ఉన్న హ్యాండ్‌ రైటింగ్‌ చూడు అంటాడు ఆకాష్‌. ఆ మాటలకు ఆరు షాక్‌ అవుతుంది. అదేంటి గుప్త గారు నేను ఒకటి చేద్దాం అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరుగుతుంది. పిల్లలు హ్యాపీగా ఫీలవుతారు అనుకుంటే కన్పీజన్‌ అవుతున్నారు అని బాధగా కిటికీ దగ్గర నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు వినోద్‌, చిత్ర పార్కులో ఫోటోషూట్‌ చేస్తుంటే మనోహరి వచ్చి ఇరిటేటింగ్‌ గా చూస్తుంది. మనోహరిని చూసిన చిత్ర నీ ఫేస్‌లో ఆ జలసీ చూడాలనే మను నిన్ను ఇక్కడకు తీసుకొచ్చింది అని మనసులో అనుకుటుంది. ఇది దీని ఓవరాక్షన్‌ పెళ్లి జరగడమే ఎక్కువ అనుకుంటే మళ్లీ ఫోటో షూట్‌  అని ఎక్కువ చేస్తుంది అని మనోహరి మనుసులో అనుకుంటుంది. ఇంతలో చిత్ర మనోహరిని వాటర్‌ తీసుకుని రమ్మని పిలుస్తుంది. వాటర్‌ తీసుకుని చిత్ర దగ్గరకు వచ్చిన మను కోపంగా ఏంటో నీ పెళ్లి జరిగిపోతుంది. నా పెళ్లి ఇంకా జరగలేదని చెప్పడానికి ఇదంతా చేస్తున్నావా..? అంటుంది.

దీంతో చిత్ర చీచీ నేను అలా ఎందుకు చేస్తాను మను. అంటుంది. మరి నీ ఫోటో షూట్‌కు నన్ను ఎందుకు రమ్మన్నావు  అని అడుగుతుంది మను. దీంతో చిత్ర తోడుకు మను .. రేపు నీకు అమర్‌ గారి ఫోటోషూట్‌కు నేను రానా ఏంటి..? అంటుంది. మనోహరి మాత్రం అసలు నీ పెళ్లి తర్వాత నాకు హెల్ప్‌ చేస్తావని నమ్మకం ఏంటే.. నీ స్వార్థం మోసం అబద్దాల గురించి తెలిసిన నేను ఎందుకు నీకు హెల్ప్‌ చేస్తున్నాను అని అడుగుతుంది. ఎందుకంటే భాగీ ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు నేను ఆ ఇంట్లో సంతోషంగా ఉండలేను కాబట్టి. భాగీని ఆ ఇంటికి అమర్‌ గారికి దూరం చేయడం నాకు కూడా అవసరమే కాబట్టి  ఆ విషయం నీకు కూడా తెలుసు కాబట్టి నీకు నువ్వు హెల్ప్‌ చేస్తున్నావు మను అంటుంది.

Advertisement

దీంతో మను.. ఆశ్రమంలో చిల్లర దొంగతనాలు చేసే నువ్వు ఇంత దూరం వస్తావని అనుకోలేదు అంటుంది. అంతా దేవుడి దయ మను అని చెప్తుంది చిత్ర. దూరం నుంచి ఫోటో లు చూస్తున్న వినోద్‌ చిత్ర దగ్గరకు వస్తుంటే.. మనోహరి పక్కకు వెళ్లిపోతుంది. తర్వాత పిల్లలు రెడీ అయి స్కూలుకు వెళ్తుంటే.. అమర్‌ వస్తాడు. అంజు డాడ్‌ మీకొకటి చూపిస్తాను అని బ్యాగ్‌ లోంచి బుక్‌ తీసి ఇస్తుంది. బుక్‌ చూసిన అమర్‌ వావ్‌ అంజు చాలా నీట్‌గా క్లీన్‌గా వేశారు. ఎవరు వేశారు అని అమర్‌ అడగ్గానే.. ఆకాస్‌ ఎమోషనల్‌గా అమ్మ వేసింది డాడ్‌ అని చెప్తాడు. ఆ మాటకు అమర్‌ షాక్ అవుతాడు. ఇవి వేసింది ఆరునే అంటాడు. అమర్‌ మాటలకు అందరూ షాక్‌ అవుతారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Big Stories

Advertisement
×