Samantha:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత (Samantha )గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. స్టార్ హీరోలు అందరితో నటించి, తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. ఒకవైపు విడాకులు మరొకవైపు మయోసైటిస్ వ్యాధి.. అన్నింటి నుండి బయటపడడానికి ఏడాది పాటు పూర్తిగా విరామం ప్రకటించిన సమంత.. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru)దర్శకత్వంలో వచ్చిన ‘సిటాడెల్ – హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్ తో గట్టి కంబ్యాక్ ఇచ్చి, యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది.
శుభం సినిమాతో నిర్మాతగా తొలి సక్సెస్..
ఇప్పుడు ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్ స్థాపించి, నిర్మాతగా కూడా అడుగులు వేసింది సమంత. అందులో భాగంగానే తొలి ప్రయత్నంగా ‘శుభం’ అనే ఒక హార్రర్ కామెడీ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం ఈ శుభం మూవీ ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. మరి వైపు మళ్ళీ రాజ్ దర్శకత్వంలో ‘రక్త బ్రహ్మాండ్’ వెబ్ సిరీస్ తో పాటు ఇటు టాలీవుడ్ లో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఎఫైర్ రూమర్స్ తో మునిగి తేలుతున్న సమంత..
ఇకపోతే ఇదంతా బాగానే ఉన్న ఇప్పుడు సమంత ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంటూ ఉండడం గమనార్హం. బాలీవుడ్లో తనకు కెరియర్ ను ప్రసాదించిన డైరెక్టర్ రాజ్ నిడిమోరు తో ఈమె చట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. పైగా అతడికి పెళ్లయింది. పిల్లలు కూడా ఉన్నారు. అయినా సరే ఎక్కడికి వెళ్లినా రాజ్ నిడిమోరు తోనే కనిపిస్తోంది.పైగా పికిల్ బాల్ టోర్నమెంట్ తో పాటు ఇటీవల తిరుపతి, శ్రీకాళహస్తిలను సందర్శించినప్పుడు కూడా ఈమె వెంటే రాజ్ నిడిమోరు ఉన్నారు. దీనికి తోడు తన ‘శుభం’ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఎక్కువగా కనిపించారు. ఇక దీంతో ఇద్దరు ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వైరల్ అయ్యాయి.
సమంతకు కౌంటర్ గా రాజ్ భార్య వరుస పోస్టులు..
ఇలాంటి సమయంలో రాజ్ నిడిమోరు భార్య శ్యామలి (Shyamali) కూడా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందిస్తూ.. “నా తరఫున మాట్లాడే వారికి, నా గురించి మాట్లాడే వారికి, నేను చెప్పింది వినే వారికి, నా గురించి రాసేవారికి, అసలు నాకోసం ఆలోచించుకునే వారందరికీ కూడా ప్రేమ, దేవుడి ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాను” అంటూ ఒక పోస్ట్ లో పెట్టింది. ఆ పోస్టు వైరల్ అయ్యేలోపే మరో పోస్ట్ పంచుకుంది శ్యామలి. “మంచి కర్మను సృష్టించండి.. ప్రజలకు సహాయం చేయండి.. నీ చుట్టూ ఉన్న అందరితో కూడా న్యాయంగా వ్యవహరించండి” అంటూ తెలిపింది. ఈ పోస్ట్ చూసి.. సమంత, రాజ్ నిడిమోరు రిలేషన్ గురించి శ్యామలి ఇలాంటి పోస్ట్లు పెడుతోందని అందరూ ఒక నిర్ధారణ కూడా వచ్చారు.
శ్యామలికి కౌంటర్ ఇచ్చిన సమంత..
అయితే శ్యామలి ఇలా వరుసగా పోస్ట్లు పెడుతున్న నేపథ్యంలో ఎన్ని రోజులు సైలెంట్ అయినా సమంత..తాజాగా ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో..” ఎప్పుడూ నిశ్శబ్దంగా ఒకరిని మెచ్చుకోవద్దు. నేను ఎవరినైనా ఆరాధిస్తే ఖచ్చితంగా నేను వారికి చెబుతాను. మనం మనుషులం చాలా పెళుసుగా ఉంటాము. ప్రజలు ఇక్కడ ఉన్నప్పుడే వారితో కలవడం నేర్చుకోవాలి. ఎప్పుడు నిశ్శబ్దంగా ఒకరిని ఆరాధించకండి” అంటూ రాసుకు వచ్చింది. ఇకపోతే తాను రాజ్ నిడుమోరుని ఆరాధిస్తున్నట్లు చెప్పకనే చెప్పింది అని, ఇది శ్యామలికి కౌంటర్ గానే సమంత తన స్టోరీస్ లో షేర్ చేసింది అని కొంతమంది నెటిజన్ లు కామెంట్లు చేస్తున్నారు.. ఇక మనసులో ఎవరినైనా ఆరాధిస్తే బహిరంగంగా చెప్పండి అంటూ సమంత చెప్పడం దీనికి ఇదే కారణమని కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
ALSO READ:Aeroplane Accident: టాలీవుడ్ టూ బాలీవుడ్.. విమాన ప్రమాదం నుండి తప్పించుకున్న సెలబ్రిటీస్ వీళ్లే!