BigTV English

Tollywood Heros : డైరెక్టర్స్ కాబోయి హీరోలు అయిన స్టార్ హీరోలు..!

Tollywood Heros : డైరెక్టర్స్ కాబోయి హీరోలు అయిన స్టార్ హీరోలు..!

Tollywood Heros : సినీ ఇండస్ట్రీలోని హీరోలుగా కొనసాగుతున్న చాలామంది సినిమాల్లోకి రాకముందు ఇలా అయ్యే వాళ్ళమంటూ ఇటీవల పలు ఇంటర్వ్యూలలో బయటపడుతూ వస్తున్నారు. ఇప్పటికే చాలామంది స్టార్స్ డాక్టర్ కావలసిన వాళ్ళం పొరపాటున యాక్టర్ అయ్యామంటూ ఎన్నో సందర్భాల్లో వివరించారు. చదువులో సత్తాని చాటిన వాళ్ళు సినిమాలపై, నటనపై ఆసక్తితో ఇటుగా అడుగులు వేశారు. అలాంటి వారిలో కేవలం హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు, కమెడియన్లు కూడా ఉన్నారు.. ఇప్పుడు మనం డైరెక్టర్ కాబోయే యాక్టర్స్ అయిన వాళ్లు ఎవరో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


డైరెక్టర్స్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి, అనుకోకుండా యాక్టర్స్ అయ్యారు చాలా మంది. మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంతకీ మెగాఫోన్ పట్టబోయి సిల్వర్ స్క్రీన్ పై హల్చల్ చేస్తున్న వారెవరో ఓ లుక్కేద్దాం..

రవితేజ.. 


టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తున్న రవితేజ డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. ఒకవైపు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూనే సినిమాల్లో చిన్న చిన్న రోల్ లో నటిస్తూ, శ్రీనువైట్ల డైరెక్షన్ లో వచ్చిన నీకోసం మూవీతో హీరో అయ్యాడు.. ప్రస్తుతం టాలీవుడ్ లో మాస్ అండ్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ గా మారి రవితేజ సినిమాలను చేస్తున్నాడు. ఈమధ్య ఆయన ఖాతాలో సరైన హిట్ సినిమాలు లేవు. కానీ చేతిలో మాత్రం రెండు మూడు సినిమాలు తప్పకుండా ఉంటాయి..

నాని.. 

టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలకు పని చేశారు. ఆ తర్వాత హీరోగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఇప్పటివరకు వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు..

సందీప్ కిషన్.. 

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం.. ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి. ప్రస్తుతం హీరోగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.

నిఖిల్.. 

హీరో నిఖిల్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి ఆ తర్వాత హీరోగా ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా..నవాబ్స్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి, శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ లో ఒకడిగా అలరించి, యువత చిత్రంతో హీరోగా మారిపోయాడు..

ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది హీరోలు ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ ని ప్రారంభించి ఇప్పుడు స్టార్ హీరోలుగా వరుస సినిమాలు చేస్తున్నారు.. కేవలం హీరోలు మాత్రమే కాదు అటు హీరోయిన్లు కూడా ఉన్నారు..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×