E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode May 6th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ను కారుతో గుద్ది చంపేసిన మనోహరి

Nindu Noorella Saavasam Serial Today Episode May 6th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ను కారుతో గుద్ది చంపేసిన మనోహరి
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  మనోహరి తన కారుతో అమర్‌ను లోయలో పడేటట్టు గుద్దేస్తుంది. దీంతో అమర్‌ లోయలోకి పడిపోతాడు. అక్కడే ఉన్న పోలీసులు అమర్‌ను గమనించి వెళ్లి చూస్తారు. అప్పటికే అమర్‌ స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. వెంటనే అమర్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్తుంటారు. ఎస్సై రాథోడ్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్తాడు. రాథోడ్‌ ఏడుస్తూ.. ఈ విషయం మిస్సమ్మకు ఎలా చెప్పాల్రా దేవుడా అనుకుంటూ ఇంట్లోకి వెళ్తాడు.   మరోవైపు అంబులెన్స్‌ వెనకాలే కారులో వెళ్తున్న మనోహరి అమర్‌ బతికి ఉంటే నేను అయిపోతాను. ఎట్టి పరిస్థితుల్లోనూ అమర్‌ కళ్లు తెరవకూడాదు. ఆరు చనిపోయిన రోజే అమర్‌ చనిపోవాలి. అనుకుంటూ వెళ్తుంది.

ఇంట్లో దేవుడి గదిలో పూజ చేస్తుంటుంది మిస్సమ్మ. లోపలికి వెళ్లిన రాథోడ్‌ వెళ్లి మిస్సమ్మను చూసి మిస్సమ్మకు ఈ విషయం ఎలా చెప్పాలి. దేవుడా మా సారుకు ఏమీ కాకూడదు.. అని మనసులో బాధపడుతుంటే.. మిస్సమ్మ, రాథోడ్ ను చూసి ఏమైంది రాథోడ్‌.. ఎందుకు అంతలా కంగారుపడుతున్నావు అని అడగ్గానే.. రాథోడ్‌ కంగారు పడుతూనే నీకెలా చెప్పాలో తెలియడం లేదు మిస్సమ్మ అంటాడు. దీంతో మిస్సమ్మ ఏం జరిగింది.. అని అడగ్గానే.. రాథోడ్ ప్రమాదం జరిగింది మిస్సమ్మ అని చెప్పగానే.. మిస్సమ్మ ప్రమాదమా..? చెప్పు రాథోడ్.. ఏం జరిగింది. పిల్లలకు ఏమైనా అయిందా..? చెప్పు రాథోడ్‌ అనగానే.. రాథోడ్‌ పిల్లలకు కాదు మిస్సమ్మ.. అనగానే.. మిస్సమ్మ మరి.. ఆయనకా..? అనగానే.. రాథోడ్‌ అవునన్నట్టు తలూపుతాడు. ఆయనకు ప్రమాదం జరిగిందా..? అని అడగ్గానే.. రాథోడ్‌ అవును మిస్సమ్మ కొడైకెనాల్‌ లో సార్‌కు యాక్సిడెంట్‌ అయిందట.. అని చెప్పగానే..

Advertisement

అప్పుడే గాలి వచ్చి పూజా మందిరంలో దీపాలు ఆరిపోతాయి. హాల్లో ఉన్న ఆరు ఫోటో ముందు పూలు కింద పడిపోతాయి. దీంతో మిస్సమ్మ భయంగా ఏడుస్తూ.. ఏమంటున్నావు రాథోడ్‌.. ఆయనకు యాక్సిడెంట్‌ అవ్వడం ఏంటి..? ఆయనకు ఏమీ కాలేదు కదా..? చెప్పు రాథోడ్‌ ఆయన క్షేమంగానే ఉన్నారు..? కదా ఆయనకు ఏమీ కాలేదు కదా.. అసలు ఆయనకు యాక్సిడెంట్‌ అయిందని ఎవరు చెప్పారు అని అడగ్గానే.. రాథోడ్‌ ఏడుస్తూ.. ఇప్పుడే కొడైకెనాల్‌ ఎస్సై ఫోన్‌ చేశారు మిస్సమ్మ. ఏదో వెహికిల్‌ తగిలి సార్‌ లోయలో పడిపోయారట. సార్‌ కు దెబ్బలు తగిలాయంట.. హాస్పిటల్‌కు తీసుకెళ్తున్నామని చెప్పారు అంటూ ఏడుస్తుంటే.. అంతా వింటున్న యాదమ్మ, అమరేంద్ర సారుకు యాక్సిడెంట్‌ అయిందంటే.. ఇది కచ్చితంగా ఆ మనోహరి పనే అయ్యుంటుంది. అయినా సారుకు ఎందుకు యాక్సిడెంట్‌ చేసి ఉంటుంది అని మనసులో అనుకుంటుంది.

ఇంతలో మిస్సమ్మ పూజరూంలోకి వెల్లి దేవుడి ముందు కూర్చుని దేవుడా ఎందుకు ఇలా చేశావు.. అక్క చనిపోయిన రోజని ఆయన కొడైకెనాల్‌ వెళ్లారు. అక్క చనిపోయిన చోటే ఆయనకు ప్రమాదం జరగడం ఏంటి.. ఏం జరుగుతుంది దేవుడా..? అంటూ ఏడుస్తుంటే.. రాథోడ్‌ ఏడవకండి మిస్సమ్మ  సారు ప్రాణాలకు ప్రమాదం లేదని ఎస్సై గారు చెప్పారు. చిన్న చిన్న గాయాలే అయ్యాయంట. మనం వెంటనే కొడైకెనాల్‌ వెళ్లాలి పద మిస్సమ్మ అనగానే.. మిస్సమ్మ ఏడుస్తూ.. ఎందుకు ఇలా జరిగింది రాథోడ్‌.. ఎవరు చేశారది. నాకు చాలా భయంగా ఉంది. ఆయనకు ఏమైనా అయితే అంటూ ఏడుస్తుంటే.. రాథోడ్‌ బాధగా ఏం కాదు మిస్సమ్మ.. దేవుడున్నాడు. సార్‌ క్షేమంగా బయటపడతారు. ప్లైట్‌ టికెట్‌ బుక్‌ చేశాను. మనం వెంటనే బయలుదేరుదాం పద మిస్సమ్మ. యాదమ్మ పిల్లలు స్కూల్‌ నుంచి వస్తే జాగ్రత్తగా చూసుకో.. వాళ్లు ఈ విషయాలేవి చెప్పకు.. మేము సార్‌ను తీసుకుని వస్తామని రాథోడ్‌, మిస్సమ్మ కొడైకెనాల్‌ బయలుదేరుతారు.  ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Monday Movies in Tv : సోమవారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ చెయ్యొద్దు..

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Big Stories

Advertisement
×