E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today November 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ కోసం హోమం చేస్తున్న పిల్లలు  

Nindu Noorella Saavasam Serial Today November 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ కోసం హోమం చేస్తున్న పిల్లలు  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

డాక్టర్‌ వచ్చి మిస్సమ్మకు సీరియస్‌గా ఉందని.. కడుపులో బిడ్డ కూడా కదలడం లేదని చెప్పడంతో అమర్‌, రామ్మూర్తి, పిల్లలు బాధపడుతుంటారు. మనోహరి మాత్రం హ్యాపీగా ఫీలవుతూ.. అమర్‌ పక్కనే కూర్చుని ఓదార్చినట్టు నటిస్తుంది. అంతా మాయా దర్పణంలో చూస్తుంటారు యముడు, విచిత్రగుప్తుడు. గుప్త కోపంగా వీక్షించితిరా ప్రభు ఆ మనోహరి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేయుచున్నదో అని చెప్పగానే.. అన్నియు వీక్షించుచున్నాను గుప్త అని యముడు చెప్పగానే.. కృష్ణ పరమాత్మ కూడా శిశు పాలుడిని వంద తప్పుల వరకే క్షమించాడు ప్రభు తమరు ఎందుకని ఈ బాలికను శిక్షించకుండా ఉపేక్షిస్తున్నారు అని గుప్త అడగ్గానే. దేనికైనా సమయం రావాలి కదా గుప్త అంటాడు యముడు.

Advertisement

ఆ దుర్మార్గురాలు మన లోకమునకు వచ్చిన పిదప నరకలోమున ఉన్న శిక్షలన్నీ విధించెదను అంటాడు గుప్త, యముడు కూడా విచిత్రగుప్త మాకును ఆ బాలికపై ఆగ్రహముగా ఉన్నది. కానీ ఆన ఆయువు తీరేవరకు మనమేమీ చేయలేము.. అంటాడు. పాపి చిరాయువు అన్నట్టు ఆ రాక్షాసి అంత త్వరగా మరణించి మన లోకమునకు రాదనుకుంటాను ప్రభు.. అంటాడు గుప్త. దీంతో యముడు మృత్యు దేవత ఆదేశించినప్పుడే మన కర్తవ్యం పాటించాలి గుప్త. అంత వరకు మనం ఎవ్వరి చావును కోరరాదు.. భూలోకమున జరుగు అరుందతి బాలిక కంట పడకుండా చూసుకొనుము.. అని చెప్పగానే.. గుప్త అటులనే ప్రభ అంటాడు.

అప్పుడే అక్కడికి వచ్చి వింటున్న ఆరును చూసి గుప్త, యముడు షాక్‌ అవుతారు. ఆరు వెంటనే మాయా దర్పణం దగ్గరకు వచ్చి చూసి నా చెల్లెకి ఏమైంది..? ఎందుకు హాస్పిటల్‌ లో ఉంది..? అని అడగ్గానే.. నీ సోదరిపై విష వాయువు ప్రయోగం జరిగింది బాలిక అని యముడు చెప్పగానే ఆరు కంగారుగా ఎవరు చేశారు అని అడుగుతాడు. ఇంకెవరు ఆ మనోహరి అని గుప్త చెప్తాడు. ఇప్పుడు నా చెల్లి పరిస్థితి ఏంటి..? అని ఆరు అడగ్గానే.. చూస్తున్నావు కదా చావు బతుకుల మధ్య ఊగిసలాడుతుంది అని చెప్పగానే.. ఆరు ఏడుస్తూ.. నా చెల్లి చావడానికి వీల్లేదు తన కడుపులో ఒక బిడ్డ ఉంది. వాళ్లను కాపాడండి యమధర్మరాజా..? మీ కాళ్లు పట్టుకుంటా..? నన్ను కనికరించండి.. ఫ్లీజ్‌ అని వేడుకోగానే..

Advertisement

అది నా చేతుల్లో లేదు బాలిక అని యముడు చెప్తాడు. దీంతో ఆరు ఏడుస్తూ మీరైనా చెప్పండి గుప్త గారు. ఎలాగైనా నా చెల్లి బతకాలి. తను నిండు నూరేళ్లు పిల్లలతో కలిసి ఉండాలి అని అడగ్గానే.. గుప్త బాధగా క్షమించుము బాలిక. మేము నిమిత్త మాత్రులం మాత్రమే ఈ విషయంలో మేము నీకు సహాయం చేయలేని నిస్సహాయులం అని గుప్త చెప్పగానే.. ఆరు ఏడుస్తూ అయ్యో భాగీ ఆ దేవుడికే నీ మీద దయ లేనప్పుడు ఇక నిన్ను ఎవరు కాపాడతారు..? నీ కడుపులో ఉన్న బిడ్డను ఎవరు రక్షిస్తారు అంటూ బాధపడుతుంది.

మరోవైపు సరస్వతి ఆశ్రమంలో పిల్లలుకు టిఫిన్స్‌ పెడుతుంది. ఇంతలో రాజు కంగారుగా పరుగెత్తుకుంటూ వస్తాడు. భాగీ మేడంకు సీరియస్‌గా ఉందట. ఐసీయూలో ఉన్నారట.. పరిస్తితి చాలా సీరియస్‌గా ఉందట అని చెప్పగానే.. సర్వస్వతి ఆందోళన పడుతుంది. ఏం జరిగింది అని అడుగుతుంది. దీంతో జరిగింది మొత్తం చెప్తాడు రాజు. దీంతో సరస్వతి కోపంగా ఈ దాడి కచ్చితంగా  ఆ మనోహరే పనే అయుంటుంది. ఆ రాక్షసి ఇంకెంత మందిని పొట్టన పెట్టుకుంటుంది. దేవుడు దాన్ని  ఎప్పుడు తీసుకెళ్తాడో రాజు గారు అంటుంది.

దీంతో  రాజు ఆ దుర్మార్గురాలు గురించి మీరు భాగీ గారికి చెప్పారు కదా మేడం. ఇంకా ఆవిడ ఆ ఇంట్లో ఎందుకు ఉంది అని అడగ్గానే.. నేను మనోహరి గురించి భాగీ గారికి చెప్పాను. కానీ మనోహరి గురించి ఏదో కారణం చేత భాగీ గారు అమరేంద్ర గారికి చెప్పలేదు అనగానే.. పదండి మేడం మనం వెళ్లి అమరేంద్ర గారికి అన్ని విషయాలు చెబుదాం అనగానే వద్దు రాజు గారు అమరేంద్ర గారికి  ఏ విషయం చెప్పొద్దని భాగీ గారు నా దగ్గర మాట తీసుకున్నారు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది భాగీ గారి గురించి పదండి రాజు గారు హాస్పిటల్‌కు వెళ్దాం అంటూ వెళ్లబోతుంటే.. పిల్లలు కూడా తాము వస్తామంటారు. సరేనని పిల్లలను తీసుకుని హాస్పిటల్‌కు వెళ్తుంది సరస్వతి.

తర్వాత హాస్పిటల్‌లో ఉన్న అంజు, అమ్ము, ఆనంద్‌, ఆకాష్‌లను తీసుకుని గుడి దగ్గరకు వెళ్లుంది సరస్వతి. అక్కడ మిస్సమ్మకు బాగవ్వాలని హోమం చేయిస్తుంది. పిల్లలు అందరూ నిష్టగా హోమం చేస్తుంటారు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Illu Illaalu Pillalu Narmada : నర్మద పెళ్లి చేసుకోబోతుందా..? అబ్బాయి ఎవరంటే..?

Sunday Movies in Tv : మూవీ లవర్స్ కు పండగే.. ఆ నాలుగు డోంట్ మిస్…

Nindu Noorella Saavasam Serial Today Episode September 6th ‘నిండు నూరేళ్ల సావాసం’  సీరియల్‌: బుజ్జమ్మ కోసం బయలుదేరిన ప్రచండ

బిగ్‌బాస్ 10పై పెరిగిన హైప్.. లిస్ట్‌లో ఉన్నది వీళ్లేనా ?

క్యూట్ లుక్స్‌తో దేవజాని మోదక్ రచ్చ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ పిక్!

వామ్మో.. యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.2,300 కోట్లా.. ఎవరా యూట్యూబర్?

కౌశల్ ను తొక్కేశారా? ఇన్నాళ్లకు నోరు విప్పిన బిగ్ బాస్ విన్నర్!

బిగ్ బాస్ 10కి ఎంపికైన తొలి కామనర్.. కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×