E-Paper
Advertisement

OTT Movie : చీకటి పడితే భర్త టార్చర్… ఆ భార్య చేసిన పనికి ఫ్యూజులు అవుట్ మావా

OTT Movie : చీకటి పడితే భర్త టార్చర్… ఆ భార్య చేసిన పనికి ఫ్యూజులు అవుట్ మావా
Advertisement

OTT Movie : ఓటిటిలోకి వస్తున్న సినిమాలలో మొదటగా థ్రిల్లర్ స్టోరీలను చుడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రేక్షకులు. ఏ భాషలో వచ్చినా ఈ జానర్ ని మాత్రం వదిలి పెట్టడం లేదు. ఆడియన్స్ కి కావాల్సిన థ్రిల్ ని ఇవ్వడానికి మేకర్స్ కూడా రకరకాల ప్రయాత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా వచ్చిన సినిమా ‘రిప్పన్ స్వామి’. ఈ కన్నడ థ్రిల్లర్ ఒక గ్రామంలో జరిగే ఒక పెద్ద మనిషి మర్డర్ చుట్టూ తిరుగుతుంది. కిల్లర్ ఎవరనేది సస్పెన్స్ లో నడుస్తుంది. ఇక క్లైమాక్స్ లో నే ఆడియన్స్ రిలాక్స్ అవుతారు. రీసెంట్ గానే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా, థ్రిల్లర్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘రిప్పన్ స్వామి’ (Rippan swamy) ఒక కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. కిషోర్ ముదుబిదిరె దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్ రాఘవేంద్ర (రిప్పన్ స్వామిగా), అశ్విని చంద్రశేఖర్, యమునా శ్రీనిధి, ప్రకాష్ తుమినాడ్ వంటి నటులు నటించారు. ఈ సినిమా 2025 ఆగస్టు 29న థియేటర్లలో రిలీజ్ అయింది. అక్టోబర్ 13 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

కర్ణాటకలో

సినిమా మొదలవగానే రిప్పన్ స్వామి తన నోట్లో తుపాకీ బారెల్ పెట్టి ట్రిగ్గర్ నొక్కి ఆత్మహత్య చేసుకున్నట్టు చూపిస్తారు. ఇక నుంచి ఫ్లాష్‌బ్యాక్‌లో అతని నిజస్వరూపం బయటపడుతుంది. మలెనాడులోని స్నాన కోపగ్రామంలో 200 ఎకరాల ఎస్టేట్, పందుల ఫార్మ్ ఉన్న ధనవంతుడు స్వామి. కచ్చా మాంసం తినే సైకోపత్. ఎవర్నైనా క్షణంలో చంపేసే క్రూరుడు. 20 ఏళ్ల క్రితం తన సొంత అన్నయ్యను ఆస్తి కోసం చంపి, ఆ హత్యకు సాక్షిని కూడా అడవిలో పూడ్చి రహస్యంగా దాచేశాడు. ఆ క్రూరత్వం వల్లే రిప్పర్అనే పేరు మారి “రిప్పన్ స్వామి” గా మారింది. ఇతని ఆరాచకాలకు హద్దులు లేకుండా పోతుంది.

Advertisement

Read Also : పెళ్ళైన మహిళతో కుర్రాడు… ఐఎండీబీలో 8.8 రేటింగ్… మలయాళ డార్క్ కామెడీ డ్రామా

మంగళూరు మెడికల్ స్టూడెంట్ మంగళని ఫోర్స్‌గా కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుని, ఆమె ఆశయాలను చంపి ఇంట్లో ఒక ఖైదీలా ఉంచుతాడు. ఆ గ్రామంలో అతను ఐదుగురు లాయల్ గ్యాంగ్‌తో కలిసి రాజ్యమే ఏలుతాడు. అదే సమయంలో సంతోష్ అనే యువకుడు మంగళతో ప్రేమలో పడి రహస్యంగా కలుస్తాడు. ఈ విషయం తెలిసిన స్వామి సంతోష్‌ని, మంగళని దారుణంగా కొట్టిస్తాడు. అంతటితో ఆగకుండా మంగళపై వేరే వాళ్ళతో దారుణాలు చేయించి వీడియో కూడా తీస్తాడు. చివరికి మంగళే తుపాకీ తీసుకుని స్వామి నోట్లో పెట్టి ట్రిగ్గర్ నొక్కుతుంది. ఇది ఓపెనింగ్ సీన్‌కి కనెక్ట్ అవుతుంది. మంగళ, సంతోష్ ఇద్దరూ జైలుకి వెళ్తారు. ఈ కథ ఇలా ముగిసిపోతుంది.

 

 

 

Related News

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

నెత్తురు ఏరులై పారించే ఊరమాస్ రివేంజ్ డ్రామా… లోకేష్ కనగరాజ్ 100 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×