E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today November 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందకు చంభా కొత్త ప్లాన్‌  

Nindu Noorella Saavasam Serial Today November 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందకు చంభా కొత్త ప్లాన్‌  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

కింద ఉన్న మిస్సమ్మ, ఆరును తలుచుకోగానే.. యమలోకంలో ఉన్న ఆరుకు వినిపిస్తుంది. మిస్సమ్మ అక్కా నువ్వు ఎప్పుడు వస్తావు అక్కా అంటూ అడుగుతుంది. అది విన్న ఆరు ఎమోషనల్‌ అవుతూ ఇదిగో ఇప్పుడే వచ్చేస్తాను చెల్లి అంటూ ఉంగరం పట్టుకుని మంత్రిస్తుంది. అయినా ఆరు అక్కడే ఉంటుంది. దీంతో ఆరు కోసంగా యముడిని తిడుతుంది. ఇంతలో అక్కడకు నారదుడు వస్తుంటాడు. ఈ నారదుల వారిని అడ్డుపెట్టుకుని భూలోకానిక జంప్‌ అయి భాగీ డెలివరీ అయ్యే వరకు తన పక్కనే ఉండాలి అని ప్లాన్‌ చేస్తుంది. నారదుడు ఆరు దగ్గరకు వచ్చి ఏమిటి ఇంద్రజ నువ్వు ఇంకను ఈ నరకలోకమునే ఉంటివి.. మీ ఇంద్రపురికి వెళ్లలేదా..? నువ్వు మీ జనకుడిపై ఎప్పుడు అలిగినా కొద్ది రోజులే కదా..? ఇప్పుడు ఎందుకు ఇన్ని రోజులు అలక పాన్పు ఎక్కితివి అని అడుగుతాడు.

దీంతో ఆరు మీరు అసలు నారదుల వారేనా..? అని అడగ్గానే నారదుడు అదేం ప్రశ్న తల్లి అంటూ అడుగుతాడు. దీంతో ఆరు.. నాకు తెలియక అడుగుతాను మీరు నిజంగా నారదుల వారేనా..? లేక నా లాగా మారు వేషంలో వచ్చారా..? అని అడగ్గానే.. నారదుడు అనుమానంగా నువ్వు మారు వేషంలో ఉంటివా..? అని అడగ్గానే.. అవును నేను ఇంద్రజను కాదు ఇంద్రుని కూతురిని కూడా కాదు.. నా పేరు అరుంధతిని నేను మామూలు మనిషిని అని ఆరు చెప్పగానే.. అసత్యం అడకుము తల్లి.. మాతో పరాచకాలు వలదు అని నారదుడు చెప్పగానే.. మీతో అబద్దం చెప్పింది. పరాచికాలు ఆడింది ఆ రాజుల వారు చిత్రగుప్తుల వారు.. నేను నిజంగా మనిషినే చచ్చి పైకి వచ్చాను అనగానే.. అంటే నీవు చెప్పినది సత్యమేనా..? యమధర్మరాజుల వారు మాతో అసత్యం ఆడెనా..? అని నారదుడు అడగ్గానే..

Advertisement

ఎస్‌ అని ఆరు చెప్పగానే.. నారదుడు కోపంగా సమవర్తి మమ్ములనే వంచన చేసితిరా..? అనగానే.. పక్కా అంటుంది ఆరు. మరి ఇందులో ఎటువంటి సందేహం లేదు కదా..? అని నారదుడు అడగ్గానే.. కచ్చితంగా ఎటువంటి సందేహం లేదు.. అనగానే.. మరి నువ్వు కూడా ఇంద్రజవు అని చెప్పితివి కదా అని నారదుడు డౌటు క్రియేట్‌ చేయగానే.. ఆ రాజు గారు గుప్త గారు చెప్పమన్నారు.. నేను మీతో అబద్దం చెప్పాను సారీ ఇప్పుడు నిజం చెప్తున్నాను.. నేను దేవ కన్యను కాదు మానవ కాంతను అని ఆరు చెప్పగానే.. దీంతో నారదుడు షాక్‌ అవుతాడు. ఇది అసంభవమే బాలిక ఒక మానవ కాంత ఇన్ని దినములు నరకమున ఉండుట అసాధ్యం అని నారదుడు చెప్పగానే.. ఎందుకు అసాధ్యం అని ఆరు అడుగుతుంది. దీంతో నీవు మరణించి వచ్చిన మానవ కాంత అయినచో నీకు ఇచ్చట శిక్ష అయిన  వేయవలెను.. లేనిచో మరు జన్మకు అయిన పంపవలెను ఇవి రెండు చేయలేదు అనిన ఏదో తిరకాసు ఉన్నది బాలిక అది ఏమిటో పోయి యమధర్మరాజునే అడిగెదను అంటూ నారదుడు వెళ్లిపోగానే.. ఏదో తిరకాసు జరిగిందా..? అని ఆరు ఆలోచిస్తుంది.

మరోవైపు రణవీర్‌ దగ్గరకు వెళ్లిన మనోహరి, చంభాలను రణవీర్ తిడుతుంటాడు. ఇరవై నాలుగు గంటలు మీరు ఆ ఇంట్లోనే ఉంటారు. మీ వల్ల కానిది నా వల్ల ఏమౌతుంది. మైసూర్‌ బజ్జీలో మైసూర్‌ ఎంతో మీరు వేసే ప్లాన్స్‌ అంతే.. నన్ను ఇన్వాల్వ్‌ చేయకండి అంటాడు రణవీర్‌. దీంతో మనోహరి కోపంగా మేము ఆ ఇంట్లో ఏమీ చేయకుండా  ఖాళీగా అయితే  ఏం లేము.. కలకత్తాలో మీ ఇంటిని ఆస్థులను వెయిటింగ్‌ లో పెట్టి నువ్వు ఇక్కడ ఎంటీగా ఉన్నావన్న విషయం మర్చిపోకు అంటూ మనోహరి చెప్పగానే. నా పాప నాకు దక్కితేనే కదా నా ఆస్తి నాకు దక్కేది. పాప లేకుండా నేనేం చేసేది. పాపను చూపిస్తానని ఆశ పెట్టి అబద్దం చెప్పి నీ ప్లాన్‌ కోసం నన్ను వాడుకున్నావు.. అంటూ రణవీర్‌ కోప్పడతాడు.

Advertisement

దీంతో మనోహరి అవును భాగీ దాని బిడ్డ చస్తే నా పని నెరవేరుతుందని నీతో అలా చెప్పాను. కానీ భాగీ బతికిపోయింది. దాని బిడ్డ ఓ పది రోజుల్లో బయటికి రాబోతుంది అని మనోహరి చెప్పగానే. నీ అవసరానికి ఏమైనా చెప్తావు.. ఇక నుంచి నీ చావు నువ్వు చావు అంటాడు దీంతో మనోహరి కోపంగా ఆ బిడ్డ బయటకు వస్తే.. నాకే కాదు మనందరికి ప్రమాదమే అంటుంది. చంభా కూడా అవునని చెప్తుంది. దీంతో రణవీర్‌ మరి ఏం చేయాలి అని అడుగుతాడు. దీంతో చంభా ఈ సారి కాలాను పంపిద్దాం.. ఆ భాగీని కాటేసి చంపేస్తుంది. అందుకు నీ సాయం కావాలి అని చంభా రణవీర్‌ ఏం చేయాలో చెప్తుంది. రణవీర్‌ అలాగే చేస్తాను అంటాడు. చంభా చెప్పినట్టు రణవీర్‌ చేయగానే.. కాలా అమర్‌ ఇంట్లోకి వెళ్లి హాల్లో కూర్చున్న మిస్సమ్మన కాటేయబోతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×