E-Paper
Advertisement

Rain Alert: డబుల్ అల్పపీడనాలు.. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు..

Rain Alert: డబుల్ అల్పపీడనాలు.. ఈ ప్రాంతాల్లో  పిడుగులతో కూడిన భారీ వర్షాలు..
Advertisement

Rain Alert: ఏపీపై అల్పపీడనం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇవాళ్టి నుండి నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అదే సమయంలో ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించిందని అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థ పశ్చిమ వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతుండటంతో వర్షాలు మరింత విస్తరించనున్నాయని అంచనా వేశారు.

పిడుగులతో కూడిన భారీ వర్షాలు..
కడప, సత్యసాయి జిల్లా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలొచ్చాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Advertisement

Also Read: గనిలో ప్రమాదం.. 32 మంది కార్మికులను బలిగొన్న వంతెన

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..
నవంబర్ 21నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కొత్త అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 24 నుంచి 27 వరకు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మత్స్యకారులు సముద్ర వేటను తాత్కాలికంగా ఆపాలి. రైతులు పంటలు, ధాన్యాన్ని రక్షించే చర్యలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Advertisement

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×