Nindu Noorella Saavasam Serial Today Episode : అందరూ అమర్ రూం ముందు నిలబడి ఉంటారు. ఇంతలో రాథోడ్ వస్తాడు. ఆఫీసుకు టైం అవుతుంది మా సార్ ఇంకా రాలేదేంటి అని అడుగుతాడు. మీ సారు నీతో పాటు బయటకు రాలేదా? అని శివరాం అడగ్గానే లేదని రాథోడ్ చెప్తాడు. ఇంతలో మనోహరి డోర్ కొడుతుంది. అమర్ అంటూ గట్టిగా పిలుస్తుంది. టవల్ మీద వేసుకుని అమర్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. ఏంటని అడుగుతాడు. ఇంతలో మిస్సమ్మ కూడా వస్తుంది. వాళ్లిద్దరిని చూసిన మనోహరి ఏంటిది అమర్ అసలు లోపల ఏం జరుగుతుంది అని అడుగుతుంది.
ఏముంది. మిస్సమ్మ సాంబ్రాణి వేసుకుంటుంది. నేను స్నానానికి వెళ్లాను అని అమర్ చెప్పగానే మనోహరి అది కాదు అమర్ అంటూ ఏదో చెప్పబోతుంటే.. ఏంటమ్మా ఇది కాదు అది కాదు అంటున్నావు భార్యాభర్తలు అన్నాక ఒకరికొకరు సాయం చేసుకుంటారు. దానికే ఇంత హడావిడి చేస్తే ఎలా..? అంటాడు శివరాం. దీంతో మనోహరి అంటే పొగను చూసి అంతా భయపడుతుంటే.. అనగానే మనోహరి, మిస్సమ్మ చెప్పింది కదా..? సాంబ్రాణి వేసుకుంటున్నాను అని అయినా అందరం వచ్చి తప్పు చేశాము. అంటూ అందరినీ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంటే మిస్సమ్మ, మనోహరికి సైగల ద్వారా సాంబ్రాణి ఆయనే వేశారని చెప్తుంది.
గార్డెన్ లో ఆరు అటూ ఇటూ తిరుగుతూ అమర్ సాంబ్రాణి వేసిన విషయం గుర్తు చేసుకుంటుంది. గుప్త నవ్వుతూ బాలిక లోపల వీక్షించినది నువ్వు జీర్ణించుకోలేక ఇలా అటూ ఇటూ తిరుగుతుంటివా..? అని అడుగుతాడు. ఆరు కోపంగా చూస్తుంది. అసలు నీ భాద ఏంటి బాలిక.. ఆ బాలికకు నువ్వే దగ్గరుండి నీ పతి దేవుణితో పెళ్లి చేసితివి. అసలు ఆ బాలిక నీ పతి దేవుణికి భార్యగా ఉండకూడదన్నా..? అని గుప్త అడగ్గానే ఉండాలి.. అంటుంది. ఉండ కూడదు అంటూ ఆరు కన్ఫీజ్ అవుతుంది. తర్వాత ఏదేదో తలుచుకుని బాధపడుతుంటే ఎందుకు నీకు ఆంత బాధ నీ పతి దేవుణితో ఉన్నది నీ తోబుట్టువే కదా..? అంటూ గుప్త నోరు జారగానే ఆరు షాకింగ్ గా ఏంటి గుప్త గారు ఏమన్నారు అని అడుగుతుంది. అంటే నీ పతి దేవుణికి భార్య అయినప్పుడు నీ తోబుట్టువు లాంటిదే కదా? అంటూ మాట మారుస్తాడు గుప్త.
పిల్లలు మీటింగ్ పెట్టుకుని తాము అనుకున్నదే జరిగిందని హ్యాపీగా ఫీలవుతారు. ఇంతలో అంజు అందరినీ తిడుతూ అసలు నాన్న మిస్సమ్మకు సాంబ్రాణి వేయడం ఏంటి..? అంటూ తిడుతుంది. మిస్సమ్మ మన అమ్మ స్థానాన్ని లాక్కోవాలని చూస్తుంది అంటుంది. మరోవైపు శివరాం, నిర్మల కూడా హ్యాపీగా ఫీలవుతారు. అమర్, ఆరును దాటి ముందుకు పోలేడేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు కొత్త జీవితం వైపు వెళ్తున్నాడు అనుకుంటారు. మరోవైపు అంజు, అమ్ము వాళ్లను తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
మరోవైపు మనోహరి కోపంగా అటూ ఇటూ తిరుగుతూ.. మిస్సమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. ఇంతలో అక్కడికి మిస్సమ్మ వస్తుంది. మనోహరిని చూసి వెటకారంగా నవ్వుతూ మనూ నాకు సిగ్గేస్తుంది అని అంటుంది. దీంతో నాకు కోపం వస్తుంది అంటుంది మనోహరి. అయినా పొగ మా రూంలో వస్తే.. మంట ఇక్కడ వస్తుందేంటి..? అని మిస్సమ్మ అనగానే.. నువ్వేదే మాయ చేసి అమర్ తో సాంబ్రాణి వేయించుకున్నావని నాకు తెలియదు అనుకున్నావా..?
అని మనోహరి అనగానే అయ్యో పిచ్చి మను మాయ చేసేది మంట పెట్టేది నువ్వు.. నాకు ప్రేమించడం తప్పా ఇంకేమైనా వస్తుందా..? చెప్పు అని మిస్సమ్మ అనగానే ప్రేమ గీమ అన్నావనుకో చంపేస్తాను. నీ సంతోషం, ఈ ఆనందం అంతా మూడు రోజుల ముచ్చటే.. ఎలా వచ్చావో అలా వెళ్లేలా నేను చేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తుంది మనోహరి. దీంతో నువ్వేం చేయలేవు.. నేను ఇక్కడే ఉంటా.. వెళ్లాల్సింది.. వెళ్లబోయేది నువ్వే అంటూ మిస్సమ్మ వార్నింగ్ ఇస్తుంది.
కరుణ, మిస్సమ్మకు ఫోన్ చేసి ఏవండోయ్ భాగీ గారు మీ ఆయన సాంబ్రాణి ఎట్లా పెట్టిండ్రండి అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ షాకింగ్ గా ఆ విషయం నీకెలా తెలుసు అని అడుగుతుంది. ఎట్ల తెలుసు అంటే చెప్పింది మనమే కాబట్టి అంటుంది కరుణ. తను అమర్‌తో ఫోన్ లో మాట్లాడింది చెప్తుంది కరుణ. మిస్సమ్మ కూడా అమర్ ఎలా సాంబ్రాణి వేసింది చెప్తుంది. దీంతో కరుణ మీ ఆయన వచ్చి భాగీ ఐలవ్ యూ నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్తే.. అని అడగ్గానే ఆ మాట ఆయన ఆంటే నిజంగా పోతానే అంటుంది మిస్సమ్మ.
ప్రిన్సిపాల్ అమ్మును పిలుస్తుంది. ఎక్స్‌కర్షన్ కోసం ప్లాన్ చేస్తున్నామని అందుకే పిలిచానని చెప్తుంది. దీంతో అమ్ము చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో ప్రిన్సిపాల్ ఓన్లీ సిక్త్ క్లాస్, మరియు ఎయిత్ క్లాస్ వాళ్లనే తీసుకెళ్లాలనుకుంటున్నాం అని చెప్తుంది. దీంతో అమ్ము ప్రిన్సిపాల్ తో వెటకారంగా మాట్లాడుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్