BigTV English

Bigg Boss 8 Telugu : బుగ్గ గిల్లి నామినేషన్స్.. పృథ్విలో ఇంతమార్పేంటో..?

Bigg Boss 8 Telugu : బుగ్గ గిల్లి నామినేషన్స్.. పృథ్విలో ఇంతమార్పేంటో..?

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇక ఎండింగ్ కు చేరుకుంది. మరో రెండు వారాల్లో ఎపిసోడ్ మొత్తం అయిపోతుంది. 12 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం 13 వ వారం నామినేషన్స్ నిన్నటి ఎపిసోడ్ లో జరిగాయి. ఈ వారం నామినేషన్స్ ఓవైపు హీటెక్కిస్తూనే ఒక్కో సందర్భంలో చాలా క్యూట్‌గా అనిపించాయి. ముఖ్యంగా గౌతమ్-పృథ్వీ మధ్య జరిగిన ఓ సన్నివేశం మాత్రం ఈ వారం నామినేషన్స్‌లోనే హైలెట్ అనిపించింది. ఎందుకంటే ఎప్పుడూ ముఖం మీద ముఖం పెట్టి వాడు వీడు.. పోరా ఏరా అనే పృథ్వీ.. మాటకి మాట సమాధానం ఇచ్చే గౌతమ్ ఇద్దరూ ఒకరినొకరు బుగ్గ గిల్లి మరీ నామినేషన్ చేసుకున్నారు. ఈ ఎపిసోడ్ కు ఇదే హైలెట్ అనే చెప్పాలి. మరి నిన్నటి ఎపిసోడ్ లోని హైలెట్స్ ఏంటో ఓ లుక్ వేద్దాం పదండీ..


బిగ్ బాస్ లో 13 వారం నామినేషన్స్ లో పెద్దగా ఎవ్వరు రచ్చ చెయ్యలేదు. కేవలం సాఫిగా సాగిపోయాయి. గత వారాల్లో ఎన్నడూ లేని విధంగా ఈ వారం నామినేషన్స్ పూర్తి అయ్యాయి. ఈ నామినేషన్స్ ప్రక్రియలో పృథ్వీ-గౌతమ్ మధ్య ఆసక్తికర సీన్ ఒకటి జరిగింది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఒక్కో సభ్యుడు ఇద్దరు హౌస్‌మేట్స్‌ని నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా పృథ్వీ ముందుగా అవినాష్‌ని నామినేట్ చేశాడు. ఇదే అందరిని ఆశ్చర్యాన్నికి గురి చేసింది. గత నామినేషన్స్ లో విష్ణుప్రియ, రోహిణి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు మెగా చీఫ్ అయి ఉండి అవినాష్ పట్టించుకోకుండా నాకెందుకులే అని వెళ్లపోవడం నాకు కరెక్ట్ అనిపించలేదంటూ పృథ్వీ చెప్పాడు.. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్ఛాను కానీ ఆటలో పెర్ఫామేన్స్ లేకుండానే రెండు సార్లు చీఫ్ ఎలా అయ్యాను అని అవినాష్ అడగ్గానే ఇద్దరి మధ్య కాసేపు గొడవ జరిగింది.

ఇక తన రెండో నామినేషన్ గౌతమ్‌కి వేశాడు పృథ్వీ. గత వారం డిస్కషన్‌లో ఏం పీకలేవు నువ్వు అని నన్ను అనడం నాకు నచ్చలేదు.. అలానే వైల్డ్ కార్డ్ ఎంట్రీలను మేము తరిమేయాలనుకున్నామని మీరు చెప్పడం కూడా నాకు నచ్చలేదంటూ పృథ్వీ అన్నాడు. అలానే ఫేస్ టూ ఫేస్ మాట్లాడకుండా కెమెరాల వైపు చూసి మాట్లాడుతున్నారు అది కూడా నచ్చలేదు అంటూ పృథ్వీ పాయింట్లు చెప్పాడు.. దానికి గౌతమ్ సైలెంట్ గానే ఉండటం విచిత్రం అని అనిపించింది. గత నామినేషన్స్ లో ఎన్నడూ లేని విధంగా వీరిద్దరి మధ్య జరిగిందనే చెప్పాలి. ఇక ఇంత స్లోగా రాలేదు అంటూ బుగ్గ గిల్లి పో అన్నాడు. వెంటనే పృథ్వీ కూడా గౌతమ్ బుగ్గ గిల్లి నవ్వుకున్నాడు. ఇక ఈ సీన్ చూసి విష్ణుప్రియ ఎందకో తెగ మురిసిపోతూ సిగ్గుపడింది. మొత్తానికి హీటింగ్ డిస్కషన్‌లో పృథ్వీ-గౌతమ్ మధ్య ఇలాంటి సీన్ పడుతుందని ఆడియన్స్ అస్సలు ఊహించి ఉండరు.. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్స్ ఉన్నాయని టాక్..


Tags

Related News

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Big Stories

×