BigTV English

Indian Railways: మీ కోచ్ లో టాయిలెట్ కంపు కొడుతుందా? క్షణాల్లో క్లీన్ చేయించుకోండి ఇలా!

Indian Railways: మీ కోచ్ లో టాయిలెట్ కంపు కొడుతుందా? క్షణాల్లో క్లీన్ చేయించుకోండి ఇలా!

Railway Coach Mitra: రైలు ప్రయాణం చేసే ప్యాసెంజర్లకు తరచుగా ఎదురయ్యే సమస్య.. టాయిలెట్స్ పరిశుభ్రంగా లేకపోవడం. ఒక్కోసారి వాష్ రూమ్ కు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉంటుంది. ఇకపై మీరు ప్రయాణించే కోచ్ లో టాయిలెట్ నీట్ గా లేకపోతే, వెంటనే ఫిర్యాదు చేయాలని చెప్తున్నది భారతీయ రైల్వే. కంప్లైంట్ అందుకున్న కాసేపట్లోనే టాయిలెట్స్ క్లీన్ చేయనున్నట్లు వెల్లడించింది. టాయిలెట్స్ మాత్రమేకే కాదు, కోచ్ శుభ్రంగా లేకపోయినా, దిండ్లు, బెడ్ షీట్లు నీటుగా లేకపోయినా వెంటనే శుభ్రం చేస్తారని వెల్లడించింది. ఇంతకీ ప్రయాణీకులు కంప్లైంట్ ఎలా చేయాలంటే?


‘కోచ్ మిత్ర’తో పేరుతు ప్రయాణీకులకు మెరుగైన సేవలు

ప్రయాణీకులకు రైలు ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు భారతీయ రైల్వే సంస్థ ‘కోచ్ మిత్ర’ అనే సేవను అందుబాటులోకి తెచ్చింది. కోచ్ లు శుభ్రంగా లేకపోయినా, బెడ్ షీట్లు మురికిగా ఉన్నా, టాయిలెట్స్ క్లీన్ గా లేకపోయినా, కోచ్ లో లైట్లు రాకపోయినా, ఏసీ పని చేయకపోయినా ‘కోచ్ మిత్ర’ ద్వారా ఫిర్యాదు చెయ్యొచ్చు. కేవలం మెసేజ్ పంపించడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోచ్చు. ఈ సేవ 2 వేల 167 రైళ్లలో అందుబాటులో ఉంది.


SMS ద్వారా కంప్లైట్ ఎలా చేయాలంటే?  

ఒక్కో సమస్యలకు ఒక్కో కోడ్ నెంబర్ ఇచ్చారు. మీరు ప్రయాణిస్తున్న కోచ్ లో ఏ సమస్య ఉంటే, దానికి సంబంధించిన కోడ్ వేయాలి. కోచ్ మిత్రలో అందుబాటులో ఉన్న సర్వీసులు, వాటి కోడ్ నెంబర్ల గురించి ముందుగా తెలుసుకుందాం.  టాయిలెట్ క్లీనింగ్ కోసం T, కోచ్ క్లీనింగ్ కోసం C, వాటర్ కోసం W, పెస్ట్ కంట్రోల్ కోసం P, బెడ్‌ రోల్ కోసం B, రైలు లైటింగ్, ఏసీ కోసం E, చిన్న చిన్న రిపేర్ల కోసం R అనే కోడ్ నెంబర్లు ఇచ్చారు. ముందుగా ‘క్లీన్’ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి PNR నంబర్ ను టైప్ చేసి స్పేస్ ఇచ్చి సర్వీస్ కోడ్ టైప్ చేసి 58888 లేదంటే 9200003232కు ఎస్సెమ్మెస్ చేయాలి.

ఏ సర్వీస్ కోసం ఎలా మెసేజ్ చెయ్యాలంటే?

⦿ టాయిలెట్ క్లీనింగ్ కోసం CLEAN<space>PNR<space>T

⦿ కోచ్ క్లీనింగ్ కోసం, CLEAN<space>PNR<space>C

⦿ బెడ్ షీట్ల కోసం కోసం, CLEAN<space>PNR<space>B

⦿ వాటర్ ప్రాబ్లం గురించి, CLEAN<space>PNR<space>W

⦿ పెస్ట్ కంట్రోల్ కోసం, CLEAN<space>PNR<space>P

⦿ లైటింగ్, AC కోసం, CLEAN<space>PNR<space>E

⦿ చిన్న రిపేర్ల కోసం, CLEAN<space>PNR<space>R..

అని టైప్ చేసి 58888 లేదంటే 9200003232కు ఎస్సెమ్మెస్ చేయాలి.  ప్రయాణీకులు కోచ్ మిత్ర సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. వెబ్ సైట్ లో  మీ PNR నంబర్, మొబైల్ నంబర్‌ ను ఎంటర్ చేయాలి. డ్రాప్-డౌన్ లిస్టులో ఆయా సమస్యను ఎంచుకుని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత PNR నెంబర్ ను ఎంటర్ చేయాలి. మీ సమస్యకు సంబంధించి క్లుప్తంగా చెప్పి ఎంటర్ చేయాలి. కాసేపట్లోనే సంబంధిత సర్వీస్ సిబ్బంది వచ్చి సమస్యను పరిష్కరిస్తారు.

Read Also: ఇక ట్రైన్ టికెట్ పై పేరు, డేట్ మార్చుకోవచ్చు, కొత్త రూల్ తెచ్చిన ఇండియన్ రైల్వే

Related News

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Special Trains: సికింద్రాబాద్ నుంచి ఆ నగరానికి స్పెషల్ ట్రైన్, ప్రయాణీకులకు గుడ్ న్యూస్!

Kakori Train Action: కాకోరి రైల్వే యాక్షన్.. బ్రిటిషోళ్లను వణికించిన దోపిడీకి 100 ఏళ్లు!

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Big Stories

×