E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today November 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను తాను ఎలా చంపేది రణవీర్ కు చెప్పిన మనోహరి  

Nindu Noorella Saavasam Serial Today November 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను తాను ఎలా చంపేది రణవీర్ కు చెప్పిన మనోహరి  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:    

అమర్‌, మిస్సమ్మ, రాథోడ్‌ అందరూ కారు దగ్గర వెయిట్‌ చేస్తుంటారు. యాదమ్మ, మనోహరి ఎక్కడ కనిపించడం లేదు అని అమర్‌ అడగ్గానే.. వాళ్లు లగేజీ తీసుకురావడానికి వెళ్లారు డాడీ అని అంజు చెప్తుంది. దీంతో అందరూ వెయిట్‌ చేస్తుంటారు. మరోవైపు హాల్లో ఉన్న మనోహరి చంభాను పిలిచి నువ్వు ఇక్కడే ఎవ్వరూ రాకుండా చూస్తూ ఉండు.. నేను వెళ్లి రణవీర్‌ తో మాట్లాడతాను. జాగ్రత్త చంభా ఎవరైనా వస్తున్నారంటే వెంటనే నాకు ఇన్‌ఫామ్‌ చేయ్‌ అని చెప్పి మనోహరి తన రూంలోకి వెళ్తుంది. రణవీర్‌.. నేనే.. రణవీర్‌ ఎక్కడ దాక్కున్నావు.. బయటకు రా అని పిలుస్తుంది మనోహరి.

రణవీర్‌ బాత్రూంలోంచి మెల్లగా బయటకు వస్తాడు. నేను బయలుదేరుతున్నాను ఈ రెండు రోజులు ఇంట్లో జాగ్రత్త అని చెప్తుంది మనోహరి. అది సరే మనోహరి మరి ఆ బాంబు ఏమైందో తెలియదు కదా మనకు అని రణవీర్‌ అడగ్గానే.. అది ఆ మంగళ  దాన్ని కారులో పెట్టిందట.. తీయడం కుదరడం లేదు..  అమర్‌ ఏమో అక్కడే ఉన్నాడు. దాంతో ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను. సరే వదిలేసెయ్‌ దాన్ని ఇంకోలా ఉపయోగించుకుందాం.. నేన ఊరు వెళ్లి ఆ భాగీ పని ఫినిష్‌ చేస్తాను అని మనోహరి చెప్పగానే.. అదేంటి మీతో పాటు అమర్‌ వస్తున్నాడు కదా భాగీని ఎలా చంపేస్తావు అని రణవీర్‌ అడగ్గానే.. అమర్‌ మాతో రాకుండా చేస్తాను అని చెప్తుంది మనోహరి. దీంతో ఆశ్చర్యంగా రణవీర్‌ అమర్‌ను ఎలా ఆపుతావు అని అడగ్గానే.. మిస్సయిన బాంబు ద్వారా అని చెప్తూ.. తన ఫోన్‌ ఆన్‌ చేసి ఆర్మీ మేజర్‌కు కాల్‌ చేస్తుంది. మేజర్‌ కాల్‌ లిఫ్ట్‌ చేసి హలో ఎవరు మీరు అని అడగ్గానే..

Advertisement

మనోహరి నేను ఎవరైతే మీకెందుకు కానీ మీకో ముఖ్యమైన విషయం చెబుదామని ఫోన్‌ చేశాను అని మనోహరి చెప్పగానే.. ఏ విషయం అని మేజర్‌ అడుగుతాడు. మీరు  ఒక బాంబు కోసం వెతుకుతున్నారు కదా..? అని మనోహరి అడగ్గానే.. అది మీకెలా తెలుసు..? మీడియా నుంచి కాల్‌ చేస్తున్నారా..? అంటూ మేజర్‌ ఎదురు ప్రశ్నించగానే.. లేదు ఆ బాంబు సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లో ఒక షాపులో ఉంది అని మనోహరి చెప్పగానే.. ఆ విషయం మీకెలా తెలుసు అని మేజర్‌ అడగ్గానే.. వెంటనే వెళ్లి ఆ బాంబును డిప్యూజ్‌ చేయండి లేకపోతే పేలిపోతుంది అని చెప్పి వెంటనే కాల్‌ కట్‌ చేసి ఫోన్‌ స్విచ్చాప్‌ చేస్తుంది మనోహరి. అంతా వింటున్న రణవీర్‌ కంగారు పడుతూ ఇంతకీ ఎవరికి కాల్‌ చేశావు అని అడుగుతాడు. దీంతో మనోహరి అమరేంద్ర పై అధికారికి అని చెప్తుంది. ఏ ఎందుకు.? అని రణవీర్‌ అడగ్గానే..

ఈ బాంబు కేసు అమర్‌ చూస్తున్నాడు.. కాబట్టి.. ఇప్పుడు పై అధికారి ఊరికి రావాల్సిన అమర్‌ను అక్కడికి ఆ బాంబు కోసం పంపిస్తాడు కాబట్టి.. అంటూ మనోహరి చెప్పగానే.. రణవీర్‌ ఆశ్చర్యపోతాడు. నీ బ్రెయిన్‌ సూపర్‌ మనోహరి.. ఇంత టెన్షన్‌లో కూడా నీ బ్రెయిన్‌ పాదరసంలా పని చేస్తుంది. ఇంతకీ ఆ భాగీని ఎలా ఫినిష్‌ చేయబోతున్నావు.. అని రణవీర్‌ అడగ్గానే.. సింపుల్‌ హైవే నుంచి మట్టి రోడ్డు తీసకుని అడవిలోకి తీసుకెళ్లి అందరినీ కన్పీజ్‌ చేసి భాగీని ఒంటరిని చేసి పని పూర్తి చేస్తాను అని మనోహరి చెప్పగానే.. ఓ సూపర్ బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ అని రణవీర్‌ చెప్పగానే.. ఇంట్లో నువ్వు జాగ్రత్తగా ఉండు రణవీర్‌ పని అవ్వగానే నేను చంభా వచ్చేస్తాము అని చెప్పి మనోహరి వెళ్లిపోతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×