E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today october 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి ప్లాన్‌ సక్సెస్‌ – మిస్సమ్మను చంపబోయిన అమ్ము

Nindu Noorella Saavasam Serial Today october 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి ప్లాన్‌ సక్సెస్‌ – మిస్సమ్మను చంపబోయిన అమ్ము
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మను చంపేందుకు ప్లాన్‌ చేసిన మనోహరి రూంలోకి వెళ్లి మిస్సమ్మ చీరను తీసుకుని తన రూంలోకి వెళ్తుంది. అప్పుడే అక్కడికి వెళ్లిన చంభా ఏం చేస్తున్నావని అడుగుతుంది. దీంతో తన చేతిలో తెల్లగుడ్డను చంభా చేతికి ఇస్తుంది. అగ్గిపెట్టె తీసుకుని ఆ గుడ్డను కాల్చేస్తుంది. అది చూసిన చంభా షాక్‌ అవుతుంది. ఇప్పుడు అర్థం అయిందా..? ఇది ఏమిటో అంటుంది మనోహరి.. అగ్నిని ఆకర్షించే వాయువా..? అని అడుగుతుంది చంభా.. అవును ఈ స్ప్రే కొట్టిన శారినీ సాయంత్రం భాగీ కట్టుకుంటే ఎలా ఉంటుంది అంటుంది మనోహరి. దీంతో చంభా చుట్టూ దీపాలు ఉంటాయి. పైగా టపాసులు పేలుస్తారు. ఒక చిన్న నిప్పురవ్వకే ఈ గుడ్డ పేలిక భగ్గుమంది అలాంటిది అని చంభా అనగానే..

నువ్వు ఊహించింది నిజమే సాయంత్రం భాగీ సజీవ దహనం అవుతుంది. దీపాలు వెలిగిస్తేనో.. టపాసులు పేలిస్తేనో అగ్నిప్రమాదంలో అది మరణించింది అని అందరూ అనుకుంటారు. ఎవ్వరికీ తెలియని ఒక నాచురల్‌ డెత్‌ అని చెప్తుంది మనోహరి. ఇద్దరి మాటలు ఆరు వింటుంది. భయపడుతూ నా చెల్లికి ఇంత ప్రమాదం జరగుతుందని తెలిసే రాజు గారు నన్ను కిందకు పంపిచారా.? ఇప్పుడు నేనేం చేయాలి. నా మాట ఎవ్వరికీ వినబడదు.. నేను ఎవ్వరికీ కనిపించను.. భాగీని నేను ఎలా కాపాడాలి..? అయ్యో.. అంటూ బాధపడుతుంది. ఇంతలో మనోహరి తీసుకొచ్చిన మిస్సమ్మ శారీకి స్ప్రే కొడుతుంది.

Advertisement

అంతా చూస్తున్న చంభా అమ్మో అమ్మో నీ కుట్రలు కుతంత్రాల ముందు నా మాయలు మంత్రాలన్నీ దిగదుడుపే మనోహరి అంటుంది .ఈ చీరను ఎవ్వరూ చూడకుండా మిస్సమ్మ రూంలో పెట్టాలి. ఆ పని నువ్వు చేస్తావా..? లేక నన్నే చేయమంటావా..? అని మనోహరి అడగుతుంది. ఆరు కోపంగా మీరిద్దరూ కలిసి నా చెల్లిని చంపాలని చూస్తున్నారా..? మీ కుట్రలు సాగనివ్వను.. ఎలాగైనా నా చెల్లిని నేనే కాపాడుకుంటాను. కానీ ఎలా కాపాడాలి.. అయో ఎలా దేవుడా..? అంటూ ఆలోచిస్తుంది. మనోహరి శారీ చుట్టేసి చంభాకు ఇస్తుంది.

తర్వాత రాత్రి అవుతుంది. పిల్లలు అందరూ కలిసి ఇంటి ముందు దీపాలు వెలిగిస్తుంటారు.  టపాసులు కాలుస్తుంటారు. ఆరు బయటకు వచ్చి చూసి షాక్ అవుతుంది. పిల్లల దగ్గరకు వెళ్లి అమ్ము, అంజు దీపాలు పెట్టకండి.. మిస్సమ్మ బయటకు వస్తే ప్రమాదం.. పిల్లలు వద్దు పిల్లలు.. నా మాట వినండి.. ఎలా దీపాలు ఆర్పాలి అని ఆలోచిస్తుంది. అయితే ఆరు మాటలు వినబడని పిల్లలు టపాసులు కాలుస్తుంటారు. ఇంతలో అమర్‌, మిస్సమ్మను తీసుకుని బయటకు వస్తాడు. పిల్లలు వెలిగించిన దీపాలు చూసి మిస్సమ్మ హ్యాపీగా ఫీలవుతుంది. అమర్‌ చూస్తూ వస్తుంటాడు. వారికి ఎదురుగా వెళ్లిన ఆరు గట్టిగా భాగీ కాస్త దీపాలకు దూరంగా ఉండు.. లేదంటే నీ శారీకి మంటలు అంటుకుంటాయి. అని చెప్తుంది.

Advertisement

కానీ ఆరు మాటలు ఎవ్వరికీ వినిపించవు.. ఇంతలో అమర్‌, మిస్సమ్మ మెట్లు దిగి కిందకు వెళ్లిపోతారు. పిల్లల దగ్గరకు వెళ్లి టపాసులు కాలుస్తుంటారు. ఇంతలో మనోహరి, చంభా వస్తారు. మిస్సమ్మ దగ్గర దీపాలు ఆరిపోయాయిన అమ్మును పిలుస్తారు. అమ్ము వచ్చి ఏంటి ఆంటీ పిలిచారు అని అడుగుతుంది. అదిగో అక్కడ కింద దీపాలు ఆరిపోయాయి ఒకసారి వెళ్లి వెలిగించు అని చెప్తుంది. అమ్ము అలాగే ఆంటీ అని వెళ్లబోతుంటే చంభా కూడా అమ్ము వెంటనే నడుస్తూ వెళ్తుంది. ఇద్దరూ మిస్సమ్మ దగ్గరకు వెళ్లగానే.. చంభా కాలితో అమ్ము కింద పడేలా చేస్తుంది. దీంతో అమ్ము చేతిలో ఉన్న దీపాలు నూనె కింద పడిపోయి మిస్సమ్మ శారీకి మంటలు అంటుకుంటాయి. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×