BigTV English

Nindu Noorella Saavasam Serial Today September 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీకి నిజం చెప్పిన సరస్వతి వార్డెన్‌

Nindu Noorella Saavasam Serial Today September 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: భాగీకి నిజం చెప్పిన సరస్వతి వార్డెన్‌

Nindu Noorella Saavasam Serial Today Episode: అంజుకు బుల్లెట్‌ దిగిన విషయం ఐసీయూలో ఉందన్న వార్త టీవీలో చూస్తుంది సరస్వతి వార్డెన్‌. వెంటనే కంగారుపడుతుంది. ఇంతలో రాజు రావడంతో రాజుగారు ఈ న్యూస్‌ చూశారా..? అని అడుగుతుంది. చూశాను మేడం చాలా బాధ అనిపించింది అని చెప్తాడు రాజు. దేవుడికి దయ లేదు రాజు గారు. ఎంత మంది అనాథల జీవితాల్లో వెలుగులు నింపిన ఆ కుటుంబానికి ఇంత కష్టమా..? ఆ చిన్న పాపను తలుచుకుంటుంటేనే గుండె తరుక్కపోతుంది అంటూ ఎమోషనల్‌ అవుతుంది వార్డెన్‌. అవును మేడం కొంత మంది మనుషులు స్వార్థంగా ఆలోచిస్తూ.. మారణహోమం సృష్టిస్తూ ఉంటారు. అక్కడ అంత మంది ఉన్నా ఒక్క అమరేంద్ర కుటుంబం మీదే దాడి జరిగింది అంటే కచ్చితంగా ఆ దాడి వెనక మనోహరి హస్తం ఉండే ఉంటుంది అంటాడు రాజు.


దీంతో ఆ మారణహోమం మనోహరి పనే అయ్యుంటుందా..? అని వార్డెన్‌ అడగ్గానే.. ఆ రాక్షసి ఎంతకు తెగిస్తుదో నాకంటే మీకే బాగా తెలుసు. ఆ దుర్మార్గురాలి  ఆగడాలకు అంతే లేకుండా పోతుంది అని రాజు గారు చెప్తుంటే.. వెంటనే వార్డెన్‌, మనోహరికి ఫోన్‌ చేస్తుంది. ఓసేయ్‌ రాక్షసి నువ్వు మనిషివేనా..? ఆడదానివేనా..? మారవా నువ్వు అంటూ తిడుతుంది. దీంతో మను ఎవరు నువ్వు.. అంటూ అడుగుతుంది. నేను ఎవరో గుర్తు పట్టలేదా..? నా వాయిస్ గుర్తు రావడం లేదా..? అంటుంది వార్డెన్‌.. ఓ వార్డెనా.. అంటుంది మను. అవునే నేను వార్డెన్‌ నే మాట్లాడుతున్నాను నీలాంటి నీచురాలిని దుర్మార్గురాలిని హంతకురాలిని పెంచిన వార్డెన్‌ ను మాట్లాడుతున్నాను.. అంటూ సరస్వతి తిడుతుంటే.. ఈ రోజు నేను ఇలా తయారు అవ్వడానికి కారణం నువ్వే కదా వార్డెన్‌ అంటుంది మనోహరి.

ఈ చేతులతో నిన్నే కాదే.. అరుంధతిని కూడా పెంచాను. తను దేవత అయితే నువ్వు దెయ్యానివి అయ్యావు.. స్నేహితురాలు అని కూడా చూడకుండా అరుందతిని పొట్టన పెట్టుకున్నావు.. ఆ కుటుంబాన్ని అష్టకష్టాల పాలు చేస్తున్నావు.. నీ దుర్మార్గానికి అంతే లేదా.? ఇప్పుడు ఆ చిన్న పాప చావుబతుకుల్లో ఉండటానికి కారణం నువ్వే అని నాకు అనిపిస్తుంది అంటూ వార్డెన్ చెప్తుంటే.. అనిపించడం ఏంటి వార్డెన్‌ అదే నిజం అని చెప్తుంది మను. నాకు తెలుసే నువ్వే చేసి ఉంటావని.. ఇంకెంత మందిని బలి తీసుకుంటావు నీ రక్త దాహం ఇంకెప్పటికీ తీరుతుంది అంటూ తిడుతుంది. దీంతో అవును నేనే అరుంధతిని చంపాను.. ఇప్పుడు ఆంజు చనిపోతే దానికి కూడా నేనే కారణం.. ఇవే కాకుండా నేను ఇంకా ఎన్నో చేశాను అయితే ఏంటి..? నన్నేం చేయగలవు నువ్వు.. అంటూ తిడుతుంది మను.


తులసి వనంలో కలుపుమొక్కలా పీకి పడేస్తా ఆ కుటుంబానికి నీ పీడ లేకుండా చేస్తాను అంటుంది వార్డెన్‌. నీకు అంత సీను లేదు వార్డెన్‌.. నీ క్యారెక్టర్ కు తగ్గ డైలాగ్‌ చెప్పు అంటూ మను అనగానే.. నేను నిన్ను స్వతహాగా ఏం చేయలేకపోవచ్చు కానీ నీ గురించి అమరేంద్ర, భాగీ గారికి చెప్తాను… ఈ రోజే నీ గురించి వాళ్లకు చెప్తాను అంటూ వార్డెన్‌ కాల్ కట్‌ చేస్తుంది. వెంటనే రాజు గారు నేను హాస్పిటల్‌కు వెళ్తున్నాను ఆశ్రమం జాగ్రత్త అని చెప్పి  సరస్వతి వార్డెన్‌ కంగారుగా హాస్పిటల్‌కు వెళ్తుంది. లోపలికి వెళ్తుంటే.. మనోహరి ఎదురుపడుతుంది. మనోహరిని చూసిన సరస్వతి వార్డెన్‌ భయపడకుండా సూటిగా మను కళ్లల్లోకి చూస్తుంది. మను మాత్రం వార్డెన్‌ ను చూసి షాక్‌ అవుతుంది. ధైర్యంగా తన ముందుకు వచ్చి నిలబడిందని కోపంతో ఊగిపోతుంది. ఫోన్‌ బెదిరిస్తుంటే.. ఏమో అనుకున్నాను.. ధైర్యం చేసి డైరెక్టుగా వచ్చేశావన్న మాట అంటుంది మను. అవును ధైర్యం చేసి వచ్చాను.. ఇక నీకు బెదురుకునే ప్రసక్తే లేదు.. ఇక ఎన్నాళ్లని నీకు భయపడాలి మనోహరి అందుకే ధైర్యంగా వచ్చేశాను. నువ్వు చేసిన పాపాలన్నీ ఈరోజు బయట పెట్టడానికే వచ్చాను. బయట పెట్టే తీరుతాను అంటూ వార్డెన్‌ బెదిరించగానే..

మనోహరి కూల్‌గా నవ్వుతూ.. అవునా ఎవరితో నా విషయాలు బయట పెడతావు.. అసలు నువ్వు చెప్తే వినడానికి అమరేంద్ర ఇక్కడ ఉండాలి కదా..? అమర్‌ ఎప్పుడో బయటకు వెళ్లిపోయాడు.. ఇకెంవరికి చెప్తావు.. అయినా నువ్వు చెప్తుంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా..? మేడం అంటూ మను బెదిరిస్తుంది. మనోహరి బెదిరింపులకు అదరని వార్డెన్‌ అమరేంద్ర ఉన్నా లేకపోయినా.. భాగీ ఉంది కదా ఆవిడకు చెప్తాను అంటూ వార్డెన్‌ వెళ్లబోతుంటే.. ఆగు ఇప్పుడు నువ్వు అక్కడకు వెళ్లి దానికి నిజాలు చెప్పావంటే నా సంగతి తెలుసు కదా.? తర్వాత నిన్న చంపేస్తాను.. నీ చావు నా చేతుల్లోనే రాసి పెట్టి ఉన్నట్టుంది జాగ్రత్త అంటూ హెచ్చరిస్తుంది మను. దీంతో వార్డెన్‌ కోపంగా మను హెచ్చరికలను కూడా లెక్క చేయదు. నీ ఇష్టం వచ్చింది చేసుకో.. నువ్వేం చేసినా ఇవాళ నేను వాళ్లకు నిజం చెప్పి తీరుతాను.. అంటూ  సరస్వతి వార్డెన్‌ మిస్సమ్మ దగ్గరకు వెళ్తుంది.

మను కోపంగా చూస్తుంది. సరస్వతి మేడంను చూసిన మిస్సమ్మ ఆశ్చర్యపోతుంది. చాలా సార్లు మీరు నన్ను కలవాలని ట్రై చేశారట కానీ మనం కలవడం  కుదరలేదు.. అయినా మీరేదో విషయం నాతో చెప్పాలని అన్నారట.. ఇంతకీ ఏంటా విషయం.. చెప్పండి మేడం.. అంటూ మిస్సమ్మ అడగ్గానే.. సరస్వతి వార్డెన్‌ ఎమోషనల్‌గా మాట్లాడుతుంది మీకొక భయంకరమైన నిజం తెలియాలి అంటుంది. ఏంటా నిజం అని మిస్సమ్మ అడగ్గానే.. మీరు ఒక భయంకరమైన విషపు సర్పాన్ని పక్కన పెట్టుకున్నారు.. ఆ సర్పం మిమ్మల్ని ఎప్పుడు కాటు వేద్దామా అని చూస్తుంది. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా దాని నుంచి తప్పించుకోలేకపోతున్నారు.. మీ ఇంట్లో జరిగే ప్రతి విషాదానికి ఆ విష సర్పమే కారణం.. అంటూ వార్డెన్‌ చెప్తుంటే..

మిస్సమ్మ షాకింగ్‌గా చూస్తుంది. దూరం నుంచి అంతా గమనిస్తున్న మను టెన్షన్‌ పడుతుంది. ఇంతలో ఇంతకీ ఎవరు వాళ్లు క్లారిటీగా చెప్పండి అంటూ మిస్సమ్మ అడగ్గానే.. సరస్వతి వార్డెన్‌ అది ఎవరంటే.. అంటూ చెప్పబోతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Intinti Ramayanam Today Episode: భర్తకు దగ్గరైన రాజేంద్ర ప్రసాద్.. అవని పై అక్షయ్ సీరియస్.. పల్లవి ప్లానేంటి..?

GudiGantalu Today episode: మీనాను పొగిడేసిన ప్రభావతి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సుశీల..రోహిణికి ప్రభావతి షాక్..

Brahmamudi Serial Today September 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేవతిని చూసిన రుద్రాణి – నిజం చెప్పొద్దన్న రాహుల్‌

Telugu Serials : సీరియల్స్ లో నటించి పెళ్లి చేసుకున్న రియల్ జంటలు వీళ్లే..!

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వాటిని మిస్ అవ్వొద్దు..

Big Stories

×