E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode September 16th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మలో ప్రవేశించనున్న ఆరు ఆత్మ..?  

Nindu Noorella Saavasam Serial Today Episode September 16th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మలో ప్రవేశించనున్న ఆరు ఆత్మ..?  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: గుప్త, నారదుడు ఇద్దరూ భూమ్మీదకు వస్తారు. అమర్ ఇంట్లోని గార్డెన్‌లో నిలబడి ఆరు గురించి మట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మహర్షి వేళ కానీ వేళ మీరు ఇక్కడకు వచ్చారు అని గుప్త అడిగితే.. పౌర్ణమి ఘడియల్లో ఆ అరుంధతి బాలిక ఆత్మ భూలోకం వస్తుంది. ఇంట్లో ఎవరినో ఆవహించబోతుంది. అది చూద్దామనే వచ్చాను గుప్త.. అని నారదుడు చెబితే.. ఎప్పుడో పౌర్ణమికి ఆ బాలికి ఇక్కడకు వస్తుందని మీరు ఇప్పుడు వచ్చారా..? అంటూ గుప్త అడగ్గానే..

ఎప్పుడో ఏంటి గుప్త మర్చిపోయావా ఏంటి..? పౌర్ణమి గడియలు మరికొద్ది క్షణాల్లో మొదలు కాబోతున్నాయి అరుంధతి ఆత్మ రాబోతుంది అంటూ చెప్తుండగానే.. పెద్దగా గాలులు వీస్తాయి.. అప్పుడే అరుంధతి ఆత్మ భూమి మీదకు వస్తుంది. గుప్త అటు చూడుమ ఆ బాలిక ఆత్మ వచ్చింది అంటూ నారదుడు చెప్పగానే.. గుప్త ఆరు ఆత్మను చూస్తాడు. ఆరు ఆత్మ ఆకాశం నుంచి కిందకు వచ్చి ఇంట్లోకి వెళ్తుంది. నారదుడు, గుప్త ఇద్దరు మనం లోపలికి వెళ్దాం పదండి ఎవరిని ఆవహిస్తుందో చూద్దాం అనుకుంటూ ఇద్దరూ ఆరు ఆత్మను ఫాలో అవుతారు.

Advertisement

కిచెన్‌లో పాలు కాచి అందరికీ నీళ్లు కలిపిన పాలు తనకేమో చిక్కటి రుచికరమైన పాలు అనుకుంటూ పాలు తీసుకుని తాగుతూ ఉంటుంది చంభా. అప్పుడే కిచెన్‌లోకి వెళ్లిన ఆరు ఆత్మ చంభా నెత్తిన కొడుతుంది. చంభా అటూ ఇటూ చూసి షాక్‌ అవుతుంది. ఎవరు లేరు ఎవరు కొట్టారబ్బా.. కొంపదీసి ఆ అరుంధతి మేడం ఆత్మ వచ్చిందా ఏంటి..? అని అనుమానించగానే.. గుప్త ఆశ్చర్యంగా బలే పసిగట్టింది కదా గుప్త ఈ బాలిక అంటే.. పట్టదా తాను ఒకప్పుడు పెద్ద మత్రగత్తె.. ఇప్పుడేదో ప్రాక్టీస్‌ లేక అలా అయిపోయింది అని చెప్పగానే.. చంభా మళ్లీ అనుమానంగా ఒకవేళ పోలీసులకు దొరికిపోయిన ప్రచండ ఏదైనా కొత్త ఆత్మను పంపించాడా అనుకుంటుంది. ఆరు అక్కడి నుంచి మనోహరి రూంలోకి వెళ్తుంది.

మనోహరి రూంలో అద్దం ముందు నిలబడి రెడీ అవుతుంది. ఆరు ఆత్మ మనోహరి పక్కనుంచి నడుచుకుంటూ వెళ్లి అద్దంలో మనోహరికి కనిపిస్తుంది. మనోహరి భయతో కేకలు వేస్తుంది. అటూ ఇటూ తిరిగి చూస్తుంది. ఎవ్వరూ కనిపించరు.. వెనకాలే వచ్చిన గుప్త, నారదుడు మాత్రం అంతా గమనిస్తుంటారు. మనోహరి భయంతో యాదమ్మా అంటూ చంభాను పిలుస్తుంది. పరుగెత్తుకుంటూ వచ్చిన చంభా ఏంటి మనోహరి నీకు ఏదైనా జరిగిందా..? అని అడిగితే.. నీకు అంటున్నావు.. అంటే నీకు జరిగిందా అని మనోహరి అడిగితే..

Advertisement

అవును నేను కిచెన్‌లో ఉంటే ఎవరో వేనక నుంచి నా తల మీద కొట్టినట్టు అనిపించింది అని చెప్పగానే.. మనోహరి భయంతో నా వెనకాల ఎవరో తిరిగినట్టు అనిపించింది అంటూ ఏదైనా చేయ్‌ యాదమ్మ నువ్వే అంటూ భయపడుతుంది. అంతా గమనిస్తున్న నారదుడు.. గుప్త ఆ మనోహరి బాలిక ఈ అరుంధతి బాలిక బతికి ఉన్నప్పుడు చంపేసి సంతోషపడింది. ఇప్పుడు ఆత్మగా వస్తే మాత్రం భయంతో వణికిపోతుందేంటి..? అంటాడు. మానవులు మానసిక స్థితి అలాగే ఉంటుంది మహర్షి అంటాడు గుప్త.

ఆరు ఆత్మ అక్కడి నుంచి మిస్సమ్మ రూంలోకి వెళ్తుంది. అక్కడ మిస్సమ్మ అల్మారా సర్దుతుంటే.. అమర్‌, అరుంధతిల పెళ్లి ఆల్బమ్‌ కింద పడిపోతుంది. ఆ అల్బమ్‌ తీసుకుని ఫోటోలు చూస్తూ.. ఆరును గుర్తు చేసుకుని ఏడుస్తుంది మిస్సమ్మ. అప్పుడే ఆరు ఆత్మ వెళ్లి మిస్సమ్మ పక్కన నిలబడుతుంది. గుప్త, నారదుడు.. ఆరు ఆత్మ మిస్సమ్మలోకి ప్రవేశిస్తుందేమోనని అనుమానంగా చూస్తుంటారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Related News

Gundeninda GudiGantalu Today episode: సుమతి హెల్ఫ్ తో మీనా హ్యాపీ.. భర్తకు సేవలు చేసిన రోహిణి.. ప్రభా దెబ్బకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 16th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఇంట్లో మాలినిని చూసి షాకైన జ్యోత్స్న      

Podarillu Today Episode : శేఖర్ ను రెచ్చగొట్టిన చక్రీ.. పెద్దోడి పెళ్లికి గ్రీన్ సిగ్నల్.. చివర్లో దిమ్మతిరిగే ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ ను విడగొట్టేందుకు ప్లాన్.. తిరుపతి శోభనం క్యాన్సిల్.. వల్లికి దిమ్మతిరిగే షాక్..

Intinti Ramayanam Today Episode: పార్వతికి నిజం తెలుస్తుందా..? అవని ప్లాన్ సక్సెస్.. ఇదేం ట్విస్ట్ రా నాయనా..

Ninnu kori Serial Today Episode September 16th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్‌ ను సామ్రాట్‌ అనుకుని తీసుకెళ్లిన వాళ్ల అమ్మ – అయోమయంలో చంద్ర  

Wedensday Movies in Tv : బుధవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×