Suriya – Jyotika: ఇటీవల కాలంలో సెలబ్రిటీలు తమ పెళ్లి బంధాన్ని మరోసారి అద్భుతంగా చేసుకోవాలి అని అనుకుంటున్నారు. మళ్లీ పెళ్లి అన్న కాన్సెప్ట్ తో పెళ్లి రోజుని ఘనంగా చేసుకుంటున్నారు. బుల్లితెర జంటలతో పాటుగా వెండితెర జంటలు కూడా తమ పెళ్లిని మరోసారి చేసుకొని అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. కోలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ జంట సూర్య జ్యోతిక లు మరోసారి పెళ్లి చేసుకుని అందరిని షాక్ కు గురయ్యేలా చేశారు. వీళ్ల మళ్లీ పెళ్లి వీడియోను జ్యోతిక తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.. ఆ వీడియోలో తమ పిల్లలు కూడా ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అంతేకాదు పిల్లల ముందే సూర్య ప్రామిస్ చేశారు. మొత్తానికి ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాలకే బాగా ట్రెండ్ అవుతుంది. ఆ వీడియోలో అసలేముందో ఒకసారి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సూర్య, జ్యోతిక మళ్లీ పెళ్లి చేసుకున్న వీడియోను జ్యోతిక తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. 2006 సెప్టెంబర్ 11న వివాహ బంధంతో ఒకటైన ఈ స్టార్ జంట, రెండు దశాబ్దాల తమ ఆనందకరమైన ప్రయాణానికి గుర్తుగా ఒక విదేశీ లొకేషన్‌లోని అందమైన చర్చిలో ఈ ప్రత్యేక వేడుకను నిర్వహించారు.. ఆ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ క్రేజీ ఈవెంట్ లో జ్యోతిక వైట్ గౌనులో అందంగా కనిపిస్తుంది. అదే విధంగా సూర్య కూడా వైట్ కోటులో చాలా అందంగా కనిపిస్తున్నాడు. స్టైలిష్ లుక్ లో ఉన్న ఈ జంటను చూసి ఫాన్స్ ఫిదా అవుతున్నారు. ఇలా పెళ్లయి 20 ఏళ్ల అయినా కూడా ఇలానే ఉండడం నిజంగా గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి రెండు నడవడంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ జంట మరోసారి పెళ్లితో ఒకటయ్యారు. బ్యూటిఫుల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మరి నెక్స్ట్ ఏ జంట ఇలా సర్ప్రైజ్ చేస్తుందో చూడాలి.
• EXCLUSIVE : 20th Wedding Anniversary Celebration Of @Suriya_offl & #Jyothika 🤍 pic.twitter.com/6SEThcDQ5r
— Suriya Fans Team™ (@SuriyaFansTeam) September 15, 2026
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు.. ఈయన నటించిన ప్రతి సినిమా ఇటీవల బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. రీసెంట్గా విశ్వనాధ్ అండ్ సన్స్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కలెక్షన్ లో వర్షం కూడా కురిపించడంతో సినిమా బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. మరోవైపు సూర్య నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై కూడా ఇంట్రెస్టింగ్ బజ్ ఏర్పడుతోంది. జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నజ్రియా హీరోయిన్ గా నటిస్తుండగా, టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న సూర్య 48 కూడా లైనప్‌లో ఉంది.. వీటితో పాటుగా మరో రెండు సినిమాలకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అటు జ్యోతిగా కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. 20 ఏళ్ల వీళ్ళ చక్కటి అనుబంధానికి గుర్తుగా ఇప్పుడు ఇలాంటి వీడియోను షేర్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..