E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode September 16th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఇంట్లో మాలినిని చూసి షాకైన జ్యోత్స్న      

Karthika Deepam 2 Serial Today Episode September 16th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: ఇంట్లో మాలినిని చూసి షాకైన జ్యోత్స్న      
Advertisement

Karthika Deepam 2 serial today Episode:  దీపకు ఆపరేషన్‌ చేశామని తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్‌ చెప్పగానే..కార్తీక్‌ ఊపిరి పీల్చుకుంటూ డాక్టర్‌కు థాంక్స్‌ చెప్తాడు. అప్పుడు డాక్టర్‌ థాంక్స్‌ తనకు కాదని సమయానికి హాస్పిటల్‌కు తీసుకొచ్చి తన రక్తం ఇచ్చి తన అక్కను బతికించుకున్న జ్యోత్స్నకు చెప్పమంటాడు. కార్తీక్‌ జ్యోత్స్నకు థాంక్స్‌ చెబితే.. నేను ఒక్క దాన్నే కాదు ఇంకొకరు కూడా హెల్ప్‌ చేశారు అంటుంది.

ఇంకొకరు ఎవరు అని కార్తీక్‌ అడిగితే సూరజ్‌ అని చెప్తుంది జ్యోత్స్న. సూరజ్‌ అనగానే కార్తీక్‌ ఆశ్చర్యపోతాడు. తాను కూడా మీకు థాంక్స్‌ చెప్పాలని జ్యోత్స్న అంటుంది. ఒకప్పుడు ఇలాగే దీప ప్రాణాలతో పోరాడుతుంటే నేను సంతకాలు అడిగా.. ఒక ప్రాణం విలువ అప్పుడు నాకు తెలీదు.. నువ్వు సంతకం చేస్తే కానీ నేను అప్పుడు దీప ప్రాణాలు కాపాడలేదు.. అది ఎంత పాపం కదా.. అందుకే నేను చేసిన తప్పులు అన్నీ నా రక్తంతోనే కడుక్కున్నాను..ఇప్పుడు గిల్టీ పోయింది.. నేను ఇప్పుడు మారాను.. మనిషిని అయ్యాను అనే సంతోషం మిగిలింది.. ఇక సూరజ్‌ అన్న మాటలు మిమ్మల్ని అనుమానించేలా ఉన్నాయి. దీపకు ఎందుకు సాయం చేస్తున్నావు అని అడిగితే.. తన రుణం తీర్చుకుంటున్నాను అని చెప్పాడు. అంతే తన పగకు మీరు హెల్ప్‌ చేశారు. కాబట్టే తను దీప రుణం తీర్చుకుంటున్నాడు అనుకోవాలా..? అంటూ జ్యోత్స్న ప్రశ్నిస్తుంది.

Advertisement

అందుకు కార్తీక్‌  మాత్రం నువ్వేం అనుకుంటున్నావ్ జ్యోత్స్న అని అడిగితే.. మీరు నా జీవితం నాశనం చేయలేదు కానీ పగబట్టిన వాడికి తెలియకుండానే సాయం చేశారు బావ. అందరూ అదే అనుకుంటున్నారు. కాబట్టి మీ మీద పడిన నిందను మీరే చెరిపేసుకోవాలి. మీకు తెలియకుండానే మీరు సూరజ్‌ చేతిలో ఆయుధం అయ్యారు. గతంలో నేను చేసిన తప్పులు ఎంత కచ్చితంగా ఒప్పుకున్నానో ఇప్పుడు జరిగినవి అంతే కచ్చితంగా చెప్తున్నాను.. నేనంటే ఆవేశంగా ఆలోచిస్తాను.. కానీ మీరెలా తప్పు చేశారు. మీరెలా సూరజ్‌ను తక్కువ అంచనా వేసి గుడ్డిగా నమ్మారు.. ఏదో ఒకటి చేయ్ బావ.. కార్తీక్ దీప అంటే ఒక నమ్మకం ఈ మాట అందరితో అనిపించు అంటూ జ్యోత్స్న వెళ్లిపోతుంది.

బయటకు వెళ్లిన జ్యోత్స్న  పర్సులో డబ్బులు లేకపోవడం.. ఫోన్‌ కూడా సూరజ్‌ కారులో పడిపోవడంతో రోడ్డు పక్కన ఆటో కోసం వెయిట్‌ చేస్తుంది. అప్పుడే సూరజ్‌ వచ్చి కారులో డ్రాప్ చేస్తానంటాడు. జ్యోత్స్న ఒప్పుకోదు. కానీ సూరజ్‌ బలవంతంగా జ్యోత్స్నను తన మాటలతో కన్వీన్స్‌ చేసి కారు ఎక్కించుకుని వెళ్లిపోతాడు.

Advertisement

ఇంటికి వెల్లిన జ్యోత్స్న తన ఫోన్‌ సూరజ్‌ కారులో మర్చిపోయిన విషయం గుర్తుకు వచ్చి ఫోన్‌ వెతికి తీసుకుంటుంది. సూరజ్‌ బయటే ఉంటే జ్యోత్స్న ఇంట్లోకి వెళ్తుంది. ఇంట్లో మాలిని ఉండటం చూసి జ్యోత్స్న షాక్‌ అవుతుంది. మా ఇంట్లో నువ్వు ఉన్నావేంటి..? మా తాత ఎక్కడ..? తాత అంటూ గట్టిగా పిలుస్తూ.. వీళ్లేవరు అంటూ బ్యాంకు అధికారులను అడుగుతుంది. మాలిని కూల్‌గా దగ్గరకు వెళ్లి అసలు విషయం నీకు తెలియదా మేనకోడలా అని అడిగితే.. అత్తా నేను మా అమ్మ అంత మంచిదాన్ని కాదు.. నాకు కోపం ఎక్కువ.. అసలు నువ్వు మా ఇంట్లో ఎందుకు ఉన్నావు మా వాళ్లు ఏమయ్యారు అంటూ ప్రశ్నిస్తే.. నాతో వస్తే నీకు అంతా చూపిస్తాను.. తెలిసేలా చేస్తాను రా మేనకోడలా అంటూ జ్యోత్స్నను తీసుకెళ్తుంది.

బయట రోడ్డు మీద వెళ్తున్న శివనారాయణ వాళ్ల దగ్గరకు జ్యోత్స్నను తీసుకెళ్తుంది మాలిని. కట్టుబట్టలతో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న తన ష్యామిలీని చూసి జ్యోత్స్న షాక్‌ అవుతుంది. దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లి మీరు రోడ్డు మీద నడవడం ఏంటి తాత అని అడుగుతుంది. మాలిని నవ్వుతూ మొత్తం విషయం చెప్పి శివనారాయణకు ఇది ఆరంభం మాత్రమే.. మీరొచ్చి మా మామయ్య కాళ్లు పట్టుకుని క్షమించమని అడగండి అంతా వదిలేసి వెళ్లిపోతాను అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది మాలిని. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 16th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మలో ప్రవేశించనున్న ఆరు ఆత్మ..?  

Gundeninda GudiGantalu Today episode: సుమతి హెల్ఫ్ తో మీనా హ్యాపీ.. భర్తకు సేవలు చేసిన రోహిణి.. ప్రభా దెబ్బకు షాక్..

Podarillu Today Episode : శేఖర్ ను రెచ్చగొట్టిన చక్రీ.. పెద్దోడి పెళ్లికి గ్రీన్ సిగ్నల్.. చివర్లో దిమ్మతిరిగే ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ ను విడగొట్టేందుకు ప్లాన్.. తిరుపతి శోభనం క్యాన్సిల్.. వల్లికి దిమ్మతిరిగే షాక్..

Intinti Ramayanam Today Episode: పార్వతికి నిజం తెలుస్తుందా..? అవని ప్లాన్ సక్సెస్.. ఇదేం ట్విస్ట్ రా నాయనా..

Ninnu kori Serial Today Episode September 16th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్‌ ను సామ్రాట్‌ అనుకుని తీసుకెళ్లిన వాళ్ల అమ్మ – అయోమయంలో చంద్ర  

Wedensday Movies in Tv : బుధవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×