Gundeninda GudiGantalu Today episode September 16th: సుమతి అరుణ్ణి అర్జెంటుగా హాస్పిటల్ కి రమ్మని ఫోన్ చేసి పిలుస్తుంది. ఏంటి అంత అర్జెంటుగా రమ్మని పిలిచావు ఏమైంది మనం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం కదా ఏ విషయమైనా నాతో చెప్పాలి అని అరుణ్ అడుగుతాడు.. మా అక్కకి వచ్చిన ఆర్డరు ఇది అయితే పోటీకి డిపాజిట్ ముందే కట్టాలట.. కానీ తన దగ్గర డబ్బులు లేవు అని ఎంత చెప్తున్నా సరే సుమతికి నేను డబ్బులు ఇస్తాను అని అరుణ్ అంటాడు. అయితే సుమతి మా అక్క అలా తీసుకోదు.. అని చెప్తే ఎవరికో వడ్డీ ఇవ్వడం బదులు నాకు మీరు ఇవ్వచ్చు కదా అని అరుణ్ వెంటనే సుమతికి డబ్బులు తెచ్చి ఇస్తాడు. బావ లాగే అరుణ్ కూడా చాలా మంచి మనసున్న వ్యక్తి. నేను పెళ్లి చేసుకుంటే జీవితాంతం చాలా సంతోషంగా ఉంటాను అని సుమతి చాలా సంతోషంగా ఉంటుంది..
మీనా ఉదయం లేవగానే బాలుకి కాఫీ తెచ్చేస్తుంది కానీ బాలు మాత్రం నాకేం వద్దు అని అంటాడు. ఇద్దరు సరదాగా గొడవ పడుతున్న సమయంలోనే రవి శృతి కిందకి వస్తారు ఏమైంది.. ఎందుకు మీరిద్దరు గొడవ పడుతున్నారు అని అడుగుతారు అయితే బాలు తాగి వచ్చిన విషయం రవి శృతి లకు మీనా చెప్తుంది.. మందు మానేసావ్ కదా అన్నయ్య మళ్లీ నువ్వు ఎందుకు తాగాలని అనుకుంటున్నావు అని అడుగుతాడు రవి.. ట్రాఫిక్ కానిస్టేబుల్ వల్లే నేను తాగాను రా వేరే ఉద్దేశంతో కాదు అని బాలు ఎంత చెప్తున్నా సరే రవి మాత్రం అసలు వినకుండామీనకన్నా ఎక్కువగానే క్లాసు పీకుతాడు. ఇక మొత్తానికి మీనా బాలు ఇద్దరు గొడవ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది.. వీళ్లిద్దరు గొడవ పడుతున్న సమయంలో మీనా కి సుమతి ఫోన్ చేసి అర్జెంటుగా నువ్వు హాస్పిటల్కి రా అక్క అని అంటుంది. అనేసి అడుగుతుంది.. తన ఫ్రెండ్ డబ్బులు ఇచ్చాడు అని చెప్పగానే మీనా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది.
మీనా కోసమని సుమతి అరుణ్ దగ్గర డబ్బులు తీసుకొని అప్పుగా ఇవ్వాలని అనుకుంటుంది.. ఆ విషయాన్ని మీరు నాకు ఫోన్ చేసి వెంటనే రమ్మని పిలుస్తుంది.. సుమతి ఎందుకు పిలిచిందో ఏంటో అర్థం కావడం లేదు అని చాలా బాధపడిపోతూ భయపడిపోతూ మీనా హాస్పిటల్ కి వెళ్తుంది. అక్క నువ్వు డబ్బులు కావాలని అడిగావు కదా ఇవిగో ఆ డబ్బులు నీకు సెట్ అవ్వలేదు కదా అందుకే నేనే నా ఫ్రెండ్ దగ్గర తీసుకొని ఇచ్చాను నీ డబ్బులు సెట్ అయిన తర్వాత వాళ్లకి చేద్దాము అని సుమతి అంటుంది. ఇంత డబ్బులు నీకు ఎక్కడిది అని మీనా అనుమానంగా అడుగుతుంది కానీ అవన్నీ ఎందుకు అక్క నీకు డబ్బులు ఇచ్చాను కదా నా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను అప్పుగానే మళ్ళీ వాళ్ళకి ఇచ్చేద్దాము అని చెప్పగానే సుమతి నువ్వు ఇంకా చిన్న పిల్లవే అనుకున్నాను. కానీ ఇంత పెద్దగా ఎదిగిపోతావ్ అని నేను అసలు అనుకోలేదు అని మీ నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నువ్వు నిజంగా గ్రేట్ సుమతి అని మీనా పొగిడిస్తూ ఉండగా అక్క నువ్వు నన్ను ఇంకా ఎక్కువగా పైకి లేపేస్తున్నావు నువ్వు నా అక్క అక్క మా కోసం నువ్వు ఎంతో చేశావో నీకోసం ఏ మాత్రం కూడా చేయలేము అని సుమతి అనగానే అక్క చెల్లెల సెంటిమెంట్ సీను ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది.
శృతి రెస్టారెంట్ కి వచ్చిన ఓ ఇద్దరు అబ్బాయిల దగ్గర ఆర్డర్ తీసుకోవాలని అనుకుంటుంది.. అయితే ఆ ఇద్దరు అబ్బాయిలు కూడా శృతి తో మిస్బిహేవ్ చేయడంతో ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది.. వాళ్లతో మాటకు మాట సమాధానం చెప్తూనే సూప్ వాళ్ళ మీద పడేలా చేస్తుంది. ఏం చేస్తున్నారు రాస్కెల్ అంటూ శృతి రెచ్చిపోతుంది. వాళ్ళిద్దరినీ కూడా ఒక్కసారిగా దుమ్ము దులిపేస్తుంది. అయితే మిస్ బిహేవ్ చేసిన ఆ ఇద్దరు కూడా శృతి ఇదే తప్పు అని అంటారు.. నీతూ రాగానే మాట మార్చి రెస్టారెంట్లు ఇలాంటి మర్యాదలు చేస్తారా అంటూ వాళ్లు అబద్ధం చెప్పగానే తను అదే నిజమని అనుకుంటుంది. అయితే శృతి ఎంతగా చెప్పినా కూడా రవి నీతో వినకపోవడంతో మీ ఇద్దరికీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేనే ఇకనుంచి వెళ్ళిపోతున్నాను నాకు నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ అని శ్రుతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..
బాలును మీనా అడ్డంగా ఇరికించేస్తుంది.. సుమతి వాళ్ళ డబ్బులు సెట్ అయ్యాయి అన్న విషయాన్ని ఎలాగైనా సరే బాలుకి చెప్పాలని మేన పదేపదే ఫోన్ చేస్తుంది.. కానీ బాలు మాత్రం నేను కావాలని తాగలేదు అని ఎంత చెప్పినా నన్ను నమ్మవా నేను నీతో మాట్లాడను అంటూ ఫోన్ కట్ చేస్తాడు.. మీనా మాత్రం బాలుకున్న కోపానికి ఎవ్వరూ బ్రతకరు అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సత్యం ఏంటమ్మా బాలు ఇంకా రాలేదా అని అడుగుతాడు. లేదు మామయ్య ఆయన ఇంకా రాలేదు ఫోన్ చేయడం ఎందుకులే అని నేను ఆగాను అని నేను అంటుంది కానీ సత్యం మాత్రం బాలుకు ఫోన్ చేసి మాట్లాడమని ఇస్తాడు. బాలు సత్యం అనుకోని మాట్లాడతాడు కానీ నేను అని తెలిసి నువ్వా అని అనుకుంటాడు. ఇక వీరిద్దరికి గొడవ ఎపిసోడ్కి కాస్త హై లైట్ గా నిలుస్తుంది.. ఆ తర్వాత సత్యం కూడా త్వరగా ఇంటికి రమ్మని చెప్తాడు.
భర్తకు సేవలు చేసే అవకాశం రోహిణికి దేవుడు కనిపిస్తాడు. జ్వరం అవడంతో రోహిణి దగ్గరుండి తన భర్తకి సేవలు చేస్తుంది.. తన భర్తకి రాత్రంతా మేలుకొని జ్వరం తగ్గేలా రోహిణి చేస్తుంది.. ఎన్ని రోజులైంది మనోజ్ నువ్వు నన్ను ఇలా గట్టిగా పట్టుకొని పడుకొని ఇన్ని రోజులకి మళ్లీ నువ్వు ఇలా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అని రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది. కాస్త జ్వరం తగ్గిన తర్వాత మనోజ్ రోహిణి దూరం పెట్టేస్తాడు అయినా కూడా రోహిణి మనోజ్ కి జ్వరం తగ్గేలా చేయాలి అని అనుకుంటుంది. మొత్తానికి మనోజ్ కి జ్వరం తగ్గడానికి రోహిణి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అయితే రోహిణి ఉదయం లేవగానే తన పక్కన కూర్చుని ఉండడం చూసిన ప్రభావతి ఏమైంది అని అడుగుతుంది రాత్రంతా మీ అబ్బాయికి జ్వరం అత్తయ్య అని రోహిణి చెప్పగానే ప్రభావతి ఇప్పుడు చెప్తున్నావా నువ్వు బయటే ఉండు లోపలికి వెళ్లదు అని ప్రభావతి టాబ్లెట్ తీసుకొని వస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో రోహిణి పై ప్రభావతి సీరియస్ అవుతుంది తనని ఇంట్లో నుంచి గెంటేసే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..