Podarillu Today Episode September 16th : ఈ పెళ్లి సంబంధం ఎట్టి చూసినా క్యాన్సిల్ అయ్యేలాగా లేదు అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు.. అయితే ఎంగేజ్మెంట్ జరుగుతున్న సమయంలో పంతులు అందరిని పిలిచి జాతకాలు చూడాలి అని అనుకుంటారు. ఇక అందరూ అక్కడ సమావేశం అవగానే పంతులుగారు ఆ జాతకాలని చూసి మరోసారి మీ ఎంగేజ్మెంట్ కి ముహూర్తం పెడతాను అని అంటారు.. ఎలాగైనా సరే ఈ పెళ్లికి జాతకాలు కలవు అని పంతులు చెప్తారని అందరు అనుకుంటారు. కానీ పంతులు మాత్రం వీళ్ళందరికీ షాక్ ఇస్తూ జాతకాలు దివ్యంగా ఉన్నాయి ఈ పెళ్లి నిరంతంగా చేసుకోవచ్చు అని అంటాడు. ఆ మాట వినగానే కన్నా,కేశవ ఇద్దరు కూడా చాలా కోపంగా ఉంటారు. మొత్తానికి పంతులు ప్లాన్ చెడగొట్టేలా చేయడంతో కన్నా కేశవ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. నువ్వు ఇలా చేస్తావని మేము అస్సలు ఊహించలేదు ఎందుకు ఇలా చేశావు అని అంటే ఇది నా వృత్తి దానికి నేను ద్రోహం చేయలేను అని చెప్పగానే వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు..
ఇక మాధవ్ అందరినీ పిలిచి ఎందుకు మీరు నా పెళ్లి సంబంధం చెడగొట్టడానికి ప్లాన్ వేస్తున్నారు నాకు తెలియదని మీరు అనుకుంటున్నారా? ఎందుకు ఇలా చేస్తున్నారు అని అందరిపై సీరియస్గా అరుస్తాడు.. ఎందుకు నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మీరందరూ చెడగొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అసలు మీ అందరికీ ఏమైంది అని మాధవ్ సీరియస్గా అడుగుతారు. అయితే నా పెళ్లి చెడగొట్టడానికి అందని రెచ్చగొట్టింది మాత్రం చక్రి కదా అని అంటారు. నా పెళ్లి నా ఇష్టం నా ఇష్టప్రకారమే నేను చేసుకుంటాను మీరు ఎవరు ఇందులో జోక్యం చేసుకోవద్దు. ఈ పెళ్లి కనుక ఆగిపోయింది అంటే దానికి కారణం మీరే జీవితంలో మిమ్మల్ని క్షమించను అని మాధవ్ అందరికీ వార్నింగ్ ఇస్తాడు. కానీ అందరూ మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటారు..
ఈ పెళ్లిని ఆపడానికి ఇంకా ఎటువంటి ప్రయత్నాలు లేవేమో.. ఎవరు ఇంకా ఈ పెళ్లిని ఆపేయడానికి ప్రయత్నాలు చేయరేమో అని మహాలక్ష్మితో పాటు మిగిలిన వాళ్ళందరూ చాలా బాధపడిపోతూ ఉంటారు. కానీ శేఖర్ మాత్రం మందు బాటిల్ తీసుకొని అలా వెళుతూ ఉండగా చూసిన చక్రి ఈ పెళ్లిని ఆపడానికి ఆఖరి ప్రయత్నం నేను చేస్తాను అని అంటాడు. అయితే శేఖర్ దగ్గరికి వెళ్లి మీరు ఎందుకు జయంతి ని ప్రేమించి పెళ్లి చేసుకుని వదిలేయాలనుకున్నారు అని చక్రి అడుగుతాడు.. అయితే నేను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను కానీ కొన్ని యుగోల వల్ల ఆమె నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది ఈ ప్రపంచంలో ఎవరికీ లేని ఆఫర్ ని నాకు ఇచ్చింది నేను ఇంకా విడాకులు కూడా ఇవ్వకముందే వేరే వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది దానికి నన్ను పిలిచింది అంటూ చాలా బాధపడిపోతాడు శేఖర్..
మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఒక మెట్టు మీరే తగ్గి తనతో మాట్లాడటానికి ప్రయత్నించండి. అప్పుడు ఆమె తన మనసుని మార్చుకునే ప్రయత్నం చేస్తుందేమో చూద్దాము అని చక్రి అంటాడు.. అనుకున్న విధంగానే చక్రి తన ప్లాన్ ప్రకారం రెచ్చగొట్టి పంపిస్తాడు. అయితే శేఖర్ ఎలాగైనా సరే జయంతిని మళ్ళీ సొంతం చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు.. ఇక చక్రి ఎవరిని రెచ్చగొట్టి పంపించాలో వాళ్లనే రెచ్చగొట్టి పంపించాను. ఇక ఆ దేవుడు దయ వల్ల ఎంగేజ్మెంట్ తో పాటు పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోతుంది అని అందరూ చాలా సంతోషంగా ఉంటారు కానీ ఎంగేజ్మెంట్ కి అంత సిద్ధం చేయడంతో ఆఖరి నిమిషంలో టెన్షన్ పడిపోతూ ఉంటారు..
అయితే జయంతి వలన నీకు ఈ ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఇష్టమేనా అని మళ్ళీ మళ్ళీ అడుగుతాడు.. కానీ జయంతి మాత్రం ఎన్ని సార్లు అడుగుతారు నాన్న నాకు ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఇష్టమే అని అంటుంది.. అదేవిధంగా మాధవ్ కూడా నాకు ఇష్టమైన చెప్పగానే.. ఈ పెళ్లి ఆగిపోయే మార్గమే లేదా అని అందరూ బాధపడిపోతూ ఉంటారు.. అయితే ఇక తాంబూలాలు మార్చుకోవడానికి చక్రి మహాని అడుగుతారు వాళ్ళిద్దరూ ఇష్టంగానే తాంబూలాలను అందుకుంటారు. ఆ తర్వాత బట్టలు మార్చుకో రమ్మని పంతులుగారు చెప్తారు ఇక అందరూ వాళ్ళింక రాలేదు అని వెయిట్ చేస్తూ ఉంటారు. మాధవ వస్తాడు కానీ జయంతి ఇంకా బట్టలు మార్చుకోలేదేమో అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ జయంతి ఈ ఎంగేజ్మెంట్ జరగట్లేదు నాన్న అని చెప్పగానే మాధవ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషంగా ఉంటుంది.
జయంతి ఆ మాట అనగానే ఏమైంది ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు ఇందాక తాంబూలాలు మార్చుకునేటప్పుడు కూడా ఇష్టమే అన్నావు కదా.. లోపలికి వెళ్ళగానే నీకు ఏమైంది అని అందరూ అడుగుతారు. ఏమీ లేదు మేమిద్దరము మళ్ళీ కలిసి బతకాలి అనుకుంటున్నాము అని శేఖర్ అనగానే అంతా లోలోపల చాలా సంతోషంగా ఉంటారు. అవును నాన్న శేఖర్ నాకు ప్రామిస్ చేశాడు నా ఇష్టప్రకారమే ఉంటాను అని అన్నాడు. అందుకే నేను తనని మళ్లీ ఇష్టపడుతున్నాను. ఈ పెళ్లి క్యాన్సిల్ అయినందుకు నన్ను క్షమించండి అని జయంతి అంటుంది.. ఈ మాట వినగానే చెక్రి మహాలక్ష్మి ఇద్దరు కూడా ఒక్కసారిగా సంతోషంతో ఎగిరి గంతేస్తారు. ఇక జయంతితో పెళ్లి క్యాన్సిల్ అయినందుకు మాధవ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…