E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today September 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బాంబు అమర్చిన గణపతిని మనుకు ఇచ్చిన అరవింద్‌ – రిమోట్‌ ఆన్‌ చేసినా పేలని బాంబు

Nindu Noorella Saavasam Serial Today September 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బాంబు అమర్చిన గణపతిని మనుకు ఇచ్చిన అరవింద్‌ – రిమోట్‌ ఆన్‌ చేసినా పేలని బాంబు
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌ నువ్వు బయటకు వెళ్లొద్దు వెళితే ఆ రాస్కెల్స్‌ నీ మీద దాడి చేయోచ్చు థ్రెట్‌ ఉందని తెలిసి కూడా నువ్వు మార్కెట్‌కు వెళతాననడం ఏం బాగాలేదు. విగ్రహం కావాలంటే నేను మార్కెట్‌ కు వెళ్లి తీసుకోస్తాను. వాళ్లు ఎలాగూ నన్ను గుర్తు పట్టరు కదా? పైగా నువ్వు ఇక్కడ ఉంటేనే మంచిది. ఏ క్షణంలో అటాక్‌ జరిగినా ఇంట్లో వాళ్లను నువ్వు కాపాడొచ్చు అంటూ మనోహరి మాటలు చెప్పేసరికి అమర్‌ కూడా సరే అంటాడు. దీంతో తాను బాబ్జీకి ఫోన్‌ చేసుకోవడానికి టైం దొరికిందని మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది. ఆరు మాత్రం ఎప్పుడూ లేనిది ఇది ఇవాళ ఇలా మాట్లాడుతుందంటే ఏదో డౌటుగా ఉంది అనుకుంటుంది. ఇంతలో నువ్వు ఒంటరిగా వెళ్లడం దేనికి రాథోడ్‌ ను పంపిస్తాను అంటాడు. అయితే వాళ్లు మీ మిలటరీ వాళ్లను గుర్తుపడటారు. మళ్లీ అప్పుడు నా పై కూడా అటాక్‌ చేయోచ్చు అని మనోహరి చెప్పగానే అమర్‌ సరే అంటాడు. మనోహరి వెళ్లిపోతుంది.

అమర్‌ ఇంటికి వచ్చిన రణవీర్‌, గేటు దగ్గరే ఆపేసిన సెక్యూరిటీ

Advertisement

తర్వాత రణవీర్‌, అమర్‌ ఇంటికి వస్తాడు. గేటు దగ్గరే మిలటరీ వాళ్లు ఆపేస్తారు. దీంతో రణవీర్‌ బయటి నుంచే వెను దిరిగి వెళ్లిపోతుంతే పైనుంచి మిస్సమ్మ చూస్తుంది. కిందకు వచ్చి అమర్‌కు చెప్తుంది. దీంతో అమర్‌, మిస్సమ్మ గేటు దగ్గరకు వెళ్తారు. వాళ్లను చూసిన ఆరు ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు. ఆ మను మరేదైనా తిక్క పని చేసిందా? అనుకుంటుంది. గేటు దగ్గరకు వెళ్లిన అమర్‌ రణవీర్‌ ను పిలుస్తారు. రణవీర్‌ ఇచ్చి నిన్న అంజలి పాప కాల్ చేసి ఇంట్లో పూజ ఉంది. తప్పకుండా రమ్మంది. ఇక్కడికి వస్తే మిలటరీ వాళ్లు లోపలికి రానివ్వడం లేదు. అందుకే వెళ్లిపోతున్నాను.. ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాను. కానీ రాకుంటే అంజలి పాప బాధపడుతుందని వచ్చాను. ఇక్కడ పరిస్థితి చూశాక రావడం కరెక్టు కాదనిపించింది. నేను వచ్చి వెళ్లానని అంజలికి చెప్పండి అంటాడు రణవీర్‌. అయ్యో మీరు ఇంత దూరం వచ్చి పూజకు రాకుండా వెళ్తారా? మీరు లోపలికి రండి పదండి అంటూ అమర్‌, మిస్సమ్మ రణవీర్‌ను లోపలికి తీసుకెళ్తారు.

బాబ్జీకి ఫోన్‌ చేసిన మనోహరి, సమయానికి బాబ్జీ ఫోన్‌ స్విచ్చాప్‌

Advertisement

బయటకు వెళ్లిన మనోహరి, బాబ్జికి ఫోన్‌ చేస్తుంది. దుర్గను నేను అంటూ డీటెయిల్స్‌ చెప్పబోతుంటే బాబ్జీ ఫోన్‌ స్విచ్చాప్‌ అవుతుంది. దీంతో మనోహరి ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంది. మరోవైపు లోపలికి వెళ్లిన రణవీర్‌ ను చూసి అంజు హ్యాపీగా ఫీలవుతూ విషెస్‌ చెప్తుంది. బయటి నుంచి గమనిస్తున్న ఆరు, అంజును అనుమానిస్తుంది. అంజు ఏంటి మనోహరి భర్తను చూసి ఇంత ఆనంద పడుతుంది. ఇంత దగ్గర అవుతుందేంటి? అని మనసులో అనుకుంటుంది. అంజు రణవీర్‌ డ్రెస్‌ బాగుందని మెచ్చుకుంటుంది. ఇంతలో రణవీర్‌ ఇంట్లో ముఖ్యమైన వాళ్లు లేనట్టు ఉంది. అని అడుగుతాడు. దీంతో అందరూ ఎవరబ్బా ముఖ్యమైన వాళ్లు అని ఆలోచిస్తుంటారు. రణవీరే మళ్లీ మనోహరి గారు లేనట్టున్నారు అంటాడు. దీంతో మనోహరి వినాయకుని విగ్రహం తీసుకొస్తానని మార్కెట్‌ కు వెళ్లింది ఇంకా రాలేదేంటని అమర్‌ చెప్పి బయట గేటు దగ్గరకు వెళ్లి మిలటరీ వాళ్లను జామర్‌ ఆఫ్‌ చేయమని చెప్పి మనోహరికి కాల్‌ చేసి త్వరగా రమ్మని చెప్తాడు. మనోహరి సరేనని ఫోన్‌ కట్‌ చేసి బాబ్జీకి మళ్లీ ఫోన్‌ చేస్తుంది. బాబ్జీ ఫోన్‌ స్విచ్చాప్‌ రావడంతో మనోహరి విగ్రహం తీసుకోవడానికి వెళ్లుంది.

Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇంట్లోంచి వెళ్లిపోతానన్న అపర్ణ – తాను పట్టించుకోనన్న చెప్పిన రాజ్‌

బాంబు పెట్టిన గణపతి విగ్రహాన్ని మనోహరికి ఇచ్చిన ఉగ్రవాదులు

మనోహరి కారును అరవింద్‌, తన అనుచరుడు ఫాలో అవుతుంటారు. కొంచెం దూరం వెళ్లాక మనోహరి కారు పక్కన ఆపి మరోసారి బాబ్జీకి కాల్‌ చేస్తుంది. అప్పుడు కూడా ఫోన్‌ స్విచ్చాప్‌ వస్తుంది. దీంతో ఇరిటేటింగ్‌ గా ఆలోచిస్తున్న మనోహరి దగ్గరకు బాంబు అమర్చిన వినాయకుని విగ్రమం తీసుకొచ్చి ఇస్తారు అరవింద్‌ ఆయన అనుచరుడు. అయితే నేను విగ్రహం కోసమే వచ్చానని మీకెలా తెలుసని మనోహరి అడగ్గానే అమర్‌ సార్‌ ఫోన్‌ చేసి చెప్పారని మిమ్మల్ని ఇంతకు ముందు అమర్‌ సార్‌ ఇంట్లో చూశామని అందుకే తీసుకొచ్చి ఇస్తున్నామని అబద్దం చెప్తాడు. దీంతో మనోహరి సరే అని ఆ విగ్రహం తీసుకుని వెళ్లిపోతుంది. మనోహరి కారును ఫాలో అవుతుంటాడు. అరవింద్‌.

బాంబు ఉన్న విగ్రహానికి పూజలు

బాంబు ఉన్న విగ్రహం తీసుకుని ఇంటికి వచ్చిన మనోహరిని కారును మిలటరీ వాళ్లు చెక్ చేస్తుంటారు. దీంతో అరవింద్‌ అనుచరుడు భయపడుతుంటాడు. నువ్వేం భయపడకు మిలటరీ వాళ్ల మిషన్‌ కూడా కనిపెట్టకుండా బాంబు తయారు చేశానని చెప్తాడు. అరవింద్‌ చెప్పినట్లుగానే మిలటరీ వాళ్లు చెక్‌ చేసి ఏమీ లేదని పంపిస్తారు. ఇంతలో పిల్లలు బయటకు వచ్చి వినాకుని విగ్రహాన్ని తీసుకుని వెళ్లి ఇంట్లో మండపంలో పెడతారు. బయటి నుంచి అరవింద్‌ రిమోట్‌ ఆన్‌ చేస్తాడు. బాంబు పేలదు. దీంతో జామర్లు ఆన్‌ చేశారు. అందుకే పేలలేదు అని ఇది ఫెయిల్‌ అయినా రెండో ఆప్షన్‌ ఉంది. అక్కడ విగ్రహం దగ్గర దీపాలు వెలిగిస్తే వచ్చే హీట్‌ కు బాంబు పేలేటట్లు సెట్‌ చేశాను అంటాడు అరవింద్‌. ఇంతటితో ఇవాళ్టీ నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ ఎపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

బిగ్ బాస్ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఈమె!

Gundeninda Gudigantalu : సీరియల్లో యూట్యూబర్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ మావా..

Intinti Ramayanam : పల్లవి అవుట్.. ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Big Stories

Advertisement
×