BigTV English

Trinayani Serial Today September 17th: ‘త్రినయని’ సీరియల్‌: నాగులమ్మను తీసుకొచ్చిన గురువుగారు – భుజంగ మణి గురించి చెప్పిన పెద్దబొట్టమ్మ

Trinayani Serial Today September 17th: ‘త్రినయని’ సీరియల్‌: నాగులమ్మను తీసుకొచ్చిన గురువుగారు – భుజంగ మణి గురించి చెప్పిన పెద్దబొట్టమ్మ

Trinayani Serial Today September 17th Episode: విక్రాంత్‌ ఆఫీసుకు వెళ్తుంటే సుమన వచ్చి పోలీసులకు కంప్లైంట్‌ చేయండి అని చెప్తుంది. దేని కోసం అని విక్రాంత్‌ అడగ్గానే గాయత్రి పాపను కిడ్నాప్‌ చేయబోయారు అని చెప్పి కంప్లైంట్‌ చేయండి అని చెప్తుంది. దీంతో విక్రాంత్‌ కోపంగా సుమనను తిడతాడు. అలాంటి వాళ్ల మీద కంప్లైంట్‌ ఇస్తే పోలీసులు మనల్నే తిడతారు. అలాంటి వాళ్లను ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు అంటూ మనల్నే ప్రశ్నిస్తారు అని విక్రాంత్ చెప్పి వెళ్లిపోతాడు.


గజగండ ఎప్పుడు ఏ రూపంలో వస్తాడోనని ఇంట్లో వాళ్లందరికి టెన్షన్‌

తర్వాత అందరూ హాల్‌లో కూర్చుని ఆలోచిస్తుంటారు. ఇంతలో నయని వస్తుంది. ఏమైందని అడుగుతుంది. దీంతో ఆ గజగండ గురించి ఆలోచిస్తున్నాము అంటారు. ఇంతలో వల్లభ వచ్చి ఆ గజగండ కొడుకును లేపేశారు. టైం వచ్చిందని వాడు రెచ్చిపోతున్నాడు అనగానే విశాలాక్ష అమ్మవారిని కొలిచే మనతో పెట్టుకుంటున్నాడంటే ఆ గజగండకు త్వరలోనే పోయే కాలం వస్తుందని అర్థం అంటాడు విశాల్‌. మీరు చాలా కులాసాగా ఉన్నట్లు బలే చెప్పారు బావగారు వాడికి పోయే కాలం వస్తుందని మాట్లాడుకుంటూ ఇంట్లో కూర్చుంటే ఎలా చెప్పండి అంటుంది సుమన. దీంతో మరేం చేయమంటావు అని విక్రాంత్‌ అడగ్గానే వాడిని నాలుగు తన్ని పంచకమణిని తీసుకురాలేరా? అంటుంది. దీంతో అది అంత సులువు కాదు అంటుంది నయని.


మణికాంత గుడికి వెళ్లే దారి నాగులమ్మకు తెలుసు: గురువు

ఇంతలో గురువు గారు వస్తారు. అందరూ ఆయనకు లేచి నమస్కారం చేయగానే గురువుగారు శుభం భుయామి అంటాడు. దీంతో సుమన మీరు ఎప్పుడొచ్చినా శుభం అంటారు కానీ మాకు శుభం జరగడం లేదు అంటుంది సుమన. దీంతో గురువు గారు ఏమైందని అడుగుతాడు. దీంతో జరిగింది మొత్తం చెప్తారు. మీరు ఇక్కడే ఉంటే ఏమీ చేయలేరని నయని మణికాంత గుడికి వెళ్లాలని చెప్తాడు. దీంతో దారి తెలిస్తే ఎప్పుడో వెళ్లేదని అందుకే వెళ్లలేదని చెప్తుంది దురందర. అయితే నాగులమ్మకు దారి తెలుసు అని గురువుగారు చెప్తారు. దీంతో సుమన పెద్దబొట్టమ్మకు తెలుసా? దొంగ ముఖంది నాకు ఇంత వరకు ఎప్పడు చెప్పలేదు. అని బాధపడుతుంది. దీంతో ఆమె ఎప్పుడొచ్చి ఎవర్ని కాటేస్తుందోనని ఆరోజు నుంచి ఇప్పటి వరకు టెన్షన్‌ పడుతూనే ఉన్నాం. అయినా ఆమె ఎప్పుడు రావాలి. వచ్చినా మన మాట వినకుండా కాటేయకుండా ఎందుకు ఉండాలి అని వల్లభ టెన్షన్‌ పడుతుంటాడు. ఇంతలో గురువు గారు నాగులమ్మ వచ్చింది వల్లభ అంటూ నాగులమ్మను పిలుస్తాడు.

Also Read:  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బాంబు అమర్చిన గణపతిని మనుకు ఇచ్చిన అరవింద్‌ – రిమోట్‌ ఆన్‌ చేసినా పేలని బాంబు

తనకు దారి తెలియదన్న నాగులమ్మ

నాగులమ్మ గాయత్రి పాపను ఎత్తుకుని వస్తుంది. దీంతో అందరూ నాగలమ్మ చేతిలో ఉన్న గాయత్రి పాపను చూసి టెన్షన్‌ పడుతుంటారు. గాయత్రిని నయనికి ఇస్తుంది పెద్దబొట్టమ్మ. ఇంతలో హాసిని మణికాంత గుడికి వెళ్లే దారి నీకు తెలుసని గురువు గారు చెప్పారు. ఎలా వెళ్లాలి అని అడుగుతుంది. దీంతో తనకు దారి తెలియదని నాగులమ్మ చెప్తుంది. మళ్లీ ఇప్పుడు మారిపోయి ఉంటుంది కదా అంటుంది. దీంతో నయని స్వామి మీకు తెలుసు అంటున్నారు మీరేమో తెలియదు అంటున్నారు అన నయని అడుగుతంది. దీంతో విశాల్‌ కూడా పెద్దబొట్టమ్మకు తెలియనప్పుడు బలవంతంగా చెప్పించకూడదు అంటాడు. అయితే గురువుగారు ఆ మణితో అష్టై్శ్వర్యాలు పొందువచ్చేమో కానీ శక్తులు పొందలేరు అని చెప్తాడు. మరి ఎవరికి తెలుసు అని వల్లభ అడగ్గానే నాకు తెలుసు అని నాగులమ్మ అంటుంది. దీంతో విక్రాంత్‌ ఏం తెలుసు మీకు. ఇందాకా తెలియదు అన్నారు. ఇప్పుడేమో తెలుసు అంటున్నారు అని అడగ్గా..

భుజంగ మణి గురించి చెప్పిన నాగులమ్మ

దారి తెలియదు కానీ సర్వ శక్తులు పొందాలంటే పంచకమణికి జతగా ఉండే భుజంగ మణిని కూడా తీసుకుని వస్తేనే సర్వశక్తులు లభిస్తాయని తెలుసు. ఆ విషయం గజగండకి తెలియక సతమతమవుతున్నాడు. అది కనక తీసుకుని వస్తే ఈ లోకాన్నే జయించవచ్చు అని నాగులమ్మ చెప్పగానే సుమన అవునా ఎక్కడుంది అది అని అడుగుతుంది. అది ఆ మానసదేవి ఆలయంలోనే ఉందని దాన్ని అక్కడి నుంచి తీసుకురావడం ఎవరి వల్ల కాదని నాగులమ్మ చెప్తుంది. దీంతో నయని మాకు ఎలాంటి ఆశ లేదని బాబు గారి చేయి నయం అయితే చాలని అంటుంది. అయితే అక్కడికి ఎలా వెళ్లాలో ఎవరికి తెలుసు అని అడగ్గానే గురువుగారు గాయత్రిదేవికి తెలుసు అంటాడు. అది కూడా గాయత్రి ఆత్మకు కాదు. మీ అమ్మా పునర్జన్మ ఎత్తి రావాలి అని చెప్పగానే అందరూ షాక్‌ అవుతారు.

భుజంగమణి ఎలా తీసుకురావాలని ఆలోచించిన విక్రాంత్‌

తర్వాత విక్రాంత్‌ ఆలోచిస్తుంటే సుమన వచ్చి ఏ చీకూ చింత లేని వాళ్లు కూడా ఆలోచిస్తున్నారేంటి అని అడుగుగుతుంది. దీంతో భుజంగమణి తీసుకురావడం ఎలా అని ఆలోచిస్తున్నాను అంటాడు విక్రాంత్‌. దీంతో ఎగ్జైంటింగ్‌ గా సుమన బుల్లి బావగారు ఏమన్నారు మీరు భుజంగ మణి కోసం వెళ్దామనుకుంటున్నారా? అని అడుగుతుంది. అవును నాకు దారి తెలియగానే వెళ్తాను. ఒకవేళ నీకు దారి తెలిస్తే ముందు నువ్వు వెళ్లు నీ వెనకే నేను వస్తాను అంటాడు. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Big Stories

×