BigTV English

Nindu Noorella Saavasam Serial Today September 1st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరును కాపాడేందుకు వచ్చిన గణపతి

Nindu Noorella Saavasam Serial Today September 1st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరును కాపాడేందుకు వచ్చిన గణపతి

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌ తీసుకొచ్చిన శారీ కట్టుకుని వినాయక పూజకు రెడీ అవుతుంది మిస్సమ్మ. మిస్సమ్మను ఆ చీరలో చూసిన రాథోడ్ ఆశ్చర్యపోతాడు. ఎంత అందంగా రెడీ అయ్యావు మిస్సమ్మ అంటూ దగ్గరకు వచ్చి పొగడ్తలతో ముంచెత్తుతాడు. మిస్సమ్మ అస్సలు నువ్వేనా..? అని అడుగుతాడు. దీంతో ఎందుకు అనుమానం వచ్చింది రాథోడ్‌ అని మిస్సమ్మ అడగ్గానే.. అసలు పండగంతా నీ దగ్గరే ఉంది మిస్సమ్మ అంటాడు. పో రాథోడ్‌ నన్ను ఆట పట్టించకు.. అంటుంది. మిస్సమ్మ. నిజం చెప్తున్నాను మిస్సమ్మ ఈరోజు నువ్వు స్పెషల్‌గా కనిపిస్తున్నావు అని రాథోడ్‌ అనగానే అయితే ఆ స్పెషల్‌కు కారణం ఈ శారీనే అంటుంది మిస్సమ్మ. అవును మిస్సమ్మ శారీ వల్ల నీకు అందం వచ్చిందో.. నీవల్ల శారీకి అందం వచ్చిందో తెలియదు కానీ భలే ముద్దుగా ఉన్నావు అని చెప్తాడు రాథోడ్‌.


దీంతో మిస్సమ్మ సిగ్గుపడుతూ రాథోడ్‌ ఈ శారీ ఆయన సెలెక్షనే.. అని చెప్తుంది. దీంతో రాథోడ్‌ నేను ముందే అనుకున్నా ఈ కలరు మా సారు ఫేవరెట్‌ కలరు అని చెప్తాడు. దీంతో అయితే ఈరోజు నుంచి నా ఫెవరెట్‌ కలరు కూడా అని చెప్తుంది మిస్సమ్మ. దీంతో రాథోడ్‌ ఏంటి మిస్సమ్మ మా సారును నీలోకి లాగేసుకుంటున్నావా..? లేదా సారే నీలో కలిసిపోతున్నారా..? అర్తం అయిపోయిందిలే.. సారు నువ్వు సగం సగం కాబోతున్నారన్న మాట. అర్థనారీశ్వరులు అన్నమాట అంటూ రాథోడ్‌ కూడా సిగ్గు పడుతుంటాడు. ఇంతలో పో రాథోడ్‌ నువ్వు నాకు దిష్టి పెట్టకు.. నువ్వు దిష్టి పెట్టిన ప్రతిసారి నేను ఆయన్ని దిష్టి తీయమని అడగలేను అంటుంది. ఊరుకో మిస్సమ్మ నువ్వు ఎన్ని సార్లు దిష్టి తీయమన్నా మా సారు తీస్తారు అంతే.. అయ్యో నిన్ను పొగడటంలో మునిగి దేవుడి సామాన్లు తెచ్చిందే చెప్పడం మర్చిపోయాను చూద్దాం పద అంటూ ఇద్దరూ బయటకు వెళ్లిపోతారు.

దూరం నుంచి అంతా చిత్ర, మనోహరి వింటుంటారు.  అయిపోయింది మను నువ్వు బ్యాగ్‌ సర్దుకుని వెళ్లిపోవడం బెటర్‌ అని చిత్ర చెప్పగానే.. ఎక్కడికి వెళ్లిపోవాలే అని మను అడుగుతుంది. కోల్‌కతాకు.. మను ఇక్కడుండి నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. బావగారు నీకు ఎప్పటికీ దక్కరని పూర్తిగా భాగీ సొంతం కాబోతున్నారని అర్థం అవుతుంది కదా..? ఏంటి మను నీకు ఇంకా అర్థం కాలేదా..? అని చిత్ర చెప్పగానే.. ఆ మాట ఇంకొక్కసారి అన్నావంటే.. నిన్ను చంపేస్తాను అంటుంది మను. ఉన్నమాటే కదా మను అంటుంది. నిజాన్ని యాక్సెప్ట్‌ చేయాలి అని చిత్ర చెప్పగానే.. ఏంటే నిజం నేను ఇన్నాళ్లు ఎదురుచూసింది.. అంటూ ఏదో చెప్పబోతుంటే..


మను నువ్వు ఇక ఎన్నాళ్లు వెయిట్‌ చేసినా నీ వయసు అయిపోతుంది తప్పా ప్రయోజనం లేదు. మను హాయిగా నువ్వు కొల్‌కతా వెళ్లి రణవీర్‌తో నీ కూతురును వెతుక్కో.. నీ టైం సేవ్‌ అయిపోతుంది అని చిత్ర చెప్పగానే.. మను కోపంగా నీ కోసం నేను ఎంత రిస్క్‌  చేశానో  చివరికి నాతోనే నువ్వు ఈ మాట అంటున్నావా..? అని మనోహరి కోపంగా చెప్పగానే.. నేను కూడా నీకు హెల్ప్‌ చేశాను మను. బట్‌ నో యూజ్‌ కదా..? ఇంకెన్నాళ్లని వాళ్లను చూసి కుళ్లుకుంటావు మను. ఎంచక్కా కోల్‌కతా వెళ్లి.. అంటూ చిత్ర ఏదో చెప్పబోతుంటే.. మనోహరి కోపంగా చిత్ర గొంతు పట్టుకుని పిసుకుతూ ఇంకొక్కసారి నీ నోటి వెంట రణవీర్‌, కోల్‌కతా. నా లైఫ్‌ అనే పదాలు వచ్చాయో.? నీకే లైఫ్‌ లేకుండా చేస్తాను అంటూ వార్నింగ్‌ ఇస్తుంది.

దీంతో చిత్ర మను వదులు మను..నీ వల్లే ఈ ఇంటికి కోడలు అయ్యాను. వినోద్‌కు భార్యను అయ్యాను. ఇప్పుడిప్పుడే ఒక షాపింగ్‌ మాల్‌కు ఓనరు అయ్యాను. ఫ్లీజ్‌ మను ఫ్లీజ్‌ నా డ్రీమ్స్‌ అన్ని ఒక్కోక్కటిగా ఫుల్‌ఫిల్‌ చేసుకుంటున్నాను.. అంటూ బతిమాలుతుంది చిత్ర. దీంతో మనోహరి కోపంగా ఏయ్‌ అవన్నీ పేకమేడలే నేను తలుచుకుంటే ఒక్క క్షణంలో వాటినంతటినీ కూల్చేయగలను.. నిన్ను మళ్ళీ రోడ్డు మీదకు తీసుకురాగలను.. అంటూ వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో చిత్ర వద్దు మను ఫ్లీజ్‌ అంటూ బతిమాలగానే.. మనోహరి కోపంగా చిత్రను వదిలేసి వెళ్లిపోతుంది.

తర్వాత  అమర్‌ ఇంట్లో గణపతి పూజ ప్రారంభం అవుతుంది. అందరూ రెడీ అయి పూజలో పాల్గొంటారు. ఆరు ఆత్మ మాత్రం ఒక దగ్గర కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు రణవీర్‌ ఇంట్లో ఉన్న చంభా పూజలు చేసి కాలాను అమర్‌ ఇంట్లోకి వెళ్లేలా చేస్తుంది. దీంతో కాలా అమర్‌ ఇంట్లోకి వెళ్లి ఆరు ఆత్మను బంధిస్తుంది. అప్పుడే అక్కడ పెద్దగా గణపతి ప్రత్యక్షమవుతాడు. గణపతిని చూసిన ఆరు హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Sandeep Reddy Love Story:  సినిమాటిక్ లెవల్ లో సందీప్ లవ్ స్టోరీ..మొత్తానికి బయట పెట్టాడుగా!

Telugu Serial : గ్యాస్ బండ పట్టుకొని.. ఐదో అంతస్తు మీద నుంచి జంప్.. అయినా ఏం కాలేదు.. ఇదెక్కడి సీరియల్ మామా!

Brahmamudi Serial Today September 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఒకరి గోడు ఒకరికి చెప్పుకున్న అపర్ణ, ధాన్యలక్ష్మీ – నవ్వుకున్న ఇంద్రాదేవి

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. శ్రీకర్ పై మర్డర్ కేసు.. మనసులోని అక్కసును కక్కేసిన శ్రీయా..

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ మాటకు ధీరజ్ షాక్.. నర్మద కోసం తెగించేసిన సాగర్.. వల్లికి కొత్త టెన్షన్..

GudiGantalu Today episode: మీనాకు ప్రభావతి క్లాస్.. రోహిణి కోరికను తీర్చిన మనోజ్.. పార్వతికి ఘోర అవమానం..

Big Stories

×