Intinti Ramayanam Vs Bramhamudi :తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కొన్నిటిలో ఎక్కువగా ఆడియన్స్ ను బాగా అలరించేవి అంటే టక్కున సీరియల్స్ పేరు వినిపిస్తుంది. ఎక్కువ మంది సీరియల్స్ ను చూసేందుకు ఇష్ట పడుతున్నారు. అందులోను ప్రముఖ తెలుగు ఛానెల్ స్టార్ మాలో ప్రసారం అవుతున్న పలు సీరియల్స్ ను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. అయితే ఈ మధ్య సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ దారుణంగా పడిపోయింది. టాప్ లో ఉందని అనుకున్న సీరియల్స్ ఒక్కసారిగా డౌన్ అవుతున్నాయి. లేటెస్ట్ గా వచ్చిన సీరియల్స్ దూసుకుపోతున్నాయి.. మరి ఈ వారం ఇంటింటి రామాయణం, బ్రహ్మముడిల పరిస్థితి ఎలా ఉంది? ఏ సీరియల్ టాప్ లో ఉందో ఒక్కసారి తెలుసుకుందాం..
ఇంటింటి రామాయణం..
ప్రేమ పెళ్లి వల్ల రెండు కుటుంబాల మధ్య అఘాతం ఏర్పడుతుంది. రెండు కుటుంబాలు ఇక జన్మలో కలవవు అని అనుకుంటారు. కానీ మళ్ళీ మరో ప్రేమ పెళ్లితో ఆ రెండు కుటుంబాలు కలిసిపోతాయి.. అయితే తాను ప్రేమించిన వ్యక్తి తనకు దక్కకుండా చేసిన కుటుంబం పై రివెంజ్ తీర్చుకోవాలని ఆ ఇంటి కోడలు అవుతుంది. అయితే ఆ ఇంటిని ముక్కలు చేస్తుంది ఆ కొత్త కోడలు. నా జీవితంలో సంతోషం లేకుండా చేసిన వాళ్ళందరి జీవితంలో సంతోషాన్ని మిగల్చకూడదు అని ఎత్తుకు పైఎత్తులు వేస్తూ కుటుంబంలో చికాకులు చిక్కులు తెచ్చిపెడుతుంది.. ఆ ఇంటికి పెద్ద కోడలుగా ఉన్న అవని తన ఇంటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది. మొన్నటివరకు అవనిపై మనస్పర్ధలు రావడంతో ఇంటికి దూరంగా ఉంది. కానీ ఇప్పుడు అవనిపై పార్వతి కోపాన్ని తగ్గించుకుంటుంది.. కోడలు ఏ తప్పు చేయలేదు నీకు తెలుసుకొని పశ్చాత్తాప పడుతుంది. ఇక పోయిన ఆస్తులు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉండడంతో ఇల్లంతా సంతోషంగా ఉంటారు. ఈ సీరియల్ రేటింగ్ విషయానికి వస్తే 12 పైనే ఉంది. ఈ వారము టాప్ లోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు..
బ్రహ్మముడి..
అనుకోని పరిస్థితులు అయినా సరే ఒక్కసారి భార్యాభర్తల మధ్య బ్రహ్మముడి పడితే ఆ బంధం ఎప్పటికీ దూరమవుదు అని ఒక అద్భుతమైన లైన్తో ఈ సీరియల్ స్టోరీ నడుస్తుంది. కుటుంబంలో ఎన్ని కలహాలు వచ్చినా సరే చివరికి భార్య భర్తలు ఒక్కటవ్వాల్సిందే అని ఎంతో చక్కగా సీరియల్ చెప్తుంది.. ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల గతం మర్చిపోయిన రాజ్ మళ్లీ గతం గుర్తుకు రావడంతో సీరియల్ మరో మలుపు తిరుగుతుంది. ఇన్ని రోజులు తన భర్త కోసం ఎదురుచూసిన కావ్య జీవితంలో సంతోషాలు వెల్లువెరుస్తాయి. ఈవారం ఈ సీరియల్ రేటింగ్ కూడా టాప్ లోనే ఉందని చెప్పాలి. మొన్నటి వరకు గజిబిజిగా ఉన్న స్టోరీ ఇప్పుడు ఒక ట్రాక్ లోకి వచ్చిందని జనాల నుంచి టాక్ వినిపిస్తుంది. దీని రేటింగ్ విషయానికి వస్తే 11 పైనే ఉంటుందని తెలుస్తుంది.
Also Read : సోమవారం సినిమాల సందడి.. ఏ ఒక్కటి మిస్ అవ్వకండి…
ఈ వారం విన్నర్ ఎవరు..?
ప్రతి వారం స్టార్ మా లో ప్రసారమవుతున్న ఏదో ఒక సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. అలాగే సెప్టెంబర్ 1న ఏ సీరియల్ టాప్ రేటింగ్ ను సొంతం చేసుకుంది అనే విషయం ఆసక్తిగా మారింది. కార్తీక దీపం 2 టాప్ లో ఉంది. ఆ తర్వాత ఇల్లు ఇల్లాలు పిల్లలు ఉంది. ఆ తర్వాత గుండెనిండా గుడిగంటలు ఉంది. నెక్స్ట్ ఇంటింటి రామాయణం ఉంది. ప్రస్తుతం ఈ సీరియల్ మళ్లీ ట్రాక్ లోకి రావడంతో రేటింగ్ పెరిగే అవకాశం ఉందని అంచనా.. బ్రహ్మముడి సీరియల్ ఈమధ్య కాస్త బోరింగ్ గా అనిపించింది.. ఇక ఇవాళ ఎపిసోడ్ నుంచి ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సీరియల్ తో పోలిస్తే ఇంటింటి రామాయణం సీరియల్ ఎప్పుడు టాప్ లోనే కొనసాగుతుంది. మరోవారం ఈ సీరియల్ రేటింగ్ ఏమైనా మారుతుందేమో చూడాలి.. అటు బిగ్ బాస్ కూడా ప్రారంభం కాబోతుంది. మరి సీరియల్స్ పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడాలి..