BigTV English

OTT Movie : అమ్మాయి అనుకుని ఆంటీని పెంచే జంట… ఆ పిల్ల ఇచ్చే ట్విస్ట్ మెంటల్ మాస్… ఈ సైకో పాప అరాచకం డోంట్ మిస్

OTT Movie : అమ్మాయి అనుకుని ఆంటీని పెంచే జంట… ఆ పిల్ల ఇచ్చే ట్విస్ట్ మెంటల్ మాస్… ఈ సైకో పాప అరాచకం డోంట్ మిస్
Advertisement

OTT Movie : హారర్ థ్రిల్లర్ అభిమానులకు చిల్లింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఒక సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా షాకింగ్ ట్విస్ట్‌లతో కేక పెట్టిస్తుంది. ఇందులోఒక జంట తొమ్మిది ఏళ్ళ వయసు అనిపించే 33 ఏళ్ళ అమ్మాయిని దత్తత తీసుకుంటారు. ఆతరువాత స్టోరీ, ఊహించని ట్విస్టులతో ఉత్కంఠభరితంగా నడుస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘ఆర్ఫన్’ (Orphan) 2009లో విడుదలైన అమెరికన్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ చిత్రం. ఇది జౌమ్ కొలెట్-సెర్రా దర్శకత్వంలో ఆలెక్స్ మేస్ కథ ఆధారంగా రూపొందింది. ఇందులో వెరా ఫార్మిగా (కేట్), పీటర్ సార్స్‌గార్డ్ (జాన్), ఇసాబెల్ ఫుర్‌మాన్ (ఎస్తర్), CCH పౌండర్, జిమ్మీ బెన్నెట్ (డానియల్), ఆర్యానా ఇంజనీర్ (మాక్స్) నటించారు. ఈ సినిమా 2009 జూలై 24న వార్నర్ బ్రదర్స్ ద్వారా విడుదలై, $20 మిలియన్ బడ్జెట్‌తో $78.3 మిలియన్ వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఫండాంగో ఎట్ హోమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో ఇది 7.0/10 రేటింగ్ ని పొందింది.


కథలోకి వెళ్తే

కేట్, జాన్ అనే దంపతులకు తమ మూడవ బిడ్డ గర్భంలో చనిపోవడంతో దుఃఖంలో మునిగిపోతారు. కేట్ ఒక మ్యూజిక్ ప్రొఫెసర్. దీని వల్ల ఆమె మద్యపానానికి అలవాటుపడుతుంది. కొంతకాలం తరువాత ఈ వ్యసనం నుండి కొలుకుంటుంది. ఇక ఆ బాధ నుంచి తెరుకోవడానికి సెయింట్ మరియానా అనాథ ఆశ్రమం నుండి 9 ఏళ్ల ఎస్తర్ అనే రష్యన్ అమ్మాయిని దత్తత తీసుకుంటారు. ఎస్తర్ తన పెయింటింగ్‌లు, పియానో ప్రతిభ , పరిణతి చెందిన ప్రవర్తనతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆమెను ఇంటికి తెసుకెళ్లాక అసలు స్టోరీ మొదలవుతుంది. ఈ జంటకు మాక్స్ అనే కుమార్తె, డానియల్ అనే కొడుకు ఉంటారు. ఎస్తర్ తో మాక్స్ కాస్త క్లోస్ గా మేలుగుతుంది. అయితే డానియల్ ఎందుకనో ఎస్తర్ ను అసహ్యించుకుంటాడు. కేట్‌కు ఎస్తర్ ప్రవర్తనపై అనుమానం వస్తుంది. ఎస్తర్ ను దత్తత ఇచ్చిన సిస్టర్ అబిగైల్, ఎస్తర్ చుట్టూ ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరిస్తుంది. ఆమెను దత్తత తీసుకున్న గత కుటుంబం, ఒక అగ్నిప్రమాదంలో చనిపోయిందని చెబుతుంది. ఈ సమయంలో ఎస్తర్, అబిగైల్‌ను హత్య చేసి, మాక్స్‌ను బెదిరించి శవాన్ని దాచడంలో సహాయం చేయమని ఒత్తిడి చేస్తుంది.

మరోవైపు ఎస్తర్ గతాన్ని కేట్ తెలుసుకోవడం ప్రారంభిస్తుంది. ఆమె సార్న్ ఇన్‌స్టిట్యూట్ అనే మానసిక ఆసుపత్రి నుండి వచ్చినట్లు తెలుస్తుంది. అబిగైల్ హత్య గురించి తెలుసుకున్న డానియల్, ఆధారాల కోసం ట్రీహౌస్‌లో వెతుకుతాడు. కానీ ఎస్తర్ అతన్ని చంపేందుకు ట్రీహౌస్‌కు నిప్పు పెడుతుంది. ఇంతలో మాక్స్ డానియల్‌ను రక్షిస్తుంది. కేట్, సార్న్ ఇన్‌స్టిట్యూట్ నుండి డాక్టర్ తో మాట్లాడి, ఎస్తర్ వాస్తవానికి 33 ఏళ్ల లీనా క్లామర్ అని, హైపోపిట్యూటరిజం వల్ల పిల్లలా కనిపిస్తూ, ఏడు హత్యలకు పాల్పడిన మానసిక రోగిని అని తెలుసుకుంటుంది. ఎస్తర్, జాన్‌ తో సన్నిహితంగా గడపడానికి ప్రయత్నిస్తుంది. అతను అందుకు నిరాకరించడంతో అతన్ని కూడా హత్య చేస్తుంది. క్లైమాక్స్‌లో కేట్, ఎస్తర్ మధ్య జరిగే ఉత్కంఠభరిత పోరాటంతో ఈ కథ ముగుస్తుంది. మరి ఈ పోరాటంలో ఎవరు గెలిచారు ? ఎస్తర్ మిగతా వాళ్ళని చంపుతుందా ? ఎస్తర్ ని కేట్ ఎలా ఎదుర్కుంటుంది ? అనే విషయాలను ఈసినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : కూతురి చావుకి ప్రెగ్నెన్సీ తో రివేంజ్… ప్రాణాల మీదకి తెచ్చే దొంగతనం… నరాలు తెగే ఉత్కంఠ

Related News

OTT Movie : పిల్లాడికి కాకుండా పిశాచికి జన్మనిచ్చే తల్లి… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

OTT Movie : బేస్మెంట్లో బంధించి పాడు పని… కూతురిని వదలకుండా… షాకింగ్ రియల్ స్టోరీ

OTT Movie : అక్క బాయ్ ఫ్రెండ్ తో చెల్లి… నరాలు జివ్వుమన్పించే సీన్లు మావా… ఇయర్ ఫోన్స్ మాత్రం మర్చిపోవద్దు

OTT Movie : బాయ్ ఫ్రెండ్ తో ఒంటరిగా గడిపే అమ్మాయిలే ఈ కిల్లర్ టార్గెట్… వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ మావా

OTT Movie : వరుసగా అమ్మాయిలు మిస్సింగ్… ప్రొఫెసర్ ముసుగులో సైకో వల… సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 8 ఏళ్ల తరువాత థియేటర్లలోకి… నెలలోపే ఓటీటీలోకి 170 కోట్ల హిలేరియస్ కోర్ట్ రూమ్ డ్రామా

OTT Movie : జంప్ అవ్వడానికి ట్రై చేసి అడ్డంగా బుక్… ఇష్టం లేకుండానే ఆ పని… తెలుగు మూవీనే మావా

OTT Movie : అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘కాంతారా చాఫ్టర్ 1’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

Big Stories

×