E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today September 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు షాక్‌ ఇచ్చిన రణవీర్

Nindu Noorella Saavasam Serial Today September 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌కు షాక్‌ ఇచ్చిన రణవీర్
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌ టెర్రస్‌లో నిలబడి ఆలోచిస్తుంటాడు. ఇంతలో మిస్సమ్మ వస్తుంది. ఏంటండి ఈ టైంలో ఏం  ఆలోచిస్తున్నారు అక్క గుర్తుకు వచ్చిందా..?  అని అడుగుతుంది. కాదు అంటాడు అమర్. మరి దేని గురించి ఆలోచిస్తున్నారు అని మిస్సమ్మ అడగ్గానే.. రణవీర్‌ గురించి అని చెప్తాడు అమర్‌.

ఇప్పుడు రణవీర్‌ గురించి ఆలోచించడం ఏంటి అని అడుగుతుంది మిస్సమ్మ.. రణవీర్‌ చెప్పినదాన్ని బట్టి తన వైఫ్‌ డాటర్‌ ఒకేసారి మిస్‌ అయ్యారు.. కానీ రణవీర్‌ వైఫ్‌ను వెతకడం మానేసి కూతురును మాత్రమే వెతుకుతున్నాడు. రణవీర్‌ తన వైఫ్‌ను స్కిప్ చేస్తున్నాడు అంటే రణవీర్‌ వైఫ్‌ పక్కనే ఉండి ఉంటుంది. లేదా తను ఎక్కడ ఉందో తెలిసి ఉంటుంది అని చెప్తాడు. దీంత మీరు రణవీర్‌ వైఫ్‌ గురించి సర్చ్‌ చేశారు.. కదా ఏమైంది అని అడుగుతుంది మిస్సమ్మ. ఒక్కసారి కాదు రెండు సార్లు ట్రై చేశాం కానీ తను ఎవరో తెలియలేదు ఎలాగైనా తను ఎవరో కనిపెట్టాలి అని అమర్‌ చెప్తాడు. మరోవైపు  కింద తన రూంలోంచి హాల్లోకి వస్తుంది మనోహరి. చాలా రోజుల తర్వాత అర్ధ్రరాత్రి పూట ఇల్లు చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. కచ్చితంగా ఆరు ఆ చంభా బంధీ నుంచి బయట పడే ఉంటుంది. వెంటనే చంభా దగ్గరకు వెళ్లాలి. ఈ సారి చిత్రను కూడా తీసుకెళ్తాను అని పైకి వెళ్తుంది.

Advertisement

పైన మిస్సమ్మ అది చాలా సింపుల్‌ అండి అంజును రణవీర్‌కు ఇచ్చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ గా అతని వైప్‌ ఎవరో బయటకు వచ్చేస్తుంది అని చెప్తుంది. దీంతో అమర్‌ కోపంగా ఏం మాట్లాడుతున్నావు భాగీ పిచ్చేమైన పట్టిందా..? భాగీ.. అంజును ఇచ్చేయమంటున్నావా..? పుట్టగానే కన్న బిడ్డను అనాథ శరణాలయంలో వదిలేసిన అలాంటి దయలేని తల్లి చేతుల్లో అంజును పెట్టమంటున్నావా..? ఆస్థి కోసం కన్న బిడ్డను అడ్డు పెట్టుకోవాలని చూస్తున్న  రణవీర్‌ లాంటి స్వార్థ పరుడుకి అంజును అప్పగించమంటున్నావా..? సెన్స్‌ ఉండే మాట్లాడుతున్నావా..? భాగీ అంటూ అమర్‌ కోప్పడగానే.. నేను అంజును అంటే అంజును కాదండి ఒక ఫేక్‌ కూతురును ఇద్దామంటున్నాను అని చెప్తున్నాను అంటుంది. అబద్దపు కూతురా.? అని అమర్‌ అడగ్గానే.. అవునండి అనాథ శరణాలయంలో నేను ఒక పాపను చూశాను. చాలా యాక్టివ్‌ గా ఉంది. తనని రణవీర్‌ కూతురుగా ఎంటర్‌ చేయిద్దాం. తనే నీ కూతురు అని మీరు ఆ పాపని రణవీర్‌ దగ్గరకు చేరేలా చేయాలి. పాపను తీసుకుని రణవీర్‌ కోల్‌కతా బయలుదేరుతాడు.

అప్పుడు రణవీర్‌ వైఫ్‌ బయటకు వస్తుంది అని చెప్తుంది మిస్సమ్మ. దీంతో ఎవరో పాప తన పాప అని రణవీర్‌ ఎలా నమ్ముతాడు అని అమర్‌ అడగ్గానే.. అంజును తన పాప ఎలా అని నమ్మారో ఈ పాపను కూడా తన కూతురని నమ్మించాలి. పాప బయలాజికల్‌ ఎవిడెన్స్‌ అన్ని రణవీర్‌కు మ్యాచ్‌ అయితే సరిపోతుంది కదా..? అంటూ మిస్సమ్మ చెప్పగానే.. అలా చేయోచ్చు భాగీ కానీ ఆ పాప రణవీర్‌ దగ్గర ఉండటం పాపకు సేఫ్ కాదు. ఆస్థి తన చేతికి వచ్చిన మరుక్షణం రణవీర్‌ వల్ల పాపకు చాలా ప్రమాదం అని అమర్‌ చెప్పగానే మనం అంతదూరం ఎందుకు వెళ్లనిస్తామండి.. పాప తన కూతురు అని రణవీర్‌ కన్ఫం అయిన మరుక్షణం రణవీర్‌ వైప్‌ తెర మీదకు వస్తుంది అని మిస్సమ్మ చెప్పగానే.. ఇంత రిస్క్‌ అవసరమా అని అమర్‌ అడగ్గానే.. వేరే వాళ్లకు అయితే రిస్క్‌ మీకు కాదు కదా అని చెప్తుంది. దీంతో అమర్‌ సరే ఈ ప్లాన్‌ ఎగ్జిక్యూట్‌ చేద్దాం అంటాడు.

Advertisement

తర్వాత అమర్‌ తమ ఆఫీసుకు రణవీర్‌ను పిలిపిస్తాడు. టెన్షన్‌తో అమర్‌ ఆఫీసుకు వచ్చిన రణవీర్‌ భయపడుతూ కూర్చుని ఉంటాడు. ఇంతలో అక్కడికి అమర్‌ వస్తాడు. దీంతో భయంగానే అసలు నన్ను ఎందుకు రమ్మన్నారు అని రణవీర్‌ అడగ్గానే.. మీ అమ్మాయి దొరికింది రణవీర్‌ అంటూ అమర్‌ చెప్తాడు. అమర్‌ మాటలకు రణవీర్‌ షాక్‌ అవుతాడు. ఎగ్జైట్‌మెంట్‌ అవుతున్నట్టు నటిస్తూ.. నిజమా అమర్‌ నా కూతురు దొరికిందా..? అని అడుగుతాడు. ఎస్‌ దొరికింది నిజమే.. అని అమర్‌ చెప్పగానే.. థాంక్స్‌ అమరేంద్ర గారు.. అని రణవీర్‌ చెప్పగానే.. ఇంతకీ మీ పాప దొరికిన విషయం మీ వైఫ్‌కు చెప్పరా..? అని అమర్‌ అడగ్గానే.. యా కచ్చితంగా చెప్తాను.. అంటూ వెంటనే ఫోన్‌ తీసి కాల్‌ చేయబోయి ఆగిపోతాడు రణవీర్‌. దీంతో అమర్‌ మీ వైఫ్‌ ఎక్కడుందో మీకు తెలుసు అన్నమాట అని అడగ్గానే రణవీర్ షాక్‌ అవుతాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

చీరకట్టులో శివజ్యోతి..ఆ భారీ హారం చూస్తే మతిపోవాల్సిందే!

ఈశ్వర్ సాయి కేసులో కొత్త ప్రశ్న.. ‘పెళ్లైనోడిని ఎలా నమ్మావ్ మాధురి?’

స్టార్ హీరోల సినిమాల కంటే సీరియల్స్‌కే ఎక్కువ క్రేజ్.. అసలు సీక్రెట్ ఏంటి?

పిచ్చి కుక్కల్లా మొరగండి… ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన శిరీష!

నాని ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన శ్రీముఖి.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 2nd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు రెడీగా ఉన్న రౌడీలు

Godavari Janu : హాట్ లుక్ లో రెచ్చగొడుతున్న నిత్య.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మ..!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు షాకిచ్చిన నీలకంఠం.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక.. పాపం బాలు..

Big Stories

Advertisement
×