Podarillu Today Episode April 27th : చీకటిలో ఎవరు వస్తున్నారని మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. గాయత్రి అక్కడికి రాగానే మహాలక్ష్మి అని అంటుంది. గాయత్రీ నువ్వేంటి ఈ టైం లో వచ్చావు అని మహాలక్ష్మి అడుగుతుంది. మర్చిపోలేక చచ్చిపోలేక ఇలా వచ్చాను అని గాయత్రి అంటుంది. నేను లోపలికి రావచ్చా అని మహాలక్ష్మిని అడగగానే నువ్వెందుకు రాకూడదు లోపలికి వచ్చేసి అని అంటుంది. ఈ టైంలో ఇక్కడికి వచ్చావు అని అందరూ అడుగుతారు. బావని మర్చిపోలేక ఇక్కడికి వచ్చాను రేపు నా పెళ్లి కాబట్టి ఆ పెళ్లి చేసుకోకూడదని ఇక్కడికి వచ్చాను అని గాయత్రి అంటుంది.
గాయత్రి ఇంట్లోకి రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. నువ్వెందుకు వచ్చావు. రానంటావు ప్రేమిస్తున్నానంటావు పెళ్లి చేసుకోవాలి అంటావు. ధైర్యం చేసి రావాలి అంటే రాలేను అంటావు అలాంటి దాన్ని నువ్వు ఎప్పుడూ మళ్ళీ ఎందుకు వచ్చావు అని చక్రి కేశవ ఇద్దరు కూడా గాయత్రిని చెడ మాడా తిట్టేస్తారు. రాకూడదు అని ఉన్నాను కానీ బావని వదిలిపెట్టి ఉండలేకపోతున్నాను అని గాయత్రీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. గాయత్రి మాటలు విన్న మాధవ్ రూమ్ లో నుంచి బయటికి వస్తాడు. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు. మీ అమ్మ చూస్తే మమ్మల్ని చంపేస్తుంది వెళ్ళిపో అని మాధవ్ అంటాడు. ఇక నారాయణ చక్రి ఇద్దరూ కూడా వెనుక గుమ్మం మూసేశాము. ముళ్ళ కంప కూడా పెట్టాము అందుకని నువ్వు ముందు డోర్ నుంచి వచ్చావా? అసలు ఎందుకు వచ్చావే నువ్వు అని నారాయణ గాయత్రి ని అరుస్తాడు. మీరు నన్ను తిట్టినా కొట్టిన నేను బావని మర్చిపోలేక పోతున్నాను అని నిజం చెప్పేస్తుంది.
రేపు తెల్లారితే నా పెళ్లి. ఆలోపే నేను బావని పెళ్లి చేసుకోవాలని ఇక్కడికి వచ్చాను అని గాయత్రి చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మీరైనా చెప్పండి నేను బావని కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని గాయత్రి ఎంత చెప్తున్నా సరే అందరూ కూడా తన పిరికిగా ఆలోచిస్తుంది అని అనుకుంటారు. కన్నా నుంచి చక్రి వరకు అందరినీ పేరుపేరునా గాయత్రి అడుగుతుంది. నారాయణ దగ్గరికి వెళ్లి నేను బావను పెళ్లి చేసుకుంటాను నా కోరిక తీర్చు మావయ్య అని అడుగుతుంది.. నువ్వు ధైర్యంగా నిలబడతానంటే నీ పెళ్లి నేను చేస్తానని నారాయణ కఠినంగా అడుగుతాడు. గాయత్రీ ఒప్పుకోవడంతో నారాయణ మాధవ చేతిలో గాయత్రిని పెడతాడు.
పెళ్లికంత రెడీ కానీ ఇప్పుడు వాళ్ళందరూ పెళ్లికి సిద్ధం చేసుకుని ఉన్నారు మనం పెళ్లి పనులు ఎక్కడ చేయాలి? ఏంటి అని మహాలక్ష్మి అంటుంది. ఎక్కడ పెళ్లి చేయాలి అని మహాలక్ష్మి అడుగుతుంది.. ఇంట్లోకి ఏ ఆడది రాదు అని దీని తల్లి శాపం పెట్టింది కదా అదే ఇంట్లో ఇప్పటికిప్పుడే పెళ్లి జరుగుతుంది అని నారాయణ అంటాడు. ఇక తమ్ముళ్లు అందరూ కలిసి నారాయణ చెప్పినట్లుగా మాధవ్ నీ పెళ్ళికొడుకుగా తయారుచేసి తీసుకొని వస్తారు.. నేను ఇది ఇంకా నమ్మలేకపోతున్నాను అని మాధవ్ అంటున్న సరే అందరూ కూడా మాధవ్ కి నచ్చజెప్పి తాళికట్టుమని చెప్తారు. అప్పుడే ఇంట్లోకి పురుషోత్తం తయారు సడన్గా ఎంట్రీ ఇస్తారు.
నా కూతుర్ని మాయ మాటలు చెప్పి అక్కడి నుంచి తీసుకొని వచ్చారా అని తాయారు పురుషోత్తం పెద్ద రచ్చ చేస్తారు.. నువ్వు ముందు రావే ఇలాంటి ఇంట్లో నువ్వెలా ఉంటావే అని తాయారు గాయత్రి నీ లాక్కొని వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంది కానీ గాయత్రి మాత్రం నన్ను వదులు. నేను ఇక్కడే ఉంటాను అని గట్టిగా అరుస్తుంది దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మన ఇంటి గురించి మన గురించి ఇది ఎప్పటిలాగే తప్పుగా మాట్లాడుతుంది. ఇది పెట్టిన శాపం పోయేలా ఈ ఇంట్లో నేను గాయత్రి మెడలో తాళి కట్టాలి అని నారాయణ అంటాడు.. దాని కూతుర్ని ఇంటి కోడలుగా మార్చు అప్పుడే దీని నోరు మూతపడుతుంది అని అనగానే పురుషోత్తం ఒక్కసారిగా మానవుని కొట్టడానికి వస్తాడు.. కేశవ అందరూ కలిసి ఒక్కసారిగా గొడవకు దిగుతారు..
గాయత్రీ నేను చేసుకుంటే బావనే పెళ్లి చేసుకుంటాను అని తెగేసి చెప్పేస్తుంది.. మహాలక్ష్మి కూడా గాయత్రి పెళ్లి మాధవ్ తోనే జరుగుతుంది అని చెప్పడంతో అందరూ కూడా ఒక సరిగా షాక్ అవుతారు.. గాయత్రి నిర్ణయాన్ని మార్చుకోదని తెలుసుకున్న పురుషోత్తం మాధవ్ ని లోపలికి తీసుకొని వెళ్లి మాట్లాడాలి అని అనుకుంటాడు. అందరూ వద్దంటున్నా సరే మాధవ్ మాత్రం లోపలికి వెళ్లి మాట్లాడుతాను అని అంటాడు. లోపలికి వెళ్ళగానే మాధవ్ కాళ్లు పట్టుకుంటాడు పురుషోత్తం. తన బాధని చెప్తాడు.. నాకు ఉన్నది ఒకటే కూతురు ఆస్తిని సంపాదించిందంతా తన కోసమే అని పురుషోత్తమంటాడు. నా పరువు పోయేలా చేయదు అని ఎంతగా బ్రతిమలాడుతాడు. నేను మీ అత్త బంధువులకి మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకుంటాము అని బెదిరిస్తాడు. ఆ మాట వినగానే మాధవ్ షాక్ అవుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..