E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode April 27th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రోడ్డు పక్కన పుట్ పాత్ మీదకు చేరిన చంభా బతుకు   

Nindu Noorella Saavasam Serial Today Episode April 27th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రోడ్డు పక్కన పుట్ పాత్ మీదకు చేరిన  చంభా బతుకు   
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి నిద్ర లేచి వెంటనే ఫోన్‌ చూస్తుంది. చంభా మిస్స్‌డ్‌ కాల్స్‌ ఉంటాయి. అవి చూసి షాక్‌ అవుతుంది. ఇదేంటి చంభా నైట్‌ నుంచి ఇన్నికాల్స్‌ చేసింది కొంపదీసి పోయిందా..? అనుకుంటూ వెంటనే చంభాకు ఫోన్‌ చేస్తుంది మనోహరి. ఒక దగ్గర రోడ్డు పక్కన పడుకుని ఉన్న చంభా ఫోన్‌ లిఫ్ట్‌ చేసి ఏడుస్తూ.. మనోహరి అంటుంది. దీంతో ఏయ్‌ ఏంటి చంభా పొద్దున్నే ఎందుకు ఏడుస్తున్నావు అనగానే.. మరేం చేయాలి రాత్రి నుంచి నీకు ఎన్నిసార్లు ఫోన్‌ చేశాను అంటుంది. దీంతో మనోహరి ఫోన్‌ సైలెంట్‌ లో ఉంది చూసుకోలేదు అని చెప్పగానే.. చంభా ఏడుస్తూనే నేను అక్కడి నుంచి వచ్చేయగానే.. నన్ను మర్చిపోయావు మనోహరి. నేను నీకు ఎన్నిసార్లు హెల్ప్‌  చేశాను అంటూ ఏడవగానే..

నేను నిన్ను ఎందుకు మర్చిపోతాను చంభా.. అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు.. అని అడగ్గానే.. అయ్యో నా కష్టం గురించి నీకెందుకు మనోహరి. నాకు ఇప్పుడు ఆ ఇంటి విలువ బాగా తెలిసింది అంటూ చంభా చెప్పగానే.. మనోహరి ఆశ్చర్యంగా ఇంటి విలువ తెలియడం ఏంటి..? రాత్రంతా ఎక్కడ ఉన్నావు..? అని అడగ్గానే.. చంభా రాత్రి ఆ ఇంటి నుంచి వచ్చానా..? పడుకోవడానికి ఎక్కడా చోటు దొరకలేదు.. చివరికి పుట్‌పాత్‌ మీద పడుకుందామని అనుకుంటే.. అంటూ రాత్రి తనకు జరిగిన విషయం చెప్తుంది. పుట్‌పాత్‌ మీద  ఎక్కడ పడుకుందామనుకున్నా ఎవరో ఒకరు వచ్చి తనను అక్కడి నుంచి  తరిమేసిన విషయం చెప్తుంది. దీంతో మనోహరి బాధగా నీ దరిద్రం పగవాడికి కూడా రాకూడదు చంభా అయినా వాళ్లకు వంద ఇచ్చే బదులు వెయ్యి రూపాయలు ఇచ్చి ఏ హోటల్‌ లోనో రూం తీసుకుని ఉండొచ్చు కదా..? అమర్‌ నీకు రెండు నెలల శాలరీ ఇచ్చాడు కదా అనగానే..

Advertisement

ఇది నాకు తట్టనే లేదు మనోహరి.. కానీ ఆ ఇంటి విలువ ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది మనోహరి. ఇన్నాళ్లు మూడు పూటలు తింటూ హాయిగా ఉన్నాను. బయట బతకడం ఎంత నరకమో ఒక్కరాత్రిలో తెలిసి వచ్చింది మనోహరి అని చెప్పగానే.. మనోహరి మాత్రం ఇంతకు ముందు కలకత్తాలో పెద్ద మంత్రగత్తెలాగా ఒక వెలుగు వెలిగావు కదా ఇప్పుడెందుకు బీద అరుపులు అరుస్తున్నావు.. ఇప్పుడు ఏ పని చేతకాదా ఏంటి..? అని అడగ్గానే.. చంభా ఏడుస్తూ.. ఈ ఐదేళ్లలో నాకు వచ్చిన మంత్రాలన్నీ మర్చిపోయాను. ఎప్పుడూ నీ వెంట ఉంటూ నువ్వు చెప్పిన పని చేయడం తప్పా వేరే పనే చేయలేదు. ఒక్కరాత్రితో నా జీవితం తలకిందులు అయిపోయింది. మనోహరి ఈ కష్టాలు నాకు వచ్చాయి కాబట్టి సరిపోయింది. అదే నా పరిస్థితి నీకు వస్తే ఒక్కరాత్రి కాదు కదా ఒక్క నిమిషం కూడా బతకలేవు.. అనగానే..

మనోహరి కోపంగా ఏయ్‌ ఏంటి..? నీ పరిస్థితి నాకు వస్తుందని భయపెడుతున్నావా..? లేక నీలా నాకు అవ్వాలని శపిస్తున్నావా..? అనగానే.. చంభా నా బాధ చెప్తున్నాను మనోహరి. ఇలా బతకడం నా వల్ల కాదు. నువ్వు ఏదో ఒకటి చేసి మళ్లీ నన్ను ఆ ఇంటికి తీసుకెళ్లు  అని అడగ్గానే.. కాస్త ఓపిక పట్టు చంభా ఏదో ఒకటి చేసి నిన్ను ఇంటికి తీసుకొస్తాను. నువ్వు లేకపోతే నాకు కష్టంగా ఉంది. కుదిరితే ఈ రోజే నిన్ను ఎలాగైనా తీసుకొస్తాను. అని చెప్పగానే.. చంభా నవ్వుతూ ఈ రోజేనా..? అమరేంద్ర సారు ఒప్పుకుంటారా..? అని అడగ్గానే.. పిచ్చి దానా ఐదేండ్లు దూరం అయిన భాగీనే తీసుకురావడానికి అమర్‌ ను ఒప్పించిన దాన్ని.. నీ కోసం ఒప్పించలేనా..? అనగానే.. చంభా ఏడుస్తూ.. సరే మనోహరి నీ పిలుపు కోసం ఏదురుచూస్తూ ఉంటాను అనగానే.. సరే వెయిట్‌ చేయ్‌ కానీ పదే పదే ఫోన్‌ చేయకు అంటూ కాల్‌ కట్‌ చేస్తుంది మనోహరి. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Big Stories

Advertisement
×