E-Paper
Advertisement

Podarillu Today Episode : శైలుకు దిమ్మతిరిగే ట్విస్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న గాయత్రి.. మాధవ్ పెళ్లి కోసం మహా నిర్ణయం..?

Podarillu Today Episode : శైలుకు దిమ్మతిరిగే ట్విస్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న గాయత్రి.. మాధవ్ పెళ్లి కోసం మహా నిర్ణయం..?
Advertisement

Podarillu Today Episode March 19th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఇద్దరినీ వాళ్ళ పేరెంట్స్ విడగొట్టాలని చూస్తున్నారు మీరే దగ్గర ఉండి దేవుడు లాగా కలపాలి అని చెప్తాడు. ఇక నాకు వదిలేసేయ్.. నేను చూసుకుంటాను అని అతను చెప్పి వెళ్ళిపోతాడు.. మీరు ఎలాగైనా సరే మా ఇద్దరిని విడిపోకుండా చూడాలి సార్ అని చక్రి అంటాడు. మీరు విడాకులు తీసుకోకుండా నేను చూసుకుంటాను కానీ నువ్వు మాత్రం మా నాన్న పేరుని పెట్టుకోవడానికి ప్రయత్నించు అని చక్రిత్తో అంటాడు.. ఇక మొత్తానికి చక్రి మాట విన్న కానిస్టేబులు మహాతో నేను చెప్తానని చెప్తాడు. ఇక తర్వాత ఆధార్ కార్డు లేనిది ఎలా ఇవన్నీ జరుగుతాయి అని ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక ఆధార్ కార్డు గోల ఎక్కడికి వెళ్లినా నాకు తప్పడం లేదు అని అంటాడు..

ఎలాగైనా సరే ఈ విషయం గురించి వదినతో చెప్పాలి అని మహా అనుకుంటుంది. కానిస్టేబుల్ మహాలక్ష్మికి ఫోన్ చేసి మీరిద్దరు విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారట. మీకు విడాకులు ఇవ్వాలని అనుకున్నా లాయరు నాకు ఫోన్ చేసి చెప్పాడు. మేము ఐజీని కూడా కాదని మీ వాళ్ళు ఎంతగా మమ్మల్ని టార్చర్ చేసిన సరే తట్టుకొని మీ ఇద్దరి పెళ్లి చేసాము.. అలాంటిది రెండు నెలలు కూడా కాపురం చేయకుండానే విడాకులు తీసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు అని కానిస్టేబుల్.. కేశవ వీళ్ళిద్దరి గురించి విని ఏదో జరుగుతుంది అని అనుకుంటాడు. శైలు మాత్రం కేశవ దగ్గర ఫోన్ ఎలాగైనా కొట్టేయాలి అని ప్లాన్ చేస్తుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శైలు తన ఫ్రెండుతో కలిసి వెళుతూ ఉంటుంది కేశవాగ్ని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలని ఆలోచిస్తుంది. కేశవ కి బుద్ధొచ్చేలా చేయాలి అప్పుడే వాడు నా జోలికి రాడు అని అనుకుంటుంది.. అయితే అప్పుడే తన ఫ్రెండు బండి చెడిపోవడంతో అక్కడ దగ్గరలో ఉన్న మెకానిక్ దగ్గరికి వెళ్తారు అయితే ఆ మెకానిక్ షాపు కేశవాది.. కేశవ ఈ గొంతు ఎక్కడ విన్నట్లు ఉంది అని అనుకుంటాడు. అయితే అక్కడ ఒక రెండు నిమిషాలు అండి అని కేశవ అంటాడు.. ఇక పక్కకు వెళ్లి ఎలాగైనా సరే ఈ ప్లాను అమలు చేసి వాటి దగ్గర నుంచి ఫోన్ కొట్టేయాలి అని శైలు అంటుంది.. ఇలాంటి మగాడైనా సరే అమ్మాయిలు అలా మాట్లాడితే ఇట్టే కరిగిపోతాడు అని అంటుంది. ఒసేయ్ బుస్సు నా మీద నువ్వు ఇలాంటి ప్లాన్లు వేస్తున్నావా చెప్తా నీకు అని కేశవ కూడా తనకి రివర్స్లో దిమ్మ తిరిగిపోయే షాక్ ఇవ్వాలని అనుకుంటాడు.

శైలుకి ఎలాగైనా సరే దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇవ్వాలని అనుకుంటాడు. ఇక కన్నా మహా ఇద్దరు కూడా గుడికి వెళ్తారు అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు.. నువ్వు ఏం కోరిక కోరుకున్నావో చెప్పు వదినా అని కన్న అడుగుతాడు. మనసులో కోరుకున్న కోరికను బయటకు చెప్తే నెరవేరదట. అందుకే చెప్పట్లేదు అని మహా అంటుంది అయితే ఎవరు చెప్పారు వదిన నీకు అని కన్నా అడుగుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన గాయత్రి నేనే చెప్పాను రా అని అనగానే వదిన అంటాడు.. ఎవరెవరితో మాట్లాడాల్సి వస్తుంది పద వదిన వెళ్ళిపోదామని కన్న ఎంత కన్న సరే మహా మాత్రం అలా అనకు రాని అంటుంది..

Advertisement

నేను మీ అన్నయ్య మీద కేసు పెట్టినట్లు నన్ను అంటున్నావ్ ఏంట్రా.. నామీద కోపంగా ఉన్నావేంటి అని గాయత్రి అడుగుతుంది.. మా అమ్మ నాన్న బావ మీద కేసు పెడితే నేనేదో పెట్టాను అని నా మీద కోపంగా ఉంటావ్ ఏంట్రా నీ గాయత్రి బాధపడుతుంది. గాయత్రి ఎంత చెప్తున్నా సరే మీరు చాలా మంచివాళ్ళండి మీ గురించి మేము ఎందుకు తప్పుగా అనుకుంటాము.. మీలాంటి మంచి వాళ్ల గురించి మేము ఎంత మాట్లాడిన తప్పే అనేసి గాయత్రితో కన్నా మాట్లాడుతాడు.. బయట వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు రా వదినా అనేసి కన్నా బయటకు వెళ్ళిపోతాడు.

గాయత్రి వాడి కోపంలో తప్పులేదు. కానీ నా బాధను మాత్రం ఎవరు అర్థం చేసుకోవడం లేదు అని గాయత్రి బాధపడుతుంది.. నేను చిన్నప్పటినుంచి మా బాబే ప్రాణంగా పెరిగాను. కానీ ఇప్పటికీ నాకు పెళ్లి వయసు వచ్చి దాటిపోతున్న సరే మా బావని నా భర్తగా ఊహించుకున్నాను. కానీ అది ఎవరు అర్థం చేసుకోవడం లేదు అని గాయత్రీ కన్నీళ్లు పెట్టుకుంటుంది.. ఇక శైలు పిలవడంతో కేశవ రెస్టారెంట్ కి వెళ్తాడు. అయితే అక్కడ శైలు మాటల్లో పెట్టి కేశవ దగ్గర ఫోన్ కొట్టేయాలని ఆలోచిస్తుంది. కానీ ఆమె పప్పులేవి అక్కడ ఉడకవు.. కానీ దమ్మి ఫోన్ ని మార్చేసి ఒరిజినల్ ఫోన్ ని కేశవ తీసుకొని వెళ్ళిపోతాడు.. అది చూసిన శైలు దిమ్మతిరిగిపోయేలా షాక్ అవుతుంది.. ఇక తర్వాత మహాలక్ష్మి ఇంట్లో వంటరిగా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది..

Also Read :మళ్ళీ ఫిట్టింగ్ పెట్టేసిన వల్లి.. బాధపడిన ప్రేమ.. విశ్వంను అరెస్ట్ చేసిన పోలీసులు..

ఇక్కడికి వచ్చిన కన్నా ఏంటి వదిన బాధపడుతున్నావా అని అడుగుతాడు.. ఎవరైనా గుర్తొచ్చారా ఎందుకు మీరు అలా ఉన్నారు అని కన్నా అడుగుతాడు.. నాకు మా అన్నయ్య కూతురు సిరి గుర్తుకొస్తుంది దానికి కూడా నేను గుర్తుకొస్తానేమో అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే మాధవ ఇంట్లోకి వస్తాడు.. మాధవ తలనొప్పిగా ఉంది అని చెప్పగానే మహాలక్ష్మి వెళ్లి కాఫీ తీసుకొని వస్తానని అంటుంది..ఈ మధ్య నువ్వు నీలో నువ్వే లేవు గాయత్రీ కి పెళ్లి అయిపోతుందని నువ్వు బాధపడుతున్నావా అని అడుగుతుంది.. గాయత్రి ని మర్చిపోలేకపోతున్నారు కదా అని అడగడంతో మాధవ్ బాధపడతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో కేశవ చక్రిమహాలు డివోర్స్తీసుకోవాలనుకున్న విషయాన్ని ఇంట్లో చెప్తాడు. ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×