E-Paper
Advertisement

Telangana BJP: 2029లో తెలంగాణ సీఎంగా ఆరడుగుల బుల్లెట్..?

Telangana BJP: 2029లో తెలంగాణ సీఎంగా ఆరడుగుల బుల్లెట్..?
Advertisement

Telangana BJP: స్వేచ్ఛ బ్యూరో: బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా బీజేపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 2029లో తెలంగాణలో ఏర్పడబోయేది హిందూ ప్రభుత్వమేనని, బీజేపీలో ఆరడుగులు ఉన్న ఒక వెలమ నేత ముఖ్యమంత్రి అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అందులో తానే హోంమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇంతకీ ఆ ఆరడుగుల బుల్లెట్ ఎవరు? ఆ వెలమ నేత ఎవరనేది అటు పార్టీలో, ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్రకు దారితీసింది. అసలు ఆ బుల్లెట్ పార్టీలో ఉన్నోళ్లను ఉద్దేశించి చేసినవా? లేక ఇతర పార్టీలో ఉన్న వారిని ఉద్దేశించి చేశారా? అసలు పైడి రాకేశ్ రెడ్డి ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఆరడుగుల బుల్లెట్ ఎవరు..

కాషాయ దళంలో ముఖ్యమంత్రి అయ్యేంత చరిష్మా ఉన్న వెలమ నేత ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వెలమ నేతలున్నప్పటికీ సీఎం అయ్యే స్థాయి వారికి ఉందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఉన్నా.. రాకేశ్ రెడ్డి చెప్పినట్లుగా ఆరడుగుల పోలికలున్న వెలమ నేత ఒక్కరే ఉన్నట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయనకు గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ టికెట్ ఆశించినా హైకమాండ్ ఇవ్వకపోవడం గమనార్హం. అలాంటి వ్యక్తికి బీజేపీ మైకమాండ్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఇస్తుందా? అంటే అనుమానమేనని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మరి ఆ ఆరడుగుల బుల్లెట్ ఎవరై ఉంటారనేది అందరి మెదళ్లను తెలుస్తోంది. ఇతర పార్టీలకు చెందిన నేతలెవరైనా కాషాయ పార్టీలోకి వస్తారా? దానికి సంబంధించి ఇప్పటికే మంతనాలు పూర్తయ్యాయా? అందులో భాగంగానే పైడి ఈ వ్యాఖ్యలు చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ చర్చలు కూడా పూర్తయ్యాయనుకున్నా ఆ ఆరడుగుల బుల్లెట్ ఎవరనేది మాత్రం కాషాయ పార్టీలో ఓ వర్గం శ్రేణుల్లో ఉత్కంఠ.. మరో వర్గం శ్రేణుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎందుకంటే కనీసం అలా అయినా బీజేపీ అధికారంలోకి వస్తుంది కదా అని చెబుతుండటం గమనార్హం.

8 మంది బీజేపీ ఎంపీలు..

Advertisement

కాషాయ పార్టీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి వ్యాఖ్యలు పరోక్షంగా పార్టీలోని అగ్ర నాయకత్వంపై, ముఖ్యంగా రాబోయే ఎన్నికల వ్యూహాలపై చర్చను రేకెత్తించాయి. గతంలో బీసీ సీఎం నినాదంతో వెళ్ళిన బీజేపీ, ఇప్పుడు అగ్రవర్ణ నేతలను కీలక పదవుల్లో నియమించడం పార్టీలో అంతర్గత మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత అసెంబ్లీలో మండలిలో ఫ్లోర్ లీడర్ బాధ్యతలు అగ్రవర్ణాలకు ఇవ్వడం ద్వారా వారికే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు బీసీ నేతల నుంచి వచ్చాయి. ఈ విమర్శలకు పైడి రాకేశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూర్చేలా ఉండటంతో పొలిటికల్ సర్కిల్స్ లో హీట్ పెంచినట్లయింది. రాకేశ్ రెడ్డి అక్కడితోనే ఆగకుండా మరో అడుగు ముందుకేసి రాష్ట్రంలోని 8 మంది బీజేపీ ఎంపీలు తమ పరిధిలో మెజారిటీ ఎమ్మెల్యేలను గెలిపించుకురావాలని పోటీ పెట్టాలని సూచించారు. అలాగే ఎమ్మెల్యేలకు కూడా టాస్క్ పెట్టాలని, అప్పుడే ఎవరి దమ్మేంటనేది స్పష్టంగా తెలుస్తుందని, తద్వారా నాయకత్వ పటిమపై స్పష్టత వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read: Ustaad Bhagath Singh OTT : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడు అవుతుందంటే..?

ప్రెసిడెంట్ గా ఉన్న బండి సంజయ్..

Advertisement

2029లో ఓ వెలమ నేత ముఖ్యమంత్రి అవుతారని రాకేశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన సొంత అభిప్రాయమా? లేక పార్టీ నిర్ణయాన్ని ఆయన చెప్పారా? అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్రంగా జరుగుతోంది. బీజేపీలో బీసీ నినాదం నుంచి క్రమంగా రెడ్డి, వెలమ ఆధిపత్యం వైపు మళ్లుతోందా? అనే కొత్త చర్చకు కారణమైంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో హైకమాండ్ ఆదేశాల మేరకు బీసీ సీఎం కార్డ్‌ను బీజేపీ బలంగా వాడింది. కానీ అది ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. కేవలం 8 స్థానాలకే కాషాయ దళం పరిమితం కావాల్సి వచ్చింది. అయితే దీనికి పలు కారణాలున్నాయి. అప్పటి వరకు ప్రెసిడెంట్ గా ఉన్న బండి సంజయ్ ను తొలగించడంతో పార్టీ సీనే ఒక్కసారిగా మారిపోయింది. ఫుల్ జోష్ లో ఉన్న శ్రేణులు కాస్తా డీలా పడ్డాయి. అప్పటి వరకు తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన బీజేపీ ఆ ఒక్క పరిణామంతో రేసులో వెనుకపడిపోయింది. తెలంగాణలో బీసీ ఓటర్లు శాసించే స్థానంలో ఉండటం వల్లనే బీసీ సీఎం నినాదం వర్కవుటవుతుందని కమలదళం భావించింది. దానికి తోడు ఏ పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందస్తుగా ప్రకటించకపోవడంతో అది తమకు కలిసొస్తుందని భావించి బీసీ సీఎం నినాదాన్ని కాషాయ పార్టీ ఎంచుకుంది. కానీ దేశంలో బీసీ ప్రధానిగా ఉన్నా.. తెలంగాణలో మాత్రం కమల దళానికి బీసీ సీఎం నినాదం ఏమాత్రం వర్కవుట్ అవ్వలేదనేది ఈ ఘటనతో తేటతెల్లమైంది.

ప్రశ్నార్థకంగా మారనుందా?

బీజేపీలో బీసీలకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటారు. ప్రధాని మోడీ నుంచి మంత్రి వర్గంలోనూ కీలక స్థానాలు వారికి దక్కాయనేది వాస్తవం. కానీ తెలంగాణలో మాత్రం పేరుకు మాత్రమే బీసీ సీఎంగా ప్రకటించి ఇతర కీలక పదవులు మాత్రం ఉన్నత సామాజిక వర్గాలకు కట్టబెడుతున్నారనే విమర్శలు వచ్చాయి. బండి సంజయ్ ప్రెసిడెంట్ తర్వాత కిషన్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. శాసనసభ ఫ్లోర్ లీడర్, శాసనమండలి ఫ్లోర్ లీడర్ స్థానాలను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఏవీఎన్ రెడ్డికి హైకమాండ్ బాధ్యతలు అప్పగించింది. తాజాగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన రాంచందర్ రావుకు పగ్గాలు అప్పగించింది. తద్వారా అగ్రవర్ణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు బీసీ నేతల నుంచి వస్తున్నాయి. దీంతో కాషాయ పార్టీలో బీసీ సామాజికవవర్గం భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుందా? అనే కొత్త ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ వంటి బలమైన బీసీ నేతలు ఉన్నప్పటికీ, రాకేశ్ రెడ్డి.. వెలమ సీఎం అంటూ మాట్లాడటం పార్టీలోని సామాజిక సమతుల్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోందని చర్చించుకుంటున్నారు. మొత్తానికి బీజేపీలో కొత్త చర్చకు దారితీసిన ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనేది వేచి చూడాల్సిందే.

Also read: TGFA 2025: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 వేడుకకు గెస్ట్‌లుగా బాలీవుడ్ బ్యూటీస్.. ఎవరంటే?

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×