E-Paper
Advertisement

Podarillu Today Episode : మాధవ్ కు సారీ చెప్పిన కేశవ.. కన్నీళ్లు పెట్టుకున్న కన్నా.. హారికకు షాకిచ్చిన మహా..

Podarillu Today Episode : మాధవ్ కు సారీ చెప్పిన కేశవ.. కన్నీళ్లు పెట్టుకున్న కన్నా.. హారికకు షాకిచ్చిన మహా..
Advertisement

Podarillu Today Episode March 23rd : నిన్నటి ఎపిసోడ్ లో.. మీరిద్దరూ విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారా అని కేశవ అడుగుతాడు. ఆ విడాకులు తీసుకోవాలనుకునింది మీ అన్నయ్య కాదు నేను అని మహా చెప్తుంది. ఆ మాట వినగానే కేశవ కి ఫీజులు ఎగిరిపోతాయి.. ఆ తర్వాత ఎంత చెప్తున్నా సరే మాధవ్ మాత్రం నోరు విప్పకుండా ఉంటాడు. ఏంటి మాట్లాడవు నీకు ఈ విషయం తెలీదా ఏంటి అని మాధవా ను కేశవ అడుగుతాడు. చెప్పు అన్నయ్య నీకు తెలియకుండా నీదంతా జరిగిందా? నువ్వు ఎందుకు ఏదో దాస్తున్నావ్ అని నాకు అనిపిస్తుంది నిజం చెప్పు అని కేశవ ఎంత అడిగినా సరే మాధవ్ మాత్రం నోరు విప్పకుండా మౌనంగా ఉంటాడు. ఇదంతా నీకు తెలిసే జరుగుతుంది కదా అయినా కూడా నువ్వు మౌనంగా ఉన్నావు అంటే దీని వెనక ఏదో ఉంది అని నాకు అర్థం అవుతుంది అని కేశవ మాధవాని అనుమానిస్తాడు. మాధవ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్విషయానికొస్తే.. కేశవ మహా రావడంతో ఇంటికి ఒక కళ వచ్చింది.. ఇన్నాళ్ళకి మన ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది అని చాలా సంతోషంగా ఉన్నాము. కన్నా ని చూడండి ఎలా ఏడుస్తున్నాడో.. వాడి కోసమైనా నిజం చెప్పొచ్చు కదా అని కేశవ ఎంత అడుగుతున్నా సరే చక్రి మాధవ్ ఇద్దరు కూడా మౌనంగా ఉంటారు. అటు నారాయణ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో ఉండిపోతాడు. తన ఇంటికి వచ్చిన కోడలు వెళ్ళిపోతుందేమో అని భయపడిపోతూ ఉంటాడు నారాయణ. మహాలక్ష్మి మాత్రం తన పెళ్లి ఎలా జరిగిందన్న విషయాన్ని కేశవతో చెప్పాలని ఫిక్స్ అవుతుంది.. మొత్తానికి మహాలక్ష్మి తన పెళ్లి ఎలా జరిగింది అన్న విషయాన్ని బయట పెట్టేస్తుంది. అది విన్న కేశవ షాక్ అవుతాడు.

Advertisement

మా ఇంట్లో వాళ్ళు నాకు బలవంతపు పెళ్లి ఫిక్స్ చేశారు అది ఇష్టం లేకే నేను బయటకు వచ్చేస్తాను. తప్పని పరిస్థితులలో చక్రిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అలా నా మెడలో ఈ తాళి పడింది అని మహాలక్ష్మి అసలు నిజాన్ని చెప్పేస్తుంది.. ఆ మాట వినగానే మాధవ్ కూడా మనం వాళ్ళు ఎక్కడ రారు అని రిసెప్షన్ ఏర్పాటు చేశారు కదా అదే రోజు నాకు ఈ విషయం తెలిసింది.. ఇక మనకోసం మన ఇంటి పరువు పోకూడదు అని ఒక బొమ్మలాగా ఆ రిసెప్షన్ లో నిలబడింది మహాలక్ష్మి.. ఆ తర్వాత వాళ్ళిద్దర్నీ దూరంగానే ఉంచాను.. తను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అన్నా విడాకులు తీసుకుంటానని అన్నా కూడా నేను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడానికి కారణం ఇదే అని మాధవ్ అంటాడు.

మాధవ్ ని అన్ని మాటలు అనడంతో కేశవ చాలా బాధపడిపోతాడు.. ఎలాగైనా సరే అన్నయ్యకు క్షమాపణ చెప్పాలి అని అనుకుంటాడు. బయట ఒంటరిగా ఆలోచిస్తున్న మానవ దగ్గరికి కేశవ వెళ్లి అన్నయ్య నిన్ను ఇన్ని మాటలు అన్నందుకు నాకు చాలా బాధగా ఉంది అన్నయ్య నన్ను క్షమించు అని అంటాడు. ఇంత జరిగినా కూడా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉన్నావు అంటే మా అన్నయ్య ఎంత గ్రేట్ అన్నది మాకు తెలుసు. అలాంటి మంచి అన్నయ్యని నేను బాధ పెట్టాను నన్ను క్షమించు అన్నయ్య అని కేశవ కాళ్ళు పట్టుకుంటాడు.. నా పెంపకం ఎప్పటికీ తప్పు కాదురా నువ్వు తప్పని పరిస్థితి అలా అన్నావు అంతే తప్ప నా మీద కోపం నీకు ఏమీ లేదు కదా అని మాధవ అంటాడు. ఆ మాటలు విన్న మహా బాధ పడిపోతుంది.

Advertisement

Also Read :శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. సాగర్, నర్మద మధ్య గొడవ.. శ్రీవల్లిని పరుగులు పెట్టించిన నర్మద…

లోపలికి వచ్చిన తర్వాత కన్నా ఒంటరిగా ఉండడం చూసి మహా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ కన్నా మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తన గదిలోకి వెళ్లిన మహాలక్ష్మి ఆ ఇంట్లో జరిగిన పరిస్థితులను తాను ఇంట్లో వాళ్లతో ఎలా కనెక్ట్ అయిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుని బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడే హారిక ఫోన్ చేస్తుంది. మహా నా ఫ్రెండు మధుమిత అని ఒకామె హైదరాబాదులోనే ఉంది. ఆమె ఒంటరిగా ఉంటుంది ఆమె రూముని నువ్వు షేర్ చేసుకోవచ్చు అని అంటుంది.. ఐదుగురు మగాళ్లు ఉన్న ఆ ఇంట్లో నువ్వు ఎలా ఉంటావో నాకు అర్థం అయింది.. వాళ్ల గురించి మీ అన్నయ్య చెప్పినప్పటి నుంచి నాకు చాలా బాధగా ఉంది అని హారిక అంటుంది.. హారిక మాటలు విన్న మహాలక్ష్మి మాత్రం వీళ్ళు మగాళ్లు మాత్రమే మృగాలు కాదు అని అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో మహాలక్ష్మి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×